iDreamPost
android-app
ios-app

Maggi Noodles: దారుణం: మ్యాగీ నూడిల్స్ తిని బాలుడు మృతి.. ఎక్కడంటే

  • Published May 12, 2024 | 1:07 PM Updated Updated May 12, 2024 | 1:07 PM

ఒకప్పుడు కేవలం నగరాలకే పరిమితమైన మ్యాగీ.. ఇప్పుడు గ్రామాలకు కూడా చేరువైంది. ఈ క్రమంలో మ్యాగీ నూడిల్స్ తిని ఓ పదేళ్ల బాలుడు చనిపోయాడు. ఆ వివరాలు...

ఒకప్పుడు కేవలం నగరాలకే పరిమితమైన మ్యాగీ.. ఇప్పుడు గ్రామాలకు కూడా చేరువైంది. ఈ క్రమంలో మ్యాగీ నూడిల్స్ తిని ఓ పదేళ్ల బాలుడు చనిపోయాడు. ఆ వివరాలు...

  • Published May 12, 2024 | 1:07 PMUpdated May 12, 2024 | 1:07 PM
Maggi Noodles: దారుణం: మ్యాగీ నూడిల్స్ తిని బాలుడు మృతి.. ఎక్కడంటే

ఒకప్పుడు ఆరోగ్యకరమైన ఆహారం అందుబాటులో ఉండేది. ఇప్పటిలా అప్పట్లో మందులు, రసాయనాలు వాడి పండించిన పంటలు కావు.. ప్రాసెస్డ్ ఫుడ్ లేదు. బర్గర్లు, పిజ్జాలు, నూడిల్స్ ఇలాంటి అనారోగ్యకరమైన ఆహారం ఉండేది కాదు. దాంతో మన ముందు తరం వాళ్లు నేటికి కూడా ఎంతో బలంగా, ఆరోగ్యంగా ఉన్నారు. మరి ఇప్పుడో.. ఆరోగ్యకరమైన ఆహారం కాదు.. కంటికి ఇంపుగా కనిపించే రెడిమేడ్ ఫుడ్ జనాలను ఆకర్షిస్తోంది. ఈ తిండి వల్ల శరీరానికి ఎలాంటి మేలు జరగకపోగా.. కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి. ఇక కొన్ని రకాల ఆహార పదార్థాలు మనుషుల ప్రాణాలు తీస్తున్నాయి. ఇక తాజాగా మ్యాగీ నూడిల్స్ తిని.. ఓ పిల్లాడు చనిపోయాడు. ఆ వివరాలు..

మ్యాగీ నూడిల్స్ గురించి ఎవరికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చిన్నారులు మొదలు.. పెద్దల వరకు ప్రతి ఒక్కరు ఏదో ఓ సందర్భంలో మ్యాగీ నూడిల్స్ తినే ఉంటారు. కేవలం రెండు నిమిషాల్లో వండేయవచ్చు.. అనే ఉద్దేశంతో చాలా మంది దీనికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఒకప్పుడు పట్టణాలకు పరిమితమైన నూడిల్స్.. ఇప్పుడు గ్రామాలకు కూడా అలవాటయ్యాయి. ఈ క్రమంలో ఓ బాలుడు మ్యాగీ నూడిల్స్ తిని చనిపోగా.. మరి కొందరి పరిస్థితి విషమంగా మారింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఆ వివరాలు..

యూపీలో విషాదం చోటు చేసుకుంది. మ్యాగీ నూడిల్స్ తిని.. పదేళ్ల బాలుడు చనిపోయాడు. మరో ఆరుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూపీ, పిలిభిత్ జిల్లాలో ఈ దారుణం వెలుగు చూసింది. బాధిత కుటుంబ సభ్యులు.. నూడిల్స్ ని అన్నంతో పాటు తిన్నారు. అంటే రెండు కలిపి తిన్నారు. దాంతో ఫుడ్ పాయిజన్ అయ్యింది. కుటుంబ సభ్యులందరూ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇది గమనించిన స్థానికులు.. వారిని.. సమీపంలోని పురాన్ పూర్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో ఓ పదేళ్ల బాలుడు చనిపోగా.. ఆరుగురు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఈ ఘటన స్థానికంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే హార్లిక్స్, లేస్ వంటి ఆహార పదార్థాల మీద అనేక సంచలన ఆరోపణలు వస్తుండగా.. ఇప్పుడు మ్యాగీ నూడిల్స్ తిని ఒకరు చనిపోవడంతో జనాలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఇక గతంలో కూడా మ్యాగీ మీద ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏకంగా ఓ బాలుడు చనిపోయాడు. మరి దీనిపై సంస్థ ఎలా స్పందిస్తుందో చూడాలి అంటున్నారు.