iDreamPost
android-app
ios-app

మార్కులు చూసుకుని.. మూర్ఛపోయాడు.. కట్‌ చేస్తే ICUలో తేలాడు

పరీక్షలతో సతమతమైన విద్యార్థులు.. ఇప్పుడు రిజల్ట్స్ టెన్షన్లతో ఆందోళన చెందుతున్నారు. మార్కులు ఎలా వస్తాయో అన్న సందేహం.. తక్కువ వస్తే ఇంట్లో పరిస్థితి తలచుకుని భయపడిపోతుంటారు. అయితే ఈ విద్యార్థి రిజల్ట్స్ చూసుకుని

పరీక్షలతో సతమతమైన విద్యార్థులు.. ఇప్పుడు రిజల్ట్స్ టెన్షన్లతో ఆందోళన చెందుతున్నారు. మార్కులు ఎలా వస్తాయో అన్న సందేహం.. తక్కువ వస్తే ఇంట్లో పరిస్థితి తలచుకుని భయపడిపోతుంటారు. అయితే ఈ విద్యార్థి రిజల్ట్స్ చూసుకుని

మార్కులు చూసుకుని.. మూర్ఛపోయాడు.. కట్‌ చేస్తే ICUలో తేలాడు

మొన్నటి వరకు పరీక్షలు అంటూ పుస్తకాలతో కుస్తీ పడిన టెన్త్, ఇంటర్, ప్లస్ 2 విద్యార్థులు.. ఇప్పుడు రిజల్ట్స్ టెన్షన్లతో సతమతమౌతున్నారు. వరుసగా పది, ఇంటర్ ఫలితాలు వస్తున్నాయి. ఈ ఫలితాలు వారి భవిష్యత్తును నిర్ణయిస్తాయో లేదో తెలియదు కానీ.. ఇంట్లో పేరెంట్స్ మాత్రం డిసైడ్ చేస్తారు. ఊహించని విధంగా మార్కులు వస్తే ఓకే కానీ.. రాలేదంటే.. తల్లిదండ్రుల చేతిలో వీపు విమానం మోత మోగాల్సిందే. అమ్మాయిలు ఎలాగో సరస్వతి పుత్రికలు అనే భావన ఉంది కనుక ఈ రిజల్ట్స్ వీరిపై పెద్దగా ప్రభావితం చూపవు. కానీ అబ్బాయి పరిస్థితులే వేరు. చావు దెబ్బలు తినాల్సి వస్తుంది. పేరెంట్స్ కొడతారు, తిడతారు అన్న భయంతోనే కొంత మంది విద్యార్థులు అఘాయిత్యాలకు కూడా ఒడిగడుతుంటారు.

అందుకే పరీక్షల సమయం కన్నా.. ఫలితాలు విడుదలయ్యేటప్పుడు ఎక్కువ ఒత్తిడికి గురౌతుంటారు విద్యార్థులు. తాజాగా ఏపీలో ఫలితాలు విడులయ్యాయి. అలాగే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా తాజాగా 10, 12వ తరగతి ఫలితాలను వెల్లడించింది. 10వ తరగతి విద్యార్థులు 89.55 శాతం ఉత్తీర్ణత సాధించగా.. 12వ తరగతి విద్యార్థులు 82.60 శాతం ఉత్తీర్ణులయ్యారు. మీరట్‌లోని మోడీపురం మహర్షి దయానంద్ ఇంటర్ కాలేజీకి చెందిన 10వ తరగతి విద్యార్థి అన్షుల్ కుమార్ కూడా అందరి విద్యార్థుల్లాగే ఫలితాల కోసం ఈగర్లీ వెయిట్ చేశాడు. ఫలితాల రోజు రానే వచ్చింది. శనివారం ఫలితాలను ప్రకటించింది బోర్డు. అన్షుల్ కూడా తన మార్కులను చూసుకున్నాడు.

అంతే.. ఒక్కసారిగా షాక్‌కు గురై.. స్పృహ తప్పి పడిపోయాడు. 10వ తరగతి ఫలితాల్లో అన్షుల్ 93.5 శాతం మార్కులు సాధించాడు. ఈ ఫలితాలు చూసి.. నమ్మలేకపోయాడో..లేక ఊహించలేదో తెలియదు కానీ ఈ మార్కులు చూసి ఆనందంతో ఉబ్చితబ్బిబ్బ అయిపోయి.. ఒక్కసారిగా మూర్చబోయి పడిపోయే సరికి.. హుటా హుటిన ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. అతడికి వెంటనే ఐసీయులో చేర్చి చికిత్స అందించారు వైద్యులు. అన్షుల్ తండ్రి సునీల్ కుమార్ ఫోస్టాపీసులో కాంట్రాక్ట్ వర్కర్ గా పనిచేస్తున్నారు. ఆయన మాట్లాడుతూ.. అన్షుల్ తన ఫలితాలను చూసుకుని పట్టరాని సంతోషంతో ఉన్నాడని, ఆకస్మాత్తుగా కుప్పకూలి.. అందరినీ షాక్‌ కు గురిచేశాడంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అతడి పరిస్థితి మెరుగ్గా ఉందని పేర్కొన్నాడు.