iDreamPost
android-app
ios-app

క్రికెట్ ఆడుతుండగా విషాదం.. సిక్స్ కొట్టి కుప్పకూలి బ్యాటర్ మృతి..

  • Published Jun 03, 2024 | 10:04 PM Updated Updated Jun 03, 2024 | 10:04 PM

Tragedy In Cricket Match: క్రికెట్ మ్యాచ్ లో తీవ్ర విషాదం నెలకొంది. భారీ షాట్ కొట్టి అక్కడిక్కడే కుప్పకూలాడో బ్యాట్స్ మన్. గ్రౌండ్ లో బౌలర్ వేసిన బంతిని సిక్స్ కొట్టిన ఆ బ్యాటర్.. ఉన్నట్టుండి అందరూ చూస్తుండగా కింద పడిపోయాడు.

Tragedy In Cricket Match: క్రికెట్ మ్యాచ్ లో తీవ్ర విషాదం నెలకొంది. భారీ షాట్ కొట్టి అక్కడిక్కడే కుప్పకూలాడో బ్యాట్స్ మన్. గ్రౌండ్ లో బౌలర్ వేసిన బంతిని సిక్స్ కొట్టిన ఆ బ్యాటర్.. ఉన్నట్టుండి అందరూ చూస్తుండగా కింద పడిపోయాడు.

  • Published Jun 03, 2024 | 10:04 PMUpdated Jun 03, 2024 | 10:04 PM
క్రికెట్ ఆడుతుండగా విషాదం.. సిక్స్ కొట్టి కుప్పకూలి బ్యాటర్ మృతి..

క్రికెట్ లో కొన్నిసార్లు విషాదాలు చోటు చేసుకుంటాయి. బాల్ తగిలి బ్యాటర్ మృతి చెందడం.. భారీ షాట్ కి ప్రయత్నించి కుప్పకూలిపోవడం వంటి సంఘటనలు చూశాం. క్రికెట్ రంగానికి చెందని యువకులు కూడా క్రికెట్ ఆడుతూ ఆట మధ్యలోనే కుప్పకూలి గుండెపోటుతో మృతి చెందిన సందర్భాలు అనేకం ఉన్నాయి. తాజాగా ఓ బ్యాటర్ క్రికెట్ ఆడుతూ కుప్పకూలి మృతి చెందాడు. సిక్స్ కొట్టిన ఆ యువకుడు ఆ తర్వాత గుండెనొప్పితో ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయాడు. 

ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ముంబైలోని కశ్మీర ఏరియాలోని మీరా రోడ్ లో ఒక పార్క్ లో కొంతమంది క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నారు. వారిలో రామ్ గణేష్ తివార్ (42) అనే వ్యక్తి కూడా ఉన్నాడు. ఈయన క్రీజులో ఉండి బ్యాటింగ్ చేస్తున్నాడు. బౌలర్ బౌలింగ్ చేశాడు. ఫ్రంట్ ఫుట్ కొచ్చి బంతిని బలంగా కొట్టాడు. అంతే బంతి పార్క్ అవతల పడింది. అంపైర్ సిక్స్ అని సంకేతం ఇచ్చాడు. బ్యాటర్ నిలబడి బాల్ ని చూస్తున్నాడు. అంతలోనే ఒక్కసారిగా గుండెపోటు వచ్చి అక్కడిక్కడే కుప్పకూలి చనిపోయాడు. పింక్ జెర్సీలో ఉన్న ఆ బ్యాట్స్ మన్ పర్ఫెక్ట్ గా షాట్ ని ఎగ్జిక్యూట్ చేశాడు. బౌలర్ పై నుంచి బాల్ వెళ్ళింది. తరువాత బంతిని ఫేస్ చేయాలని నిలబడ్డాడు. అయితే సడన్ గా కింద పడిపోయాడు.

తోటి ప్లేయర్లు అతని దగ్గరకు వెళ్లారు. ఫస్ట్ ఎయిడ్ చేసే ప్రయత్నం చేశారు. అతన్ని పైకి లేపే ప్రయత్నం చేశారు. కానీ ఆ బ్యాటర్ ఇక తిరిగి లేవలేదు. జిమ్ లో అతిగా వ్యాయామం చేయడం వల్ల కొంతమంది చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఆడుకుంటున్న సమయంలో, ఆఫీసులో ఒత్తిడి ఎక్కువై ఇలా కొంతమంది కూర్చున్న చోటు నుంచే కుప్పకూలిన ఘటనలు గతంలో చాలానే చూశాం. ఒత్తిడి ఎక్కువైనప్పుడు ఇలాంటి పరిస్థితి వస్తుందని.. ఒత్తిడిని జయించాలని నిపుణులు సూచిస్తున్నారు. అలానే ప్రతిరోజూ ఈజీ వర్కవుట్స్ చేయాలని.. మరీ హెవీ వర్కౌట్స్ చేయకూడదని.. సాత్విక ఆహారం తింటే ఇలాంటి ప్రమాదాలకు దూరంగా ఉండవచ్చునని నిపుణులు చెబుతున్నారు.