iDreamPost

Gold: 8 నెలల గర్భిణీని తనిఖీ చేసిన అధికారులు.. 33 కేజీల బంగారం పట్టివేత!

అక్రమ మార్గంలో బంగారం వంటి వాటిని సప్లయ్ చేస్తున్న ముఠాలను అధికారులు పట్టుకుని అరెస్ట్ చేస్తున్నారు. అయినా  కొన్ని ముఠాలు తమ దందాను కొనసాగిస్తున్నాయి. తాజాగా ఎనిమిది నెలల గర్బిణీని పోలీసులు తనిఖీలు చేయగా షాకయ్యారు.

అక్రమ మార్గంలో బంగారం వంటి వాటిని సప్లయ్ చేస్తున్న ముఠాలను అధికారులు పట్టుకుని అరెస్ట్ చేస్తున్నారు. అయినా  కొన్ని ముఠాలు తమ దందాను కొనసాగిస్తున్నాయి. తాజాగా ఎనిమిది నెలల గర్బిణీని పోలీసులు తనిఖీలు చేయగా షాకయ్యారు.

Gold: 8 నెలల గర్భిణీని తనిఖీ చేసిన అధికారులు.. 33 కేజీల బంగారం పట్టివేత!

నిత్యం అక్రమంగా దేశంలోకి వస్తున్న బంగారం, ఇతర వస్తువులను కస్టమ్స్ అధికారులు, పోలీసులు పట్టుకుంటున్నారు. అలానే ఇలా అక్రమ మార్గంలో బంగారం వంటి వాటిని సప్లయ్ చేస్తున్న ముఠాలను అధికారులు పట్టుకుని అరెస్ట్ చేస్తున్నారు. అయినా  కొన్ని ముఠాలు తమ దందాను కొనసాగిస్తున్నాయి. ఇంకా దారుణం ఏమిటంటే.. ఇలాంటి అవినీతి కార్యకలాపాల్లో మహిళలు సైతం పాల్గొంటున్నారు. తాజాగా 8 నెలల గర్భిణీ కూడా ఈ కేసులో ఇర్కుకుంది. సోమవారం కస్టమ్స్ అధికారులు  రూ.19 కోట్ల విలువ చేసే 33 కేజీల బంగారాన్ని పట్టుకున్నారు. ఈ ఘటన ముంబైలో జరిగింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం…

సోమవారం ముంబయి విమానాశ్రయానికి చేరుకున్న నైరోబీకి చెందిన ఇద్దరు మహిళలు పోలీసులకు అనుమానస్పదంగా కనిపించారు. వారిలో దుస్తుల్లో గోల్డ్ ను దాచి అక్రమంగా దేశం లోకి తీసుకొస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. అంజల్ అబ్ధి కాలా(26) అనే మహిళా ప్యాసింజర్ ఫ్లైట్ దిగిన తరువాత గ్రీన్ ఛానల్ నుంచి బయటకు వెళ్లే ప్రయత్నం చేసింది. ఇదే సమయంలో పోలీసులు ఆమెను అనుమతిలేని వస్తువును తీసుకెళ్లందటూ ప్రశ్నించారు. అయితే వారిపై సదరు యువతి దురుసుగా ప్రవర్తించడంతో అధికారులకు అనుమానం వచ్చింది.

ఈ తనిఖీల్లో మహిళ లోదుస్తుల్లో 8 బంగారు కడ్డీలు, హ్యాండ్‌బాగ్‌లో టేప్‌తో చుట్టిన 20 బంగారు కడ్డీల ముక్కలను పోలీసులు గుర్తించారు. ఆమె వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న గోల్డ్ విలువ 19 కోట్ల విలువ చేస్తుందని ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు. అయితే అంజల్ ప్రస్తుతం 8 నెలల గర్భిణీని అని ఆమె తరపు లాయర్ తెలిపాడు. అదే ఫ్లైట్ ఇండియాకు వచ్చిన సైదా హుస్సేన్(24) అనే మహిళను కూడా పోలీసులు అనుమానంతో తనిఖీ చేశారు. ఇక సైదా హుస్సేన్ నుంచి టేప్‌తో చుట్టి దాచిన 61 గోల్డ్ కడ్డీలను గుర్తించామని అధికారులు పేర్కొన్నారు. ఆమె వద్ద మొత్తం 21.4 కేజీల గోల్డ్ ను పోలీసుల స్వాధీనం చేసుకున్నారు. ఈ ఇద్దరు మహిళలపై కస్టమ్స్‌ అధికారులు కేసు నమోదు చేశారు. అనంతరం అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.

ఇక వారిని ప్రాథమికంగా విచారించగా బంగారం తమది కాదని తెలిపినట్లు అధికారులు పేర్కొన్నారు. అంజల్‌ తరపు లాయర్ ప్రభాకర్ త్రిపాఠి మాట్లాడుతూ..ప్రస్తుతం అంజల్ 8 నెలల గర్భిణి అని, ఈ కేసులో అన్యాయంగా ఆమెపై నేరం మోపారని కోర్టుకు తెలిపాడు. సైదా అనే మహిళ తన లగేజ్ ను  తీసుకెళ్లమని అంజల్‌ను అభ్యర్థించడంతో ఆమెకు సహాయం చేయబోయిందని, అలా ఈ కేసులో ఇరుక్కున్నారని ఆమె తరపు లాయర్  పేర్కొన్నారు. ఓ గర్భిణి 20 కేజీల బంగారాన్ని శరీరం పైన ఎలా మోయగలదని అంజల్ తరపు న్యాయవాది ప్రశ్నించారు. విమాన ప్రయాణికుల నుంచి ఇంత పెద్ద మొత్తంలో బంగారం స్వాధీనం చేసుకోవడం ఈ ఏడాదిలో ఇదే మొదటిసారి అని  అధికారులు తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి