iDreamPost
android-app
ios-app

వీడియో: భారీ వర్షాలు.. జలపాతం వద్ద చిక్కుకున్న పర్యాటకులు!

ఇటీవల ఓ ప్రాంతంలో ఓ కుటుంబంలోని ఐదుగురు జలపాతం వరదల్లో చిక్కుకుని..చివరకు ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదే సమయంలో అదే తరహాలో మరో ఘటన  చోటుచేసుకుంది. కానీ...

ఇటీవల ఓ ప్రాంతంలో ఓ కుటుంబంలోని ఐదుగురు జలపాతం వరదల్లో చిక్కుకుని..చివరకు ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదే సమయంలో అదే తరహాలో మరో ఘటన  చోటుచేసుకుంది. కానీ...

వీడియో: భారీ వర్షాలు.. జలపాతం వద్ద చిక్కుకున్న పర్యాటకులు!

ఇటీవల దేశ వ్యాప్తంగా  అనేక ప్రాంతాల్లో వానలు దంచికొడుతున్నాయి. పలు లోతట్టు ప్రాంతాలు జలమయ్యం  అయ్యాయి. ఇక భారీ వాన దెబ్బకు జనాలు అల్లాడిపోతున్నారు. ఇదే సమయంలో జలపాతాలు, చెరువులు, నదులు వంటి ప్రాంతాల్లో పర్యాటకులు ఎంజాయ్ చేస్తున్నారు. ఇక  భారీ వానల దెబ్బకు  ఊహించని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవలే మహారాష్ట్రలోని ఓ ప్రాంతంలో ఓ కుటుంబంలోని ఐదుగురు జలపాతం వరదల్లో చిక్కుకుని..చివరకు ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదే సమయంలో అదే తరహాలో మరో ఘటన  చోటుచేసుకుంది. కానీ.. ఇక్కడి వాళ్లు ప్రాణాలతో బయట పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తెలంగాణ రాష్ట్రంతో పాటు పలు దేశంలోని పలు ప్రాంతాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. అదే పరిస్థితి మహరాష్ట్రలోను  కనిపిస్తుంది. గతకొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. దీంతో పలు జలపాతాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఈ క్రమంలో అంజనేరి జలపాతం వద్దకు పెను ప్రమాదం తప్పింది. అక్కడ పర్యటనకు వెళ్లి కొందరు వరద తీవ్రతకు అక్కడ చిక్కుకుపోయారు. కొన్ని రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు అంజనేరి జలపాతం వద్ద నీటి ఉద్ధృతి బాగా పెరిగింది. దీంతో ఆదివారం హాలీడే కావడంతో జలపాత వద్ద ప్రకృతిని ఆస్వాదించేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు అక్కడికి వెళ్లారు.

అదే సమయంలో అకస్మాత్తుగా వర్షం పడటంతో వరద ఉద్దృతి పెరిగింది. దీంతో ఊహించని పరిణామంతో అందరు షాకి గురయ్యాడు. అలానే పెద్ద సంఖ్యలో పర్యాటకులు జలపాతం వద్ద చిక్కుకుపోయారు. ఇక ఈ ఘటనపై సమచారం అందుకున్న అటవీశాఖ అధికారులు అక్కడి చేరుకున్నారు. దాదాపు 6 గంటల పాటు శ్రమించి యాత్రికులను ప్రాణాలతో బయటకు తీసుకొచ్చారు. అందరూ ఒకరిచేయి ఒకరు పట్టుకుని నిదానంగా కొండదిగిపోయారు. ఈ ఘటనకు  సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి.. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి