Arjun Suravaram
Jyotiraditya Scindia: రెండు రోజుల క్రితమే సీరియల్ నటి పవిత్ర రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా కేంద్ర మంత్రి ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కేంద్ర మంత్రికి మాతృవియోగం జరిగింది.
Jyotiraditya Scindia: రెండు రోజుల క్రితమే సీరియల్ నటి పవిత్ర రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా కేంద్ర మంత్రి ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కేంద్ర మంత్రికి మాతృవియోగం జరిగింది.
Arjun Suravaram
ఈ మధ్యకాలంలో సినీ, రాజకీయ రంగాల్లో విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. వివిధ కారణాలతో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తిరిగిరాని లోకాలకు వెళ్తున్నారు. ఆత్మహత్య, గుండెపోటు, అనారోగ్య సమస్య,రోడ్డు ప్రమాదం వంటి కారణాలతో సెలబ్రిటీలు మరణిస్తున్నారు. ఇలా పలువురు ప్రముఖల మరణం వారి కుటుంబ సభ్యులతో పాటు అభిమానులను కన్నీటి సంద్రంలో ముంచేస్తుంది. రెండు రోజుల క్రితమే సీరియల్ నటి పవిత్ర రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా కేంద్ర మంత్రి ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కేంద్ర మంత్రికి మాతృవియోగం జరిగింది.
కేంద్రమంత్రి జ్యోతిరాధిత్య సింధియా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మధ్యప్రదేశ్ రాజకీయాల్లో ఆయన కీలకమైన నేత. కాంగ్రెస్ లో ఉన్న ఆయన వివిధ కారణాలతో ఆపార్టీకీ గుడ్ బై చెప్పి.. బీజేపీలో చేరారు. అలానే కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల వేళ కేంద్రమంత్రి జ్యోతిరాధిత్య సింధియా బిజీగా ఉన్నారు. ఇదే సమయంలో ఆయన ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయనకు మాతృవియోగం కలిగింది.
జ్యోతిరాదిత్య సింధియా తల్లి మాధవి రాజే సింధియా తుది శ్వాస విడిచారు. ఆస్పత్రి వర్గాలు ఆమె మరణాన్ని దృవీకరిస్తూ ప్రకటన విడుదల చేశాయి. ఆమె చాలా కాలంగా నిమోనియాతో బాధపడుతోన్నారు. ఈ క్రమలో ఆమె కొద్దిరోజులుగా ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. ఈక్రమంలోనే బుధవారం ఉదయం చికిత్స పొందుతూ ఆమె తుది శ్వాస విడిచారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి.
ఇక సింధియా కుటుంబ గురించి చూసినట్లు అయితే..వీరు నేపాల్ రాజకుటుంబానికి చెందిన వారు. నేపాల్ రాజకుటుంబానికి చెందిన మాధవి రాజే ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు, మహారాజా మాధవరావు సింధియా-2ను వివాహం చేసుకున్నారు. వీరికి జ్యోతిరాధియ్య సింధియా జన్మించారు. మాధవరావు సింధాయా-2 మధ్యప్రదేశ్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేవారు. తనదైన శైలీలో రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పే వారు. 2001లో ఉత్తరప్రదేశ్‌లోని జరిగిన విమాన ప్రమాదంలో ఆయన మరణించారు.
ఇక ఆయన పేరు మీద మాధవి రాజే ఎన్నో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పేదలకు సరైన విద్య, వైద్యం అందించాలనే సంకల్పంతో 24 సేవా ట్రస్టులను నెలకొల్పి సేవ చేశారు. అలానే వీరి రాజకీయ వారసుడిగా జ్యోతిరాధియ్య సింధియా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్ తరపు నుంచి కేంద్ర మంత్రి విధులు నిర్వహిస్తున్నారు. ఇక మాధవి రాజే మృతి పట్ల రాజకీయ ప్రముఖులు తమ సంతాపం తెలియజేస్తున్నారు.