P Krishna
మనిషి జీవితం ఎంతో అమూల్యమైనది.. కొన్నిసార్లు రోడ్డు ప్రమాదాలు, ఇతర కారణాల వల్ల బ్రెయిన్ డెడ్ అయిన వారి అవయవ దానంతో కొంతమంది ప్రాణాలు నిలుస్తుంటాయి. పుట్టెడు దుఖఃంలో ఉండి కూడా బాధితుడి కుటుంబ సభ్యులు అవయవదానం చేయడానికి ముందుకు రావడం గొప్ప విషయం.
మనిషి జీవితం ఎంతో అమూల్యమైనది.. కొన్నిసార్లు రోడ్డు ప్రమాదాలు, ఇతర కారణాల వల్ల బ్రెయిన్ డెడ్ అయిన వారి అవయవ దానంతో కొంతమంది ప్రాణాలు నిలుస్తుంటాయి. పుట్టెడు దుఖఃంలో ఉండి కూడా బాధితుడి కుటుంబ సభ్యులు అవయవదానం చేయడానికి ముందుకు రావడం గొప్ప విషయం.
P Krishna
ఇటీవల దేశంలో రోడ్డు ప్రమాదాలు, గుండెపోటు మరణాలు బాగా పెరిగిపోతున్నాయి. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారు బ్రెయిన్ డెడ్ కి గురవుతుంటారు. అలాంటి వారి అవయవదానంతో కొంతమంది జీవితాల్లో వెలుగు ఇచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. బ్రెయిన్ డెడ్ అయిన వారి కుటుంబ సభ్యుల అంగీకారంతో అతడి శరీరంలో ముఖ్య భాగాలను క్రిటికల్ కండీషన్ లో ఉన్నవారికి అమర్చడం ద్వారా ప్రాణాలు కాపాడుతున్నారు వైద్యులు. దేశ వ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు తరుచూ జరుగుతూనే ఉన్నాయి. ఓ చిన్నారి ప్రమాద వశాత్తు బిల్డింగ్ పై నుంచి పడటంతో పాప బ్రెయిన్ డెడ్ అయ్యింది. దీంతో పాప తల్లిదండ్రులు మానవత్వంతో గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
మూడు అంతస్తుల భవనంపై నుంచి ప్రమాదవశాత్తు కిందపడిన రెండేళ్ల చిన్నారికి బ్రెయిన్ డెడ్ అయ్యింది. ఎంతో ముద్దుగా చూసుకుంటున్న తమ ముద్దుల కూతురు చనిపోయిందన్న బాధలో ఉన్నప్పటికీ పాప తల్లిదండ్రులు పెద్ద మనసు చేసుకొని అవయవదానానికి ముందుకొచ్చారు. ఆ చిట్టితల్లి అవయవదానంతో ఇద్దరికి పునర్జన్మనిచ్చింది. అంతేకాదు.. ఢిల్లీ ఎయిమ్స్ లో అతి పిన్న వయసులో గుండెను దానం చేసిన ఘనత పాపకు దక్కింది. ఢిల్లీకి చెందిన రెండేళ్ల చిన్నారి దివ్యాన్షి అడుకుంటూ మూడంతస్తుల భవనం పై నుంచి పడిపోయింది. వెంటనే తల్లిదండ్రులు పాపను ఎయిమ్స్ హాస్పిటల్ కి తరలించారు. చికిత్స చేసిన వైద్యులు ఆ చిన్నారికి బ్రెయిన్ డెడ్ అయినట్లు నిర్ధారించారు. ఈ క్రమంలోనే చిన్నారి అవయవాలు ఆరోగ్యంగా ఉండటం వల్ల తల్లిదండ్రులకు అవయవదానం పై ఆర్గాన్ రిట్రివల్ బ్యాంకింగ్ ఆర్గనైజేషన్ ద్వారా అవాహన కల్పించారు. పాప అవయవదానం చేస్తే మరో ఇద్దచు చిన్నారుల ప్రాణాలు కాపాడవొచ్చని తెలిపారు.
వైద్యుల సూచన మేరకు తల్లిదండ్రులు చిన్నారి దివ్యాన్షి అవయవదానం చేసేందుకు ఒప్పుకున్నారు. ఇక దివ్యాన్ని నుంచి గుండె సేకరించి.. చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న 8 నెలల పాపకు అమర్చారు. పాప రెండు కిడ్నీలను ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న మరో 17 ఏళ్ల బాలికకు అమర్చారు. కళ్లను ‘ఐ’ బ్యాంక్ లో భద్రపరిచారు. ఈ సందర్భంగా న్యూరో సర్జరీ విభాగానికి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ దీపర్ గుప్తా.. చిన్నారి అవయవదానం గురించి ఎంతో గొప్పగా మాట్లాడారు. ఎయిమ్స్ చరిత్రలో గుండె దానం చేసిన అతి పిన్న వయస్కురాలిగా దివ్యాన్షి నిలిచిపోయిందని అన్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చిన్నారి తల్లిదండ్రులపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.