iDreamPost
android-app
ios-app

ఘోర ప్రమాదం.. కూలిపోయిన మైనింగ్ లిఫ్ట్.. 11 మంది!

పొట్ట కూటి కోసం దూర ప్రాంతాలకు వెళ్లిన వారిలో కొందరు అనుకోని ప్రమాదాలతో మృత్యువాత పడుతున్నారు. అలానే మరికొందరు వివిధ ప్రమాదాల్లో చిక్కుకుని కొన్ని రోజుల పాటు నరకయాతన అనుభవిస్తుంటారు. తాజాగా అలాంటి ఘటన ఒకటి చోటుచేసుకుంది.

పొట్ట కూటి కోసం దూర ప్రాంతాలకు వెళ్లిన వారిలో కొందరు అనుకోని ప్రమాదాలతో మృత్యువాత పడుతున్నారు. అలానే మరికొందరు వివిధ ప్రమాదాల్లో చిక్కుకుని కొన్ని రోజుల పాటు నరకయాతన అనుభవిస్తుంటారు. తాజాగా అలాంటి ఘటన ఒకటి చోటుచేసుకుంది.

ఘోర ప్రమాదం.. కూలిపోయిన మైనింగ్ లిఫ్ట్.. 11 మంది!

మనిషి జీవితం అనేది ఎప్పుడు ఎలా ఉంటుందో  ఎవ్వరం చెప్పలేము. ముఖ్యంగా ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఎప్పుడు ఎలాంటి ప్రమాదాలు ఏ వైపు నుంచి ముంచుకోస్తాయో చెప్పలేము. ఇంకా దారుణం ఏమిటంటే.. పొట్ట కూటి కోసం దూర ప్రాంతాలకు వెళ్లిన వారిలో కొందరు అనుకోని ప్రమాదాలతో మృత్యువాత పడుతున్నారు. అలానే మరికొందరు వివిధ ప్రమాదాల్లో చిక్కుకుని కొన్ని రోజుల పాటు నరకయాతన అనుభవిస్తుంటారు. గతంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరిగిన సోరంగం ఘటన గురించి తెలిసిందే. తాజాగా అదే తరహాలో రాజస్థాన్ లో ఓ ఘటన చోటుచేసుకుంది. మరి. పూర్తి వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

రాజస్థాన్ లోని  ఝుంఝును జిల్లాలో ఓ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కంపెనీల్లోని మైనింగ్ లిఫ్ట్ కూలిపోపవడంతో 14 మంది అందులో చిక్కుక పోయారు. రాజస్థాన్ రాష్ట్రంలోని ఝంఝను జిల్లాలో హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ కంపెనీ ఉంది. ఇక్కడ అనే మంది కూలీగా పనులు చేస్తున్నారు. ఇక ఈ కంపెనీకి చెందిన కోలిహాన్ అనే గనిలో ఉన్న లిఫ్ట్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో గనిలో లోప విధులు నిర్వహిస్తున్న 14 మంది అక్కడే చిక్కుకున్నారు. ఈ ప్రమాదం మంగళవారం అర్థరాత్రి జరిగింది.

సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. వెంటనే రెస్క్యూ టీంలు సహాయక చర్యలు చేపట్టి ముగ్గురిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. మిగిలిన 11 మందిని  గనిలో నుంచి బయటకు తీసుకొచ్చేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అలానే గనిలో చిక్కుకుని చాలా గంటలు కావడంతో  అందులోని వారిని కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్‌ ను వేగవంతంగా  నిర్వహిస్తున్నారు. మైనింగ్ గనిలో ఉన్న లిఫ్ట్ కు కట్టిన తాడు తెగిపోవడంతో ఆ లిఫ్ట్ ఒక్కసారి గనిలోనే కూలిపోయింది.

ఇక ఈ ప్రమాదంలో పలువురు అధికారులు చిక్కుకున్నారు.  కూలిపోయిన లిఫ్ట్ ఘటనలో కోల్‌కతా నుంచి వచ్చిన విజిలెన్స్ బృందంతో పాటు గనికిలో ఉండే పలువురు అధికారులు కూడా చిక్కుకున్నారు. ఈ లిఫ్ట్ అనేది గనిలోపల 1,800 అడుగుల లోతులో కూలిపోయి ఉంటుందని అధికారులు  భావిస్తున్నారు. లోపన ఉన్న వారికి ఏవైనా గాయాలైతే చికిత్స అందించడానికి అధికారులు అంబులెన్స్ లు సిద్ధంగా ఉంచారు. మిగిలిన 11మంది కూడా ప్రాణాలోనే ఉన్నారని వైద్యులు సూచిస్తున్నారు.

వారిని రక్షించేందుకు జిల్లా అధికారులు, రెస్క్యూ టీంలు ప్రయత్నిస్తున్నాయి.ఇక ఈ ఘటనలో చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ ఉపేంద్ర పాండే, ఖేత్రి కాపర్ కాంప్లెక్స్ యూనిట్ హెడ్ జిడి గుప్తా, కోలిహన్ మైన్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎకె శర్మ లిఫ్ట్ లో ఉన్నారు. వారి బంధువులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఉత్తరాఖండ్ లో కూడా ఇదే తరహా ఘటన జరిగి.. 42 మంది  రెండు వారాల పాటు గుహాలో చిక్కుకున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి