P Venkatesh
దేశంలోని వారికి వరంగా మారింది ఈ-శ్రమ్ కార్డు. ఈ కార్డు కలిగిన వారు ఉచితంగా రూ. 2 లక్షల వరకు ప్రమాద బీమాను పొందొచ్చు. మరి ఈ కార్డు పొందేందుకు ఎవరు అర్హులు, ఎలా పొందాలి. ఆ వివరాలు మీకోసం..
దేశంలోని వారికి వరంగా మారింది ఈ-శ్రమ్ కార్డు. ఈ కార్డు కలిగిన వారు ఉచితంగా రూ. 2 లక్షల వరకు ప్రమాద బీమాను పొందొచ్చు. మరి ఈ కార్డు పొందేందుకు ఎవరు అర్హులు, ఎలా పొందాలి. ఆ వివరాలు మీకోసం..
P Venkatesh
దేశంలో అనేక వృత్తుల వారు ఉన్నారు. వివిధ రంగాల్లో పనిచేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. అయితే ప్రభుత్వ రంగం, కొన్ని ప్రైవేట్ సంస్థలు మాత్రమే ఉద్యోగులకు పీఎఫ్, ఈఎస్ఐ వంటి సౌకర్యాలను కల్పిస్తున్నాయి. కానీ అసంఘటిత రంగంలో పనిచేస్తున్న వారికి మాత్రం ఏవిధమైన ప్రయోజనాలు అందడం లేదు. వారు పని చేసే క్రమంలో ప్రమాదవాశాత్తు మరణిస్తే ఏ విధమైన పరిహారం లభించకపోయేది. దీంతో బాధితుల కుంటుంబాలు రోడ్డున పడేవి. అయితే అసంఘటిత రంగంలో పనిచేసే వారిని ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ శ్రమ్ కార్డ్ ను ప్రవేశపెట్టింది. ఈ కార్డ్ కలిగిన కార్మికులకు ఉచితంగా రూ. 2 లక్షల ప్రమాద బీమా అందిస్తుంది. మరి ఈ కార్డు పొందేందుకు లెవరు అర్హులు, కార్డు ఎలా పొందాలి ఆ వివరాలు మీకోసం..
కార్మికులను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను ప్రవేశపెడుతున్నాయి. కానీ ఆ పథకాల గురించి తెలియక చాలా మంది ప్రయోజనాలను పొందలేక పోతున్నారు. ఈ నేపథ్యంలో అసంఘటిత రంగాల్లో పని చేసే కార్మికులకు ప్రయోజనం చేకూర్చే విధంగా.. కేంద్రం లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మంత్రిత్వ శాఖ 2021 ఆగస్టు 26న ఈ-శ్రమ్ పోర్టల్‌ను ప్రారంభించింది. వలస కూలీలు, భవన నిర్మాణ రంగ కార్మికులు, ఇళ్లల్లో పని చేసే వారు, వీధి వ్యాపారులు, వెయిటర్స్, బ్యుటీషియన్స్, హస్తకళా కార్మికులు, వ్యవసాయ కార్మికులు సహా.. వివిధ పనులు చేసే వారికోసం ఈ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. అసంఘటిత రంగాల్లో పని చేస్తున్న వారికి ప్రావిడెంట్ ఫండ్, ఇన్సూరెన్స్ వంటి సౌకర్యాలు ఉండవు. అలాంటి వారికి ఈ ఈ-శ్రమ్ కార్డు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ కార్డు పొందిన కార్మికులు దురదృష్టవశాత్తు ప్రమాదానికి గురై పాక్షిక వికలాంగులుగా మారితే రూ.1 లక్ష, శాశ్వత వైకల్యం లేదా మరణం సంభవించినప్పుడు రూ. 2 లక్షలు బీమాను అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం.