iDreamPost
android-app
ios-app

సనాతన ధర్మంపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఉదయనిధి స్టాలిన్.. ఏమన్నారంటే?

సనాతన ధర్మంపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఉదయనిధి స్టాలిన్.. ఏమన్నారంటే?

తమిళనాడు సీఎం ఎంకె స్టాలిన్ తనయుడు యువజన, క్రీడా అభివృద్ధి మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఓ కార్యక్రమంలో భాగంగా పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనిపైన బీజేపీ నాయకులు ఉదయనిధి స్టాలిన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హింధువులు మనోభావాలను దెబ్బతీసే విధంగా తన వ్యాఖ్యలు ఉన్నాయంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. ఇంతకీ ఉదయనిధి స్టాలిన్ ఏమన్నాడంటే.. సనాతన ధర్మంపై మాట్లాడుతూ.. సామాజిక న్యాయానికి వ్యతిరేఖంగా ఉన్న సనాతన ధర్మాన్ని సమూలంగా నిర్మూలించాలని పేర్కొన్నారు. ఇక ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా పెద్ద దుమారమే రేగుతోంది.

సనాతన నిర్మూలన సదస్సులో పాల్గొన్న ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో పోల్చారు. సమానత్వ భావనకు వ్యతిరేఖంగా సనాతన ధర్మం ఉన్నట్లు తెలిపారు. డెంగ్యూ, మలేరియాను ఏవిధంగానైతే నిర్మూలిస్తున్నామో అదే విధంగా సనాతన ధర్మాన్ని సమాజం నుంచి పారద్రోలాలని వెల్లడించాడు. ఈ వ్యాఖ్యలతో ఉదయనిధి స్టాలిన్ చిక్కుల్లో పడ్డట్లైంది. సనాతన అనేది సంస్కృత పదం అని, ఇది సామాజిక న్యాయానికి పూర్తి విరుద్దమని తెలిపారు. సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాలవీయ ఆగ్రహం వ్యక్తం చేశారు.

సనాతన ధర్మాన్ని పాటిస్తున్న హిందువుల మారణహోమానికి ఉదయనిధి స్టాలిన్ పిలుపినిచ్చారని అమిత్ మాలవీయ ఆరోపించారు. కాంగ్రెస్ కు మిత్ర పక్షంగా ఉంటున్న డీఎంకే వ్యాఖ్యలపై ఇండియా కూటమి ఎందుకు స్పందించడం లేదంటూ ప్రశ్నించారు. దీనిపై స్పందించిన ఉదయనిధి స్టాలిన్ తాను ఏ వర్గానికి వ్యతిరేకంగా మాట్లాడలేదని, సనాతన ధర్మం కారణంగా వివక్షతకు గురవుతున్న ప్రజల తరపున మాట్లాడినట్లు సమర్థించుకున్నారు. అయితే స్టాలిన్ పై చర్చలు తీసుకుంటామని లీగల్ రైట్స్ అబ్సర్వేటరీ స్పందిచగా.. ఎలాంటి చర్యలనైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నానని, సమ సమాజ స్థాపన కొరకు ముందుండి పోరాడుతామని ఉదయనిధి స్టాలిన్ స్పష్టం చేశారు.