P Krishna
ప్రస్తుతం తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో ఎన్నికల హడావుడి కొనసాగుతుంది. జాతీయ నేతలు ప్రచారాల్లో మునిగిపోయారు. ఇదే సమయంలో పలువురు రాజకీయ నేతల ఇంట్లో విషాదాలు నెలకొంటున్నాయి.
ప్రస్తుతం తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో ఎన్నికల హడావుడి కొనసాగుతుంది. జాతీయ నేతలు ప్రచారాల్లో మునిగిపోయారు. ఇదే సమయంలో పలువురు రాజకీయ నేతల ఇంట్లో విషాదాలు నెలకొంటున్నాయి.
P Krishna
గత నెలలో మధ్యప్రదేశ్, తెలంగాణ, చత్తీస్ గఢ్, మిజోరాం, రాజస్థాన్ రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసింది ఎన్నికల సంఘం. ఈ క్రమంలో చత్తీస్ గఢ్, మిజోరాం లో ఇప్పటికే ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్ లో ఎన్నికలు జరగనున్నాయి. అలాగే డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు ఉండబోతున్నాయి. ప్రస్తుతం ఈ రాష్ట్రాల్లో బీజేపీ తరుపు నుంచి దిగ్గజ నేతలు ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ జాతీయ అధ్యకులు జేపీ నడ్డ ఇంట తీవ్ర విషాదం నోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
ప్రస్తుతం మూడు రాష్ట్రాలు రాజస్థాన్, తెలంగాణ, మధ్యప్రదేశ్ లో ఎన్నికల నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేతలు రంగంలోకి దిగి ముమ్మర ప్రచారం చేస్తున్నారు. ఈ సమయంలోనే బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన అత్తగారు గంగాదేవి శర్మ (106) కన్నుమూశారు. హిమాచల్ ప్రదేశ్ లోని కులు లో ఉంటున్న తన ఇంట్లో సోమవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో తుది శ్వాస విడిచారు. ఈ రోజు మధ్యాహ్నం వ్యాస నదీ ఒడ్డున ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
గత కొంతకాలంగా జేపీ నడ్డా అత్త అయిన గంగాదేవి శర్మ కులులోని శాస్త్రి నగర్ లో ఒంటరిగా ఉంటున్నారు. ఆమెను సంరక్షించేందుకు ఇద్దరు కేర్ టేకర్లు ఉన్నారు. అయితే జేపీ నడ్డా బాల్యం మొత్తం తన అత్తగారు అయిన గంగా దేవి ఇంట్లోనే గడిచింది. ఈ కారణంతోనే మొదటి నుంచి అత్త అంటే జేపీ నడ్డాకు ఎంతో అభిమానం అంటారు. ఈ కారణంతోనే ఆయన ఎప్పుడూ కులు నా రెండో స్వస్థలం అంటుంటారు. హిమాచల్ సందర్శించిన ప్రతిసారి ఖచ్చితంగా తన అత్త గంగాదేవి ఇంటికి వెళ్లేవారు జేపీ నడ్డా. ఆమె మరణంతో శాస్త్రీ నగర్ లో తీవ్ర విశాదం నెలకొంది. పలువురు బీజేపీ నేతలు జేపీ నడ్డా అత్త గంగాదేవికి నివాళులర్పించారు.