iDreamPost
android-app
ios-app

ప్రేమించుకున్న ఇద్దరు అమ్మాయిలు.. పెద్దలు ఒప్పుకోరని..

నేడు ప్రేమ, పెళ్లి వ్యవహారాలు భిన్నంగా సాగుతున్నాయి. అబ్బాయి, అమ్మాయి ప్రేమించుకునే రోజుల నుండి అమ్మాయి,అమ్మాయి.. అబ్బాయి, అబ్బాయి లవ్ చేసుకుని, పెళ్లి చేసుకునే రోజులకు వచ్చేశాం. అయితే ఇంకా సమాజం ఆలోచనలు అంత బ్రాడ్ కాలేదు కాబట్టి.. వీరి వివాహాల విషయంలో నోరెళ్లబెడుతున్నారు.

నేడు ప్రేమ, పెళ్లి వ్యవహారాలు భిన్నంగా సాగుతున్నాయి. అబ్బాయి, అమ్మాయి ప్రేమించుకునే రోజుల నుండి అమ్మాయి,అమ్మాయి.. అబ్బాయి, అబ్బాయి లవ్ చేసుకుని, పెళ్లి చేసుకునే రోజులకు వచ్చేశాం. అయితే ఇంకా సమాజం ఆలోచనలు అంత బ్రాడ్ కాలేదు కాబట్టి.. వీరి వివాహాల విషయంలో నోరెళ్లబెడుతున్నారు.

ప్రేమించుకున్న ఇద్దరు అమ్మాయిలు.. పెద్దలు ఒప్పుకోరని..

నువ్వు లేకుండా నేను లేనని అనుకున్నారు. తమ ప్రేమను పెద్దలు అంగీకరించరని తెలిసి.. ఉంటే ఇద్దరు కలిసి జీవించాలి లేదా కలిసి చనిపోవాలని అనుకున్నారు. అనుకున్నదే తడువుగా ఇద్దరూ ఇంట్లో నుండి పారిపోయి గుడికి వెళ్లి పెళ్లి చేసుకున్నారు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే.. వీరిద్దరూ అమ్మాయిలు. అవును మీరు విన్నదీ నిజమే. ఇద్దరు అమ్మాయిలు ప్రేమించుకుని, పెళ్లి చేసుకున్నారు. ఇటీవల కాలంలో స్వలింగ సంపర్కుల వివాహంపై దేశ వ్యాప్తంగా చర్చ జరగుతున్న సంగతి విదితమే. వీరు ఆ కోవకు చెందిన వారే.  సుప్రీంకోర్టు కూడా.. వీరి వివాహాన్ని గుర్తించేందుకు నిరాకరించింది. కానీ వీటి పట్ల నెలకొన్న వివక్షను ఆపాలని, అది పార్లమెంట్ అధికార పరిధిపై ఆదారఫడి ఉంటుందని పేర్కొంది.

ఈ సమయంలో ఇద్దరు అమ్మాయిలు..ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు. ఈ ఘటన బీహార్ లోని జమయ్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. లక్ష్మీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దిగ్గి గ్రామానికి చెందిన అశోక్ తంతి కుమార్తె నిషా కుమారి, లఖిసరాయ్ జిల్లాలోని కుసంద గ్రామానికి చెందిన కోమల్ కుమారి ప్రేమలో పడ్డారు. ఏడాదిన్నర క్రితం కోమల్ కుమారి మామ కుమారిడికి.. దిగ్గి గ్రామంలో వివాహం జరిగింది. ఈ పెళ్లి సందర్భంగా ఇద్దరు అమ్మాయిలు.. ఒకరికొకరు పరిచయమయ్యారు. వీరి మధ్య స్నేహం.. ప్రేమకు దారి తీయడం గమనార్హం. వీరిద్దరి మధ్య బంధం విడదీయలేనంత బలంగా మారిపోవడంతో పెళ్లి చేసుకోవాలని భావించారు.

కుటుంబ సభ్యులు, సమాజం ఒప్పుకోదని తెలిసి..ఈ నెల 24న ఇద్దరు ఇంట్లో నుండి పారిపోయి జమయ్‍లోని ఓ గుడిలో వివాహం చేసుకుని పాట్నా పారిపోయారు. అయితే తమ అమ్మాయి కనిపించడం లేదంటూ.. నిషా కుమారి కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తమ కోసం వెతుకుతున్నారని తెలిసి.. ఇద్దరు యువతులు.. పాట్నానుండి జమయ్ రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. పోలీసులు వీరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించినట్లు సమాచారం. అయితే పోలీసులు విచారణ చేపడుతున్నారు.  వీరిద్దరని పోలీసులు కోర్టులో హాజరు పరిచారని తెలుస్తోంది.