iDreamPost
android-app
ios-app

శుభకార్యానికి వెళ్తున్న కుటుంబాల్లో విషాదం! ఏకంగా..

అతివేగంగా, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడంతో నిత్యం అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. అంతేకాక ఎవరో నిర్లక్ష్యంగా ఉన్నందుకు అమాయకులు బలవుతున్నారు. తాజాగా శుభాకార్యానికి వెళ్తున్న కొన్ని కుటుంబాల్లో రోడ్డు ప్రమాదం విషాదం నిండింది.

అతివేగంగా, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడంతో నిత్యం అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. అంతేకాక ఎవరో నిర్లక్ష్యంగా ఉన్నందుకు అమాయకులు బలవుతున్నారు. తాజాగా శుభాకార్యానికి వెళ్తున్న కొన్ని కుటుంబాల్లో రోడ్డు ప్రమాదం విషాదం నిండింది.

శుభకార్యానికి వెళ్తున్న కుటుంబాల్లో విషాదం! ఏకంగా..

ప్రతి ఒక్కరు తరచూ తమ బంధువుల, స్నేహితుల ఇళ్లలో జరిగే శుభకార్యాలకు వెళ్తుంటారు. అలా ఎంతో మంది తమవారి వేడుకల్లో పాల్గొనేందుకు ఎంతో సంతోషంగా  ఉంటారు. అయితే కొన్ని వేడుకల్లో అనుకోని ప్రమాదాలు జరిగి విషాదం నిండుకుంటుంది. తాజాగా శుభాకార్యానికి వెళ్తున్న కొన్ని కుటుంబాల్లో రోడ్డు ప్రమాదం విషాదం నిండింది. ఈ ఘోర ఘటన  ఛత్తీస్ గడ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

చత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బెమెతరా జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది. సోమవారం తెల్లవారుజామున కతియా అనే ప్రాంతం వద్దు రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి వున్న లారీని ఓ మినీ వ్యాన్‌ ఢీకొట్టడంతో ఘోరం జరిగింది. ఈ ప్రమాదంలో వ్యానులో ప్రయాణిస్తున్న తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 23 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంపై స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యల్లో పాల్గొన్న పోలీసులు గాయపడ్డవారిని  స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించి మృతి చెందిన వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.  మృతుల్లో నలుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

ఇక ఈ ప్రమాదంలో గాయపడినవారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. పరిస్థితి విషమంగా ఉన్నవారిని చికిత్స కోసం రాయ్ పూర్ లోని ఎయిమ్స్‌ ఆస్పత్రికి తరలించామని ఆ జిల్లా కలెక్టర్‌ చెప్పారు.  బెమెతరా జిల్లాలోని ఓ ప్రాంతానికి చెందిన కొందరు మినీ వ్యాన్‌లో ఓ శుభకార్యానికి హాజరు అయ్యారు. ఆ వేడుకలో సంతోషంగా గడిపి తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని  స్థానిక అధికారులు వెల్లడించారు. మొత్తంగా కాసేపట్లో ఇంటికి చేరుకుంటాము అనుకునే సమయంలో తెల్లవారు జాము సమయంలో 9 మంది జీవితాలు తెల్లారిపోయాయి.  ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయాలు అలుముకున్నాయి.

ఇటీవలే తెలంగాణలోని కోదాడ ప్రాంతంలో కూడా అలానే  ఓ ఘోర ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ఓ కారు  ఢీకొట్టడంతో  ఒకే కుటుంబానికి చెందిన  ఆరు మంది మరణించారు. అలానే  మరో ఘటనలో పెళ్లైన ఒకరోజులోనే నవ వధువు రోడ్డు ప్రమాదంలో మరణించింది. ఇలా  అతివేగంగా, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడంతో నిత్యం అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. అంతేకాక ఎవరో నిర్లక్ష్యంగా ఉన్నందుకు అమాయకులు బలవుతున్నారు. రెండు రోజుల క్రితం ఓ స్కూల్ డ్రైవర్ నిర్లక్ష్యంగా  వాహనం నడపడంతో 15 విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. అదృష్టం బాగుండి..ఎవరికి ఎలాంటి ప్రాణపాయం జరగలేదు. మరి.. ఇలాంటి రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు ఏమి తీసుకోవాలి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.