iDreamPost
android-app
ios-app

పెళ్లై మూడు నెలలు అయ్యిందో లేదో.. పాపం, అంతలోనే..!

వీళ్లిద్దరు భార్యాభర్తలు. వీరికి గత మూడు నెలల కిందటే వివాహం జరిగింది. అప్పటి నుంచి ఈ భార్యాభర్తలు ఎంతో సంతోషంగా ఉన్నారు. కానీ, ఉన్నట్టుండి ఇలా జరగడంతో అందరూ షాక్ కు గురవుతున్నారు. అసలేం జరిగిందంటే?

వీళ్లిద్దరు భార్యాభర్తలు. వీరికి గత మూడు నెలల కిందటే వివాహం జరిగింది. అప్పటి నుంచి ఈ భార్యాభర్తలు ఎంతో సంతోషంగా ఉన్నారు. కానీ, ఉన్నట్టుండి ఇలా జరగడంతో అందరూ షాక్ కు గురవుతున్నారు. అసలేం జరిగిందంటే?

పెళ్లై మూడు నెలలు అయ్యిందో లేదో.. పాపం, అంతలోనే..!

పైన ఫోటోలో కనిపిస్తున్న వీళ్లిద్దరు భార్యాభర్తలు. వీరికి గత మూడు నెలల కిందటే వివాహం జరిగింది. నూతన దంపతులు కావడంతో ఎంతో సంతోషంగా రోజులను గడుపుతున్నారు. మంచి అల్లుడు దొరికాడని అత్తమామలు, గుణవంతురాలైన కోడలు వచ్చిందని భర్త తల్లిదండ్రులు మురిసిపోయారు. ఇలా అందరూ ఎంతో ఆనందపడ్డారు. కానీ, ఆ ఆనంద క్షణాలు మాత్రం ఎక్కువ రోజులు నిలువలేకపోయాయి. ఉన్నట్టుండి జరిగిన ఊహించని ఘటనతో అందరూ షాక్ కు గురయ్యారు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇంతకు ఈ ఘటనలో అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. కర్ణాటక తమకూరు జిల్లా గుడిబండ మండలం మోరుబాగల్ గ్రామంలో శ్రీరంగప్ప(350-సుమ (26) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి గత మూడు నెలల కిందటే వివాహం జరిగింది. భర్త శ్రీరంగప్ప స్థానికంగా సచివాలయంలో విలేజ్ సర్వేయర్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అలా ఈ నూతన దంపతులు ఎంతో సంతోషంగా ఉన్నారు. మంచి అల్లుడు దొరికాడని అత్తమామలు, గుణవంతురాలైన కోడలు వచ్చిందని భర్త తల్లిదండ్రులు మురిసిపోయారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. అయితే, ఆదివారం సెలవు కావడంతో శ్రీరంగప్ప అత్తవారింటికి వెళ్దామనుకుని బైక్ పై భార్యాభర్తలు బయలు దేరారు.

దాసరహళ్లి గ్రామ సమీపానికి చేరుకోగానే వీరి వాహనాన్ని ఎదురుగా వచ్చిన ఓ లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రంగప్ప, సుమ తీవ్రంగా గాయపడ్డారు. వాహనదారులు వెంటనే అప్రమత్తమై వారిని ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు వాళ్లు అప్పటికే మరణించారని నిర్దారించారు. ఇదే విషయాన్ని తెలుసుకున్న మృతుల కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడ్చారు. అనంతరం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సమచారం. పెళ్లైన మూడు నెలలకే ఈ నూతన దంపతులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో వారి తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.