Arjun Suravaram
ప్రతి ఒక్కరి సొంతి ఇళ్లు అనేది ఒక కల. దానిని నిరవేర్చుకునేందుకు ఎంతో కష్టపడుతుంటారు. అయితే తక్కువ ధరకే ఇళ్లు దొరకడం అనేది చాలా అరుదు. అయితే ఓ సంస్థ కేవలం 70 వేలకే ఇళ్లను అందిస్తుంది.
ప్రతి ఒక్కరి సొంతి ఇళ్లు అనేది ఒక కల. దానిని నిరవేర్చుకునేందుకు ఎంతో కష్టపడుతుంటారు. అయితే తక్కువ ధరకే ఇళ్లు దొరకడం అనేది చాలా అరుదు. అయితే ఓ సంస్థ కేవలం 70 వేలకే ఇళ్లను అందిస్తుంది.
Arjun Suravaram
చాలా మందికి ఉండే ఎన్నో కొరికల్లో ప్రధానమైనది సొంతింటి కల. చాలా మంది పేద, మధ్యతరగతి వారు సొంతిట్లో ఉండాలని భావిస్తుంటారు. అందుకే రేయింబవళ్లు కష్టపడి ధనం కూడబెట్టుకుంటారు. అయితే పెరుగుతున్న ధరలకు, ఖర్చులకు చాలా మంది సొంతింటి కల కలగానే మిగిలిపోతుంది. లక్షల్లో డబ్బులు ఖర్చుపెట్టాల్సి రావడంతో చాలా మంది సొంతింటికి కలను సాకారం చేసుకోలేకపోతున్నారు. అలాంటి వారికి ఒక గుడ్ న్యూస్ వచ్చిందనే చెప్పాలి. ఓ సంస్థ అతి తక్కువ ధరకే ఇంటిని సిద్దం చేసి ఇస్తుంది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం….
పేద మరియు మధ్య తరగతి వారికి అందుబాటు ధరలో ఇళ్ల నిర్మాణం చేస్తుంది ‘ఉన్నతి’ అనే సంస్థ. ఈ కంపెనీ చాలా మంది వినే ఉంటారు. కర్నాటక రాష్ట్రంలోని చిక్కమంగళూరు కేంద్రంగా ఈ సంస్ధ పని చేస్తుంది. దీనిని భాగ్యదేవ్ అనే సివిల్ ఇంజనీర్ స్థాపించారు. సామాన్యులకు, పేద వాళ్లకు తక్కువ ఖర్చుతోనే ఇల్లు అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ ను ప్రారంభించారు. ఇప్పుడు అతను దేశమంతటా ఎంతో పేరు సంపాదించాడు. అందుకు ఈ ప్రాజెక్ట్‌లో కొన్ని అంశాలు ఉన్నాయి. అందులో ఒకటి అతను చాలా తక్కువ డబ్బుతో ఇళ్ళు నిర్మించాడు. చాలా తక్కువ సమయంలోని ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తున్నారు.
అలానే ఈ ఇళ్లను ఆస్ట్రేలియన్ స్టైల్ రాపిడ్ వాల్ టెక్నాలజీని ఉపయోగించి నిర్మించారు. ఇక ఇతను నిర్మించి ఇళ్ల ప్రత్యేకంగా ఉంటాయి. స్థిరమైన, నాణ్యమైన కాంక్రీట్ తో ఈ ఇళ్ల నిర్మించబడతున్నాయి. ఒక అంగుళం, ఒకటిన్నర అంగుళం లేదా రెండు అంగుళాల కాంక్రీట్ గోడను ఇంటిని నిర్మిస్తున్నాడు. అలానే పర్యావరణం, వినియోగదారుని ఆర్థిక పరిస్థితి దృష్టిలో ఉంచుకుని ఇళ్ల నిర్మాణం చేస్తుంది ఈ సంస్థ. తొలుత కాంక్రీట్ గోడలను కట్టడం ద్వారా ఈ ఇల్లు నిర్మాణం ప్రారంభిస్తారు.
ఈ సివిల్ ఇంజనీర్ నిర్మించే ఇళ్లను అడ్వాన్స్‌డ్ ఎకో ఫ్రెండ్లీ ప్రిఫ్యాబ్రికేటెడ్ ఇళ్లు అని అంటారు. గోడను ముందుగానే తయారు చేసి ఉంచడం వలన, ఇంటి నిర్మాణం చాలా తక్కువ సమయం పడుతుంది. అదే విధంగా ఖర్చు కూడా తగ్గుతుంది. తక్కువ ఖర్చుతో పాటు నాణ్యత విషయంలో ఈ సంస్థ అసలు రాజీ పడటం లేదు. ఇవి తక్కువ ఖర్చుతో నాణ్యమైన ఇళ్లు. కేవలం 70 వేల ఖర్చుతో కూడా మీరు ఈ సంస్థ ద్వారా ఇల్లు నిర్మించుకోవచ్చు. ఈ బడ్జెట్ కే 150 నుండి 200 చదరపు అడుగుల విస్తీర్ణంలో హాల్ లేదా వంటగది ఉన్న ఇల్లు లభిస్తుంది. అదే విధంగా 1 బీహెచ్ కే, 2బీహెచ్ కే ఇళ్లులు కూడా చౌకైనా ధరలకు లభిస్తాయని సదరు సంస్థ తెలిపింది. పూర్తి వివరాల కోసం… ఈ లింక్ పై క్లిక్ చేయండి. మొత్తంగా దేశ వ్యాప్తంగా చౌకగా ఇళ్లు నిర్మించాలనే ఈ సంస్థ ఆలోచిస్తుంది. ఈ క్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లోకి కూడా త్వరలో రాబోతుందని సమాచారం.