మరికొద్ది రోజుల్లో పెళ్లి కానీ.. దేశం కోసం వీరమరణం! సెల్యూట్!

మరి కొన్ని రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన జవాన్‌.. ఉగ్రవాదుల చేతిలో హతమయ్యాడు. దేశం కోసం ప్రాణత్యాగం చేశాడు. వీరుడిని తలచుకుని గ్రామం అంతా శోకసంద్రంలో ముగినిపోయింది. ఆ వివరాలు..

మరి కొన్ని రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన జవాన్‌.. ఉగ్రవాదుల చేతిలో హతమయ్యాడు. దేశం కోసం ప్రాణత్యాగం చేశాడు. వీరుడిని తలచుకుని గ్రామం అంతా శోకసంద్రంలో ముగినిపోయింది. ఆ వివరాలు..

మరి కొన్ని రోజుల్లో పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో చావు మేళం వినిపిస్తోంది. కొన్ని రోజుల్లో పెళ్లి కుమారుడిగా అలంకరించుకుని.. పీటల మీద సిగ్గుపడుతూ కూర్చోవాల్సిన వరుడు.. ఇప్పుడు మువ్వన్నెల పతాకాన్ని హత్తుకుని.. శాశ్వతంగా నిద్ర పోయాడు. బిడ్డను పెళ్లి కొడుకుగా చూసుకుని మురిసిపోవాలని భావించిన తల్లిదండ్రులు.. నేడు దేశం కోసం ప్రాణాలర్పించిన కుమారుడిని చూసి గర్వంతో పొంగిపోతున్నారు. తమ బిడ్ద ఇక రాడనే కఠిన నిజం గుండెల్ని మెలిపెడుతున్నా.. కన్నీటితో బిడ్డ త్యాగాన్ని తక్కువ చేయడం ఇష్టం లేక.. బాధను పంటి బిగువన బిగబట్టారు. ఇక జవాన్‌ మరణవార్తతో ఊరు ఊరంతా శోకసంద్రంలో మునిగిపోయింది. మరి ఈ విషాదకర సంఘటన ఎక్కడ జరిగింది అంటే..

జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య చోటు చేసుకున్న ఎన్‌కౌంటర్‌లో ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌కు చెందిన సచిన్ అనే జవాన్‌ వీరమరణం పొందాడు. అతడి స్వస్థలం అలీఘర్‌లోని తప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నగరియ గొర్ల గ్రామం. జమ్మూ కశ్మీర్‌లోని రాజౌరీ కలాకోట్‌లోని బాజిమాల్‌లో బుధవారం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో ఐదుగురు జవాన్లు వీరమరణం పొందారు. వారిలో ఒకరు సచిన్.

మరో దారుణమైన అంశం ఏంటంటే మరి కొద్ది రోజుల్లో సచిన్‌ పెళ్లి. డిసెంబర్‌ 8న సచిన్‌ వివాహం జరగాల్సి ఉంది. మునిగిపోయింది. ఇప్పటికే పెళ్లికి సెలవులు కోసం అప్లై చేసుకున్నాడు. త్వరలోనే ఇంటికి వచ్చి.. వివాహం చేసుకోవాల్సిన వ్యక్తి.. ఉగ్రవాదులతో పోరాడుతూ.. దేశ సేవలో వీర మరణం పొందాడు. సెలవుల మీద ఇంటికి వచ్చి పెళ్లి చేసుకోవాల్సిన వాడు.. ఇప్పుడు మృతదేహమై గ్రామానికి చేరుకోనున్నాడు. ఉగ్రవాదుల చేతుల్లో హతమైన సచిన్‌ను తలచుకుని.. అతడి కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. బిడ్డ కడసారి చూపు కోసం వారంతా ఎదురు చూస్తున్నారు.

ఇక సచిన్‌ మరణించాడనే వార్త తెలిసి గ్రామస్తులు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఇక స్వగ్రామంలో సైనిక లాంఛనాలతో అతడి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సచిన్ అన్నయ్య కూడా భారత నౌకాదళంలో చేరి.. దేశానికి సేవలందిస్తున్నాడు. సచిన్ 2019 మార్చి 20న ఆర్మీలో చేరాడు. అనంతరం స్పెషల్ ఫోర్స్‌లో కమాండో అయ్యాడు. ప్రస్తుతం సచిన్ రాజౌరిలోని పారా II రెజిమెంట్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. మథుర ప్రాంత నివాసి అయిన అమ్మాయితో కొన్ని రోజుల క్రితం సచిన్‌కు వివాహం నిశ్చయమైంది. ఎంగేజ్‌మెంట్‌ కూడా జరిగింది. అనంతరం డిసెంబర్ 8వ తేదీన వివాహ తేదీగా నిర్ణయించారు. ఈ మేరకు ఇంట్లో పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ ఇంతలోనే ఇలాంటి విషాదం చోటు చేసుకుంది.

Show comments