Keerthi
కేరళ రాష్ట్రంలో కొలువై ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రల్లో శబరిమల కూడా ఒకటి. అయితే ఇక్కడ ఆ మణికంఠ స్వామి ఎంత ఫేమస్సో, ఆయన అరవణ ప్రసాదం కూడా అంతే ఫేమస్ అని అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఈ ఫేమస్ ప్రసాదాన్ని నాశనం చేస్తున్నట్లు కేరళ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే..?
కేరళ రాష్ట్రంలో కొలువై ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రల్లో శబరిమల కూడా ఒకటి. అయితే ఇక్కడ ఆ మణికంఠ స్వామి ఎంత ఫేమస్సో, ఆయన అరవణ ప్రసాదం కూడా అంతే ఫేమస్ అని అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఈ ఫేమస్ ప్రసాదాన్ని నాశనం చేస్తున్నట్లు కేరళ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే..?
Keerthi
కేరళ రాష్ట్రంలో కొలువై ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రల్లో శబరిమల కూడా ఒకటి. ఇక్కడే ఆ అయ్యప్ప స్వామి కొలువై ఉన్నారు. అంతేకాకుండా.. దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది అయ్యప్ప భక్తులు స్వామి దర్శనం కోసం ప్రతి ఏటా శబరిమలకు వెళ్తుంటారు. ఈ క్రమంలోనే..అయ్యప్ప మాలలు ధరించి.. ఆ మణికంఠుడ్ని సందర్శించి.. ఆ తర్వాత మాల విరమణ చేస్తారు. అయితే కేరళలో కొలువై ఉన్న అయ్యప్ప స‍్వామి ఎంత ఫేమస్సో.. ఇక అక్కడ ఆయన అరవణ ప్రసాదం కోసం కూడా అంతే ఫేమస్.
ఈ క్రమంలోనే చాలామంది శబరిమలకు ఎవరైనా వెళ్తున్నారంటే.. అరవణ ప్రసాదం తీసుకురమ్మని చెబుతూ ఉంటారు. పైగా ఆ అరవణ ప్రసాదం టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే అలాంటి ఫేమస్ అరవణ ప్రసాదాన్ని.. శబరిమల ఆలయ దేవస్థానం బోర్డు నాశనం చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈమేరకు తాజాగా కేరళ హైకోర్టు ఆదేశాలతో ఈ చర్యలకు దిగింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..కేరళలో అయ్యప్ప స్వామి ప్రసాదం ఎంత ఫేమస్ అనేది అందరికి తెలిసిందే. అయితే ఈ ప్రసాదాన్ని తాజాగా దేవస్థానం బోర్డు నాశనం చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అందుకోసం తాజాగా కేరళ హైకోర్టు ఆదేశాలతో ఈ చర్యలకు దిగింది. ఈ క్రమంలోనే.. దాదాపు 6.65 లక్షల అరవణ ప్రసాదం టిన్లను డిస్పోజ్ చేయాలని ఇప్పటికే కేరళ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది.
ఎందుకంటే.. ఆ అరవణ ప్రసాదంలో వాడే యాలకుల్లో మోతాదుకు మించి పెస్టిసైడ్స్ ఉన్నాయని తేలింది. అందుకోసమే కేరళ హైకోర్టు ఈ తీర్పును ఆదేశించింది. ఇక ఆ ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేయకుండా.. వాటిని డిస్పోజ్ చేయాలని సూచించింది. అయితే కేరళ హైకోర్టు ఆదేశాలతో 6.5 లక్షల ప్రసాదం క్యాన్లను సైంటిఫిక్‌గా డిస్పోజ్ చేసేందుకు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు తాజాగా ఓ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. కాగా, ఈ అరవణ ప్రసాదం మొత్తం విలువ 5.3 కోట్లు ఉండవచ్చని బోర్డు అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ అరవణ ప్రసాదం టిన్లను డిస్పోజ్ చేసే సమయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
కాగా, ఆ ప్రసాదం క్యాన్ల షెల్ఫ్ లైఫ్ పూర్తైన నేపథ్యంలో.. ఎట్టి పరిస్థితిలోనూ అవి భక్తులకు చేరకూడదని వెల్లడించింది. అలాగే పవిత్రమైన అయ్యప్ప ప్రసాదం కావడంతో వాటిని నాశనం చేసే సమయంలో అన్ని రకాల జాగ్రత్తలు పాటించాలని సూచించింది. ఈ ప్రక్రియలో హెల్త్ అండ్ సేఫ్టీ మెజర్స్ పాటించాలని కేరళ హైకోర్టు ఆదేశించింది.