iDreamPost
android-app
ios-app

రేపే పోలింగ్.. 12 స్థానాల్లో 60 వేల మందితో భద్రత!

దేశంలో తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాలల్లో ఎన్నికల నగారా మోగిన సంగతి తెలిసిందే. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా మంగళవారం తొలి విడత పోలింగ్ జరగనుంది. ఇందులో భాగంగా సమస్యాత్మక ప్రాంతాలైన 12 అసెంబ్లీ స్థానాల్లో 60 వేల మంది భద్రతా సిబ్బందితో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు

దేశంలో తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాలల్లో ఎన్నికల నగారా మోగిన సంగతి తెలిసిందే. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా మంగళవారం తొలి విడత పోలింగ్ జరగనుంది. ఇందులో భాగంగా సమస్యాత్మక ప్రాంతాలైన 12 అసెంబ్లీ స్థానాల్లో 60 వేల మంది భద్రతా సిబ్బందితో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు

రేపే పోలింగ్.. 12 స్థానాల్లో 60 వేల మందితో భద్రత!

దేశంలో తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాలల్లో ఎన్నికల నగారా మోగిన సంగతి తెలిసిందే. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా మంగళవారం తొలి విడత పోలింగ్ జరగనుంది. ఇందులో ఛత్తీస్‌గఢ్‌లో మొదటి విడత, మిజోరంలో మొత్తం స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక మావోయిస్టు ప్రభావిత రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌లో అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా మావోయిస్టుల ప్రాబల్యం బస్తర్ డివిజన్‌లోని 12 అసెంబ్లీ స్థానాల్లో 60 వేల మంది భద్రతా సిబ్బందితో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓటర్లు ధైర్యంగా ఎన్నికల్లో పాల్గొన్నాలని అధికారులు సూచించారు.

మినీ సార్వత్రిక ఎన్నికలుగా భావించే.. ఐదు రాష్ట్రాల ఎన్నికలు రేపటి తో ప్రారంభం కానున్నాయి. పలు విడతల్లో ఈ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీకి మంగళవారం తొలి విడత ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఈ రాష్ట్రంలో తొలి విడతలో 20 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. తొలివిడత ఎన్నికలు జరిగే ప్రాంతాలు మావోయిస్టుల ప్రభావం ఎక్కువ ఉండటంతో ఎన్నికల సంఘం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన బస్తర్‌ డివిజన్‌లో 12 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. వాటికి భారీ భద్రత మధ్య ఎన్నికలు నిర్వహించనున్నారు. కేంద్ర, రాష్ట్ర బలగాలతో అడుగడుగునా భద్రతా కట్టుదిట్టం చేశారు.

భద్రత కోసమే మొత్తం 60 వేల మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. కేవలం బస్తర్ డివిజన్‌లో ఉన్న 12 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 5304 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 600 పోలింగ్‌ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా అధికారులు గుర్తించారు. మావోయిస్టుల హెచ్చరికల నేపథ్యంలో డ్రోన్లు, హెలికాప్టర్ల ద్వారా వారి కదలికలను అనుక్షణం పర్యవేక్షిస్తున్నారు. ఇందులోనే మావోయిస్టుల ఏరివేత కోసం ప్రత్యేకంగా పనిచేసే కోబ్రా యూనిట్‌, మహిళా కమాండోలు కూడా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక ఛత్తీస్ గడ్ తో పాటు.. ఈశాన్య రాష్ట్రమైన మిజోరంలో కూడా రేపు అసెంబ్లీ ఎన్నికలు జరగన్నాయి. 40 అసెంబ్లీ నియోజకవర్గాల ఉన్న మిజోరాంలో ఒకే విడతలో రేపు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 8.57 లక్షల మందికి పైగా ఓటర్లు ఉండగా, మొత్తం 1276 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.