అప్పుల భారీ నుంచి కాపాడిన భార్య.. భర్త ఏం చేశాడంటే?

కష్టాల్లో ఉన్న భర్తను కాపాడిన ఓ మహిళ ఆ భర్త చేతుల్లోనే దారుణంగా హత్యకు గురైన ఘటన తీవ్ర కలకలం రేపుతుంది.

కష్టాల్లో ఉన్న భర్తను కాపాడిన ఓ మహిళ ఆ భర్త చేతుల్లోనే దారుణంగా హత్యకు గురైన ఘటన తీవ్ర కలకలం రేపుతుంది.

వేదమంత్రాల సాక్షిగా.. బంధుమిత్రుల సమక్షంలో మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన జంటను నిండు నూరేళ్లు కలిసి జీవించాలని దీవిస్తుంటారు. కానీ ఈ మధ్య కాలంలో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న సమస్యలు పెద్దగా మారి చివరికి విడాకులు తీసుకునే స్థాయికి వెళ్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు, అనుమానాలు, ఆరోగ్య సమస్యలు ఇలా ఎన్నో కారణాల వల్ల భార్యాభర్తల మధ్య సమస్యలు తలెత్తి విడిపోతున్నారు. అక్రమ సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చు పెడుతున్నాయి. వారి కుటుంబాల్లో తీరని దుఖాఃన్ని మిగులుస్తున్నాయి. ఆపద సమయంలో తన భర్తకు అండగా నిలిచిన ఓ మహిళ అతని చేతిలోనే హత్యకు గురైంది. పూర్తి వివరాల కోసం..

కర్ణాటక మాండ్యాకు చెందిన అక్బర్ అలీ ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. 13 ఏళ్ల క్రితం నవీదా అనే మహిళతో వివాహం జరిగింది. మైసూర్‌లోని రాజీవ్ నగర్‌లో నివసించే దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. గతంలో అక్బర్ అలీ గుండెపోటుతో ఆసుపత్రిలో చేరాడు. తన భర్తను కాపాడటం కోసం నవీదా తల్లిదండ్రుల వద్ద డబ్బు తీసుకొని భర్తకు చికిత్స చేయించి కాపాడుకుంది. ఇటీవల అక్బర్ అలీ గూడ్స్ ఆటో, ప్రొవిజన్ స్టాల్, ఆటో మొబైల్స్ షాప్ ఇలా పలు వ్యాపారలు నిర్వహిస్తూ చాలా చోట్ల అప్పులు చేశాడు. అక్బర్ అలీ వ్యాపారాల కోసం అత్తింటి వారు కూడా ఆర్థిక సాయం చేశారు.

ఇటీవల నవీద చిన్న షాపు ఓపెన్ చేసి భర్తకు ఆర్థికంగా చేదోడువాదోడుగా నిలుస్తూ వస్తుంది. ఇటీవల భార్యాభర్తల మధ్య ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 4 న భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అక్బర్ అలీ క్షణికావేవంలో కత్తితో నవీదాను పొడిచి చంపి అక్కడ నుంచి వెళ్లిపోయాడు. నవీదాను చూడటానికి వచ్చిన ఆమె కుటుంబ సభ్యులు ఇంట్లోకి వెళ్లి చూడగా ఆపస్మారక స్థితిలో కనిపించింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యలోనే చనిపోయింది. నవీదా భర్త అక్బర్ అలీపై ఆమె కుటుంబ సభ్యులు ఉదగిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

Show comments