బడ్జెట్ -2024 లో మహిళలకు భారీ శుభవార్త.. వారికి రూ.3లక్షల కోట్లు!

Union Budget 2024: మంగళవారం కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్... పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మహిళలకు వారు భారీ శుభవార్త ను తెలిపారు. వారి అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించారు.

Union Budget 2024: మంగళవారం కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్... పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మహిళలకు వారు భారీ శుభవార్త ను తెలిపారు. వారి అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించారు.

కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చింది.​ ఈ క్రమంలోనే  పార్లమెంట్ లో తొలిసారి పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ లోక్​సభలో 2024-25 వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఇలా వరుసగా ఆమె ఏడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. అత్యధిక సార్లు మోరార్జీ దేశాయ్ పది సార్లు బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. 2019లో నరేంద్ర మోదీ రెండోసారి ప్రధాని అయినప్పుడు నిర్మల సీతారామన్‌ను ఆర్థిక మంత్రిగా నియమించారు. దీంతో భారతదేశ చరిత్రలో పూర్తిస్థాయి ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా ఆమె అరుదైన ఘనత సాధించారు. తాజాగా ఆమె ఇప్పుడు ప్రవేశపెట్టింది ఏడోది. ఇక బడ్జెట్‌ 2024 విషయానికి వస్తే.. మహిళలకు  భారీ శుభవార్త చెప్పారు నిర్మలా సీతారామన్‌. ఆ వివరాలు..

మంగళవారం ప్రవేశపెట్టిన కేంద్రం బడ్జెట్ -2024లో మహిళలకు మంచి ప్రాధాన్యత ఇచ్చారు. ఇంకా చెప్పాలంటే..వారికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. వారి అభివృద్ధికోసం భారీగా నిధులను కేటాయించారు. మహిళలు, బాలికలకు లబ్ధి చేకూర్చే అనేక పథకాలు ఉన్న విషయం తెలిసింది. ఆ స్కీమ్ కు రూ.3 లక్షల కోట్లు కేటాయించారు ఆర్థిక మంత్రి. అదే విధంగా మహిళల ఆస్తుల రిజిస్ట్రేషన్ డ్యూటీ తగ్గింపు. ప్రధాన మత్రి సూర్యఘర్ పథకం కింద కోటి ఇళ్లకు 300 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించింది. అణు విద్యుత్ దృష్టి సారించిన కేంద్రం.. కొత్తగా రియాక్టర్లను ఏర్పాటు చేయనుంది. అంతేకాక ఈశాన్య ప్రాంతంలో ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ 100కు పైగా శాఖలు ఏర్పాటు చేయనున్నారు.

దేశ ఆహార భద్రత కోసం పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేయాలని కేంద్రం ప్రభుత్వం భావించింది. కేంద్ర బడ్జెట్ 2024 ఎంఎస్ఎంఈలు, కార్మిక ఆధారిత తయారీపై ప్రత్యేక దృష్టి సారించింది. ఎంఎస్ఎంఈలకు చేయూత ఇచ్చేందుకు ముద్ర రుణ పరిమితి  పెంచింది. ఇప్పటి వరకు రూ.10 లక్షలు ఉన్నదాన్ని రూ.20 లక్షలకు పెంచింది. ఇదే బడ్జెట్ లో పేద వారికి, విద్యార్థులకు కూడా గుడ్ న్యూస్ చెప్పారు. ఆకలితో ఎవరు బాధపడకూడదనే ఉద్దేశంతో పేదలకు ఉచితంగా రేషన్‌ అందించేందుకు ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. తాజా బడ్జెట్‌లో ఈ పథకాన్ని మరో ఐదేళ్ల పాటు పొడగిస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. అలానే భారత దేశంలో చదివే విద్యార్థుల చదువుకోసం కూడా 3 శాతం వడ్డీ రాయితీని ప్రకటించింది. అలానే ట్యాక్స్ పేయర్లకు కూడా కాస్తా ఉపశమనం కల్పించారు.

సకాలంలో టీడీఎస్ చెల్లించకపోవడం ఇకపై నేరం కాదన్నారు.  మొబైల్ ఫోన్ ఛార్జర్లు చౌకగా లభిస్తాయి. వీటితో పాటు విద్యుత్ వైర్‌లు, ఎక్స్ రే యంత్రాలు చౌకగా లభిస్తాయి. మూడు కేన్సర్ ఔషధాలపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గించారు. బంగారం, వెండిపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గించారు. మొత్తంగా వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ 3.0ను ప్రవేశపెట్టింది. నరేంద్ర మోదీ నాయకత్వంలో మూడో సారి బడ్జెట్‌ ప్రవేశపెడుతున్నందుకు గర్వపడుతున్నాని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. రైతులు, మహిళలు, విద్యార్ధులు, పేదలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఈ బడ్జెట్‌ను ప్రవేశ పెడుతున్నామని వెల్లడించారు.

Show comments