SNP
Chenab Bridge, Jammu Kashmir, Indian Railways: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్‌పై భారతీయ రైలు పరుగులు తీసింది. ఆ దృశ్యాలు చూసేందుకు అద్భుతంగా ఉన్నాయి. ఆ వీడియా చూసి, బ్రిడ్జ్ విశేషాలు తెలుసుకోండి..
Chenab Bridge, Jammu Kashmir, Indian Railways: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్‌పై భారతీయ రైలు పరుగులు తీసింది. ఆ దృశ్యాలు చూసేందుకు అద్భుతంగా ఉన్నాయి. ఆ వీడియా చూసి, బ్రిడ్జ్ విశేషాలు తెలుసుకోండి..
SNP
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్‌పై తొలిసారి రైలు పరుగులు పెట్టింది. అయితే.. ఇది ట్రైయల్ రన్ మాత్రమే. జమ్మూ కశ్మీర్‌లోని చీనాబ్ నదిపై నిర్మించిన రైల్వే వంతెన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బ్రిడ్జ్‌గా రికార్డు సృష్టించింది. నది నుంచి 359 మీటర్లు(సుమారు 109 అడుగులు) ఎత్తులో ఈ వంతెన నిర్మించారు. ఇది నిజంగా ఒక ఇంజనీరింగ్ అద్భుతమని చెప్పాలి. అయితే.. ఈ వంతెనపై గురువారం ట్రైయల్ రన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ ట్రైయల్‌కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ.. రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ట్రైయల్ రన్ విజయవంతమైందని తెలిపారు.
ఈ ట్రైయల్ రన్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వంతెన రాంబన్ జిల్లాలోని సంగల్దాన్, రియాసి మధ్య నిర్మించారు. వంతెన నిర్మాణం పూర్తి కావడం, ట్రైయల్ రన్ కూడా విజయవంతంగా పూర్తి కావడంతో.. ఈ మార్గంలో రైలు సేవలు త్వరలో ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. తొలుత ఈ బ్రిడ్జ్‌పై కేవలం ఇంజన్‌తో ఈ నెల 16న ట్రైయల్ రన్ నిర్వహించారు. ఇప్పుడు పూర్తి రైలుతో ట్రైయల్ రన్ నిర్వహించారు. అతి ఎత్తైన వంతెనపై అంత పొడువైన ట్రైన్ వెళ్తుంటే.. ఏదో చిన్న పాము వెళ్తున్నట్లు కనిపించింది. చుట్టూ కొండల మధ్య లోతైన ప్రాంతంలో బ్రిడ్జ్‌పై ట్రైన్ అలా వెళ్తుంటే.. చూసేందుకు ఐ ఫీస్ట్‌లా ఉందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
కశ్మీర్‌ను భారత్‌లోని మిగతా ప్రాంతాలతో అనుసంధానం చేసేందుకు ఉధంపుర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే ప్రాజెక్టులో భాగంగా ఈ వంతెన నిర్మించారు. నది నుంచి ఈ వంతెన 359 మీటర్ల ఎత్తులో ఉంది. అలాగే 1315 మీటర్ల పొడువు ఉంది. అయితే.. ఈ వంతెన నిర్మాణం కంటే ముందు చైనాలోని బెయిపాన్ నదిపై నిర్మించిన షుబాయ్ రైల్వే వంతెన ప్రపంచంలో అత్యంత ఎత్తైన రైల్వే వంతెనగా ఉండేది. కానీ, ఆ బ్రిడ్జ్‌ని ఇప్పుడు చీనాబ్ నదిపై నిర్మించిన ఈ వంతెన దాటేసి.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనగా రికార్డు సృష్టించింది. బ్రిడ్జ్ కింద ఐఫిల్ టవర్‌ను ఉంచినా.. ఇంకా 30 మీటర్లు గ్యాప్ ఉంటుందని అధికారులు తెలుపుతున్నారు. మరి దేశం గర్వించే ఇంజనీరింగ్ అద్భుతంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#JammuAndKashmir | Indian Railway conducts trial run over world’s highest railway bridge ‘Chenab’
The bridge is built between #Sangaldan in #Ramban district and #Reasi.
Rail services on the line will start soon.@RailMinIndia @RailwayNorthern @AshwiniVaishnaw pic.twitter.com/cV1282VT4G
— DD News (@DDNewslive) June 20, 2024