Dharani
UP Man Married Dutch Woman: వారిద్దరి దేశాలు వేరు.. ప్రాంతాలు వేరు.. భాషలు వేరు.. మతాలు, ఆచార సాంప్రదాయాలు కూడా వేరు. కానీ ప్రేమ వారిని కలిపింది.. వివాహ బంధంతో ఒక్కటి చేసింది. ఖండాంతరాలు దాటిన ఆ ప్రేమ కథ వివరాలు..
UP Man Married Dutch Woman: వారిద్దరి దేశాలు వేరు.. ప్రాంతాలు వేరు.. భాషలు వేరు.. మతాలు, ఆచార సాంప్రదాయాలు కూడా వేరు. కానీ ప్రేమ వారిని కలిపింది.. వివాహ బంధంతో ఒక్కటి చేసింది. ఖండాంతరాలు దాటిన ఆ ప్రేమ కథ వివరాలు..
Dharani
ప్రేమ గుడ్డిది అంటారు. అంటే లవ్ లో ఉన్నవారికి పేద, ధనిక తారతమ్యాలు తెలియవు. ప్రాంతం, భాషతో సంబంధం ఉండదు. మనసులు కలిస్తే చాలు. ఒకరిపై ఒకరికి నమ్మకం.. కలకాలం కలిసి ఉండాలనే కోరిక.. ఇవి రెండే ప్రేమకు పునాదుల వంటివి. ప్రేమించిన వారిని పొందడం కోసం ఎన్ని కష్టాలు, ఇబ్బందులు ఎదురైనా సరే.. భరిస్తారు. అడ్డంకులను దాటుకుని.. ప్రేమించిన వారి చేయి అందుకుంటారు. అయితే నేటి కాలంలో ప్రేమల్లో ఎక్కువగా స్వార్థం, రాక్షసత్వం మాత్రమే కనిపిస్తున్నాయి. అవసరాల కోసం, శారీరక వాంఛలు తీర్చుకోవడం కోసం ప్రేమ పేరుతో దగ్గరవుతున్న వారే ఎక్కువగా ఉన్నారు. ఇలాంటి జనరేషన్ లో కూడా కొన్ని స్వచ్ఛమైన ప్రేమ కథలు వెలుగు చూస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఆ కోవకు చెందిన లవ్ స్టోరీనే.
ఖండాంతరాలు దాటిన ప్రేమ కథ ఇది. అయితే పెద్దల అంగీకారంతో.. అది పెళ్లి పీటలు కూడా ఎక్కింది. భారతదేశం, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి.. నెదర్లాండ్స్ కి చెందిన యువతిని ప్రేమించి.. పెద్దల అంగీకారంతో.. హిందూ సంప్రదాయంలో వివాహం చేసుకున్నాడు. ఖండాంతరాలు దాటిన వీరి ప్రేమ గాథ ఇలా ఉంది. యూపీ, ఫతేపూర్ కి చెందిన హర్దిక్ వర్మ కొన్ని రోజుల క్రితం ఉద్యోగం నిమిత్తం నెదర్లాండ్స్ వెళ్లాడు. అక్కడ ఓ ఫార్మస్యూటికల్ కంపెనీలో సూపర్వైజర్ గా ఉద్యోగం చేస్తుండేవాడు.
ఈ క్రమంలో అక్కడే కంపెనీలో పని చేస్తోన్న సహోద్యోగి గాబ్రిలాతో హార్దిక్ కు పరిచయం ఏర్పడింది. తక్కువ కాలంలోనే వారు మంచి స్నేహితులు అయ్యారు. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలని భావించారు. తమ ప్రేమ విషయం తల్లిదండ్రులతో మాట్లాడటానికి.. గాబ్రిలాను తీసుకుని.. నవంబర్ నెలలో ఇండియాకు వచ్చాడు హార్దిక్. తామిద్దరూ ప్రేమించుకుంటున్నామని.. పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నామని.. తెలిపాడు. హార్దిక్ తల్లిదండ్రులు కూడా వారి ప్రేమకు ఎస్ చెప్పడంతో.. నవంబర్ 29న వీరి పెళ్లి జరంగింది.
బంధుమిత్రుల సమక్షంలో.. హిందూ సాంప్రదాయంలో.. ఎంతో ఘనంగా గాబ్రిలా-హార్దిక్ ల వివాహం జరిగింది. ఈ సందర్భంగా హార్దిక్ మాట్లాడుతూ.. ’’మా తల్లిదండ్రులు మా ప్రేమను అర్థం చేసుకున్నారు. పెళ్లికి కూడా అంగీకరించారు. ఇక మా కుటుంబీకులు అంతా గుజరాత్ లో ఉంటారు. కానీ మా పూర్వీకుల ఇల్లు ఫతేపూర్ లో ఉంది. అందుకే మా కుటుంబ సభ్యులందరం ఇక్కడకు వచ్చాము. ఇక హిందూ సాంప్రదాయంలో మా వివాహం జరిగింది. వచ్చే నెల అనగా డిసెంబర్ 25న నెదర్లాండ్స్ వెళ్లిపోతాం. అక్కడ క్రిస్టియన్ పద్దతిలో మళ్లీ వివాహం చేసుకుంటాం‘‘ అని తెలిపాడు. ఖండాంతారాలు దాటిన వీరి లవ్ స్టోరీ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది.