iDreamPost
android-app
ios-app

యోగిపై దాడికి ప్లాన్‌! కానీ.. క్షణాల్లో అలెర్ట్ అయిన NSG కమాండోలు!

  • Published Sep 14, 2023 | 1:16 PM Updated Updated Sep 14, 2023 | 1:16 PM
యోగిపై దాడికి ప్లాన్‌!  కానీ.. క్షణాల్లో అలెర్ట్ అయిన  NSG కమాండోలు!

ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం యోగి ఆదిత్యనాథ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. 2017 ఉత్తర్ ప్రదేశ్ లో మొదటిసారిగా ముఖ్యమంత్రి పదవిలో కొనసాగారు. మొదటి నుంచి ఆయన పరిపాలన దూకుడుగానే కొనసాగించారు. ఈ క్రమంలోనే రెండోసారి 2022 లో జరిగిన ఎన్నికల్లో ఘన విజయాన్ని కట్టబెట్లారు యూపీ ప్రజలు. రెండోసారి సీఎం పదవిని అలంకరించిన యోగి ఆదిత్యనాథ్ మాఫియా పై ఉక్కపాదం మోపారు. దీంతో ఆయన ప్రాణాలకు ప్రమాదం ఉందని ఇంటలీజెంట్ హెచ్చిరికతో భద్రత ఏర్పాటు మరింత పటిష్టం చేశారు. తాజాగా సీఎం యోగికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఉత్తర్ ప్రదేశ సీఎం యోగి ఆదిత్యనాథ్ రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మాఫియా, గ్యాంగ్ స్టర్లపై ఎన్ కౌంటర్లతో ఉక్కుపాదాన్ని మోపారు. దేశానికి పట్టిన చీడను తాను వదిలిస్తున్నానని.. ఈ యుద్దంలో తాను చనిపోయినా దేశానికి మేలు జరుగుతుందని పలుమార్లు అన్నారు. గత ఆరేళ్లలో ఎంతోమంది గ్యాంగ్ స్టర్లను ఎన్ కౌంటర్ చేయించిన విషయం తెలిసిందే. ఆ మద్య మాజీ గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్, ఆయన సోదరుడు అష్రాఫ్ అహ్మద్ పోలీసుల సమక్షంలోనే కాల్చి చంపిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి మాఫియా లీడర్లలో భయం మరింత పెరిగిపోయింది.  ఈ క్రమంలోనే సీఎం యోగి ఆదిత్యనాథ్ పై మాఫియా లీడర్లు, గ్యాంగ్ స్టర్లు, ఉగ్రవాదుల కక్ష్య పెంచుకొకిని టార్గెట్ చేసుకుంటున్నట్లు ఇంటెలీజెన్స్ వర్గాలు గతంలో పలు మార్లు హెచ్చరించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సీఎం యోగిపై దాడి జరిగింది.. వెంటనే నేషనల్ సెక్యూరిటీ (NSG) స్పందిస్తూ ఆయనను రక్షించారు. ట్విస్ట్ ఏంటంటే.. ఇది నిజమైన దాడి కాదు. ఉగ్రదాడులను సమర్థవంతంగా ఎలా ఎదర్కోవాలి అన్న అంశంపై గురువారం విధాన సభ, లోక్ భవన్ లో రాష్ట్ర పోలీసులు, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG) నిర్వహించిన మాక్ డ్రిల్‌ను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, మంత్రులు, అధికారులు వీక్షించారు. ఈ సందర్భంగా సీఎ యోగికి ఉగ్రవాదులు అటాక్ చేసినపుడు ఎలా ఎదుర్కొంటారు.. ఎలాంటి రక్షణ ఆయుధాలు ఉపయోగిస్తారు అన్న విషయాలను ఎన్‌ఎస్‌జి అధికారి వివరించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.