Arjun Suravaram
ఇటీవల తరచూ కొన్ని అసభ్యకర ఘటనలతో మెట్రో రైళ్లు వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. అసభ్యకర చేష్టలు, రోమాన్స్ సీన్లు, డ్యాన్స్ రీల్స్ వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. తాజాగా మరో ఘటన మెట్రోలో చోటుచేసుకుంది.
ఇటీవల తరచూ కొన్ని అసభ్యకర ఘటనలతో మెట్రో రైళ్లు వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. అసభ్యకర చేష్టలు, రోమాన్స్ సీన్లు, డ్యాన్స్ రీల్స్ వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. తాజాగా మరో ఘటన మెట్రోలో చోటుచేసుకుంది.
Arjun Suravaram
ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు వంటి మహానగరాల్లో ట్రాఫిక్ సమస్య నుంచి తప్పించుకునేందుకు మెట్రో రైళ్లు అందుబాటులో ఉన్న సంగతి తెలిసింది. వీటి ద్వారా నిత్యం ఎంతో మంది ప్రయాణం సాగిస్తుంటారు. అయితే ఇటీవల కాలంలో వివిధ సంఘటనలో మెట్రో రైళ్లు వార్తల్లో నిలుస్తున్నాయి. చిత్రి విచిత్రమైన ఘటనలు మెట్రోలో చోటుచేసుకుంటున్నాయి. కొందరు రీల్స్ చేస్తుండాగా, మరికొందరు బాక్సింగ్ తరహాలో ఫైటింగ్ చేస్తున్నారు. గతంలో మహిళలు మెట్రోలో పొట్టుపొట్టున్న కొట్టుకున్న ఘటనలు మనం చూశాం. తాజాగా ఇద్దరు యువకులు ఏకంగా చెప్పులను చేతబట్టి మరి కొట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇటీవల తరచూ కొన్ని అసభ్యకర ఘటనలతో ఢిల్లీ మెట్రో వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. అసభ్యకర చేష్టలు, రోమాన్స్ సీన్లు, డ్యాన్స్ రీల్స్ వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. తోటి ప్రయాణికులు ఉన్నారనే సంగతి మర్చిపోయి మరీ..కొందరు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంటారు. కొందరు యువత శృతి మించి ప్రవర్తిస్తూ..మెట్రోనే తమ ప్రైవేటు ప్లేస్ గా మార్చేస్తున్నారు. అలా అందరి ముందే మెట్రోలో రొమాన్స్ చేస్తూ రెచ్చిపోతున్నారు. ఇది ఇలా ఉంటే.. మరికొందరు మెట్రోను బాక్సింగ్ తరహాలో ఫైటింగ్ కి వేదికగా మార్చుకుంటున్నారు. గతంలో ఇద్దరు ప్రయాణికుల మధ్య తీవ్రమమైన ఘర్షణ జరిగిన సంగతి తెలిసింది.
అలానే ఇద్దరు మహిళలు సైతం జట్లు పట్టుకుని మరీ ఫైటింగ్ చేసుకున్నారు. ఇది ఇలా ఉంటే.. తాజాగా ఇద్దరు యువకులు ఏకంగా చెప్పులను చేతబట్టి మరీ..కొట్టుకున్నారు. నిల్చోడానికి కూడా చోటు లేని మెట్రో రైలులో ఒకరికొకరు దూషించుకుంటూ కొట్టుకున్నారు. దీంతో తోటి ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. కొందరు వీరి మధ్య ఘర్షణను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే , వీరి గొడవకు కారణం ఏంటన్నది తెలియరాలేదు. ఇదే తరహాలో మరికొన్ని విచిత్రమైన ఘటనలకు ముంబై మెట్రో రైళ్లు కూడా జరిగాయి. ఓ వ్యక్తి అయితే ఏకంగా మెట్రోలో డబ్ పెట్టుకుని స్నానం చేసిన ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం ఢిల్లీ మెట్రో రైల్లో జరిగిన ఫైట్ వీడియో వైరల్ గా మారింది. మరి..మెట్రోలో ఈ తరహా ఘటనలు నివారణకు చర్యలు ఏమిటి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఢిల్లీ మెట్రోలో కొట్టుకున్న ప్రయాణికులు pic.twitter.com/tLiVA0iY1E
— Telugu Scribe (@TeluguScribe) July 30, 2024