Swetha
బెంగుళూరులో ఉండే వారికి ట్రాఫిక్ వలన ఎన్ని కష్టాలు ఉంటాయో అందరికి తెలిసిందే. ఇక ఈ మధ్య కాలంలో అక్కడ నీటి కొరత కూడా ఏర్పడడంతో.. దాదాపు అందరు బెంగుళూరును ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఇప్పుడు బెంగుళూరు నగర వాసులకు సరికొత్త కష్టాలు మొదలయ్యాయట.
బెంగుళూరులో ఉండే వారికి ట్రాఫిక్ వలన ఎన్ని కష్టాలు ఉంటాయో అందరికి తెలిసిందే. ఇక ఈ మధ్య కాలంలో అక్కడ నీటి కొరత కూడా ఏర్పడడంతో.. దాదాపు అందరు బెంగుళూరును ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఇప్పుడు బెంగుళూరు నగర వాసులకు సరికొత్త కష్టాలు మొదలయ్యాయట.
Swetha
బెంగుళూరులో ఎక్కడెక్కడి నుంచో వెళ్లిన ప్రజలు ఉద్యోగాలు చేసుకుంటూ నివసిస్తూ ఉంటారు. ఇక బెంగుళూరులో ఉండే ఐటీ హాబ్స్ ను పక్కన పెడితే.. ఆ తర్వాత అందరికి గుర్తొచ్చేది ఒకటే ట్రాఫిక్. బెంగుళూరు నగర వాసులకు ట్రాఫిక్ కష్టాలు ఎప్పటికి తీరనివి అని చెప్పి తీరాలి. ఎలాగూ ఒకలా అదే ట్రాఫిక్ కష్టాలతో పోరాడుతూ జీవనం సాగిస్తున్న ప్రజలకు కొన్ని నెలల క్రితం అనుకోని అతిథిలా వచ్చి పడ్డాయి నీటి కష్టాలు. దానికి సంబంధించిన వార్తలను కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాము. అక్కడ ఏర్పడిన నీటి కష్టాల కారణంగా దాదాపు అందరూ కూడా.. నగరాన్ని విడిచి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతా ఇపుడిపుడే సర్దుమణుగుతున్న క్రమంలో ఇక ఇప్పుడు బెంగుళూరు వాసులకు మరొక కొత్త కష్టం రానుందట. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
బెంగుళూరులో ఉండే ట్రాఫిక్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆ ట్రాఫిక్ ను తగ్గించడం కోసం దాదాపు బెంగుళూరు అంతా కూడా మెట్రో సర్వీస్ లను ఏర్పాటు చేశారు. ఇంకా కొన్ని ప్రాంతాలలో కంస్ట్రక్షన్ పనులు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ మెట్రో కంస్ట్రక్షన్స్ కారణంగా.. రానున్న 20 రోజులు బెంగుళూరు వాసులకు ట్రాఫిక్ కష్టాలు రానున్నాయి. బెంగుళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ .. మెట్రో లైన్ నుంచి 220kv కేబుల్ ను వేసేందుకు పనులు ప్రారంభించింది. సలార్పురియా సాఫ్ట్ జోన్ నుంచి బెల్లందూర్ వరకు ఉండే ఏరియాస్ లో కొన్ని మార్గాలను మూసివేశారు అధికారులు. రాబోయే 20 రోజుల పాటు పీక్ హావర్స్ లో వారికి ట్రాఫిక్ కష్టాలు తప్పవు. ఇప్పటికే రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు పనిని కొనసాగిస్తున్నారు అధికారులు. కాబట్టి ఇప్పటికే ట్రాఫిక్ కష్టాలను ఎదుర్కుంటున్న ప్రజలకు.. రానున్న 20 రోజులు ఇక నరకమే.
ఇక ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో బెంగుళూరు నగర వాసుల కష్టాలను చూస్తూనే ఉన్నాము. ముఖ్యంగా ఐటీ ఉద్యోగుల కష్టాలు అన్నీ ఇన్ని కావు. ట్రాఫిక్ కారణంగా సరైన సమయంలో ఆఫీస్ లకు వెళ్లలేకపోతున్నారు. మరి కొంతమంది ట్రాఫిక్ లో ఉండి వర్క్ చేయడం.. అక్కడినుంచే మీటింగ్స్ కు అటెండ్ అవ్వడం ఇలా… అక్కడి వాసులకు సంబంధించిన విషయాలను నిత్యం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాము. ఇక ఇప్పుడు కొన్ని మార్గాలను మూసివేయడంతో.. వారి ట్రాఫిక్ కష్టాలు మరింత పెరగనున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలోకి ఎలాంటి వీడియోస్ వస్తాయో చూడాలి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.