iDreamPost
android-app
ios-app

వీడియో: కోట్లలో ‘ఉబర్‌’ రైడ్‌ బిల్లు.. కళ్లు తేలేసిన కస్టమర్!

  • Published Mar 31, 2024 | 6:36 PM Updated Updated Mar 31, 2024 | 6:36 PM

Uber Ride Bill in Crores: ఈ మధ్య కాలంలో ప్రయాణికులకు ఎన్నో రకాల సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. లోకల్ గా వెళ్లే వాళ్లకు ఊబర్, ఓలా, ర్యాపిడ్ సర్వీసులు వచ్చిన విషయం తెలిసిందే.

Uber Ride Bill in Crores: ఈ మధ్య కాలంలో ప్రయాణికులకు ఎన్నో రకాల సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. లోకల్ గా వెళ్లే వాళ్లకు ఊబర్, ఓలా, ర్యాపిడ్ సర్వీసులు వచ్చిన విషయం తెలిసిందే.

వీడియో: కోట్లలో ‘ఉబర్‌’ రైడ్‌ బిల్లు.. కళ్లు తేలేసిన కస్టమర్!

ఇటీవల దేశంలో ప్రయాణాలు చేసేవారికి ఎన్నో సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. అర్జంట్ గా ఎవరికైనా ప్రయాణాలు చేయాల్సి వస్తే వెంటనే గుర్తుకు వచ్చేది ఊబర్, వోలా. లోకల్ గా వాహనాలు లేని వారు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ఊబర్ ఆటోలు, ట్యాక్సీలు ఆశ్రయిస్తున్నారు. దేశ వ్యాప్తంగా ప్రైవేట్ వాహనాల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతూనే ఉన్నాయి. సాధారణంగా ఏదైనా ఆటో, ట్యాక్సీ ఎక్కితే ఎంత బిల్లు వస్తుంది. మహా అంటే వందల్లో మరీ దూరమైతే వేలల్లో వస్తుంది. తాజాగా ఉబర్ ఆటో ఎక్కిన కస్టమర్ తనకు వచ్చిన బిల్లు చూసి మైండ్ బ్లాంక్ అయ్యింది. ఇంతకీ ఆ బిల్లు ఎంత వచ్చింది? కస్టమర్ ఎందుకు షాక్ తిన్నాడు అన్న విషయం గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

దేశ రాజధాని ఢిల్లీ సమీపంలోని నోయిడాలో దీపక్ తెంగురియా అనే వ్యక్తి రొటీన్ గా తాను వెళ్లే రూట్ లో ఉబర్ ఆటో రైడ్ బుక్ చేశాడు. రైడ్ తక్కువ దూరం కావడంతో రూ.62 బిల్లు చూపించింది. ఆటో ఎక్కి డెస్టినేషన్ లో దిగి బిల్లు పే చేద్దామని తన సెల్ ఫోన్ మెసేజ్ చూశాడు. అంతే మనోడి మైండ్ బ్లాంక్ అయ్యింది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా రూ.7,66,83,762 కోట్లు పే చేయాలని బిల్లు చూపించింది. అందులో టిప్ చార్జీ కోటిన్నరకు పైగా ఉంది, వెయిటింగ్ చార్జి దాదాపు రూ.6 కోట్లు ఉంది. ఆ బిల్లు చూసిన కష్టమర్ మొదట ఖంగుతిన్నాడు. తర్వాత తేరుకొరుకున్న దీపక్ వెంటనే దాన్ని వీడియో తీసి తన ఫ్రెండ్ కి షేర్ చేశాడు.

దీనిపై స్నేహితులిద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. వామ్మో నువు చంద్రయాన్ కు రైడ్ బుక్ చేసుకున్నావా ఏంటీ? ఇంత బిల్లు వచ్చిందని జోకులు వేసుకున్నారు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీనిపై స్పందించిన ఉబర్ సంస్థ ‘భారీ బిల్లు ఇచ్చినందుకు క్షమించాలి., బిల్లు అలా ఎలా వచ్చిందో, సమస్య ఎక్కడ ఉత్పన్నమైందో మాకు కొంత సమయం ఇస్తే పరిష్కరిస్తామని ’ సందేశం పంపించింది. గతంలో ఊబర్, ఓలా సర్వీస్ లో ఇదే తరహాలో  లక్షల్లో బిల్లు రావడం.. తర్వాత వాటిని వెంటనే కరెక్షన్ చేసుకున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

 

View this post on Instagram

 

A post shared by Aha Emi Ruchi (@ahaemiruchi2)