కూతురు అంటే ఆ తండ్రికి ప్రాణం! కష్టపడి చదివిస్తే విధి రాత మరోలా!

గత కొన్ని రోజులుగా పశ్చిమబెంగాల్ ను భారీవర్షాలు, వరదలుముంచెత్తుతున్నాయి.  దీంతో పలు ప్రాంతాల్లో  వరదలతో రోడ్లు, కాలనీలు నీట మునిగాయి. ఈ క్రమంలోనే పశ్చిమబెంగాల్ లోని హౌరా జిల్లా శాల్కియా ప్రాంతంలో ఓ కాలనీ కూడా పూర్తిగా నీటి మునిగింది. దీంతో ఆ ప్రాంతంలో ఓ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.

గత కొన్ని రోజులుగా పశ్చిమబెంగాల్ ను భారీవర్షాలు, వరదలుముంచెత్తుతున్నాయి.  దీంతో పలు ప్రాంతాల్లో  వరదలతో రోడ్లు, కాలనీలు నీట మునిగాయి. ఈ క్రమంలోనే పశ్చిమబెంగాల్ లోని హౌరా జిల్లా శాల్కియా ప్రాంతంలో ఓ కాలనీ కూడా పూర్తిగా నీటి మునిగింది. దీంతో ఆ ప్రాంతంలో ఓ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.

దేశ వ్యాప్తంగా ప్రస్తుతం ఎక్కడ చూసిన ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఈ వర్షాలు కారణంగా పలు రాష్ట్రాల్లోని చెరువులు, కాలువలు, నదులు నిండిపోయి వరదలా పొంగి పోర్లుతున్నాయి. కాగా, ఇప్పటికే మహారాష్ట్ర, గుజరాత్, అస్సాం వంటి రాష్ట్రాల్లో భారీ వర్షల కారణంగా లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. ముఖ్యంగా కేరళ రాష్ట్రంలోని వాయనాడ్ లో కొండచరియలు విరిగిపడటంతో.. ఆ ప్రాంతం మొత్తం అతలాకుతలం అయిన విషయం తెలసిందే. మరోవైపు పశ్చిమ బెంగాల్ లోని కూడా ఇదే పరిస్థితి ఏర్పాడింది.  దీంతో పశ్చిమ బెంగాల్ లోని కోల్‌కతా తో పాటు పలు ప్రాంతాల్లో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా రహదారులు, విమాశ్రమాలు కూడా కుండపోత వర్షంతో జలమాయంగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పశ్చిమ బెంగాల్ లోని ఓ ప్రాంతంలో కాలనీ మొత్తం నీటితో మునిగిపోయి, విద్యుత్ వైరులు తెగి పడి ప్రవహిస్తున్న నీటిలో పడ్డాయి. అయితే అదే ఓ తండ్రి కూతురి మృత్యువుకు యమపాశంగా మారింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

గత కొన్ని రోజులుగా పశ్చిమబెంగాల్ ను భారీవర్షాలు, వరదలుముంచెత్తుతున్నాయి.  దీంతో పలు ప్రాంతాల్లో  వరదలతో రోడ్లు, కాలనీలు నీట మునిగాయి. ఈ క్రమంలోనే పశ్చిమబెంగాల్ లోని హౌరా జిల్లా శాల్కియా ప్రాంతంలో ఓ కాలనీ కూడా పూర్తిగా నీటి మునిగింది. ఇక ఆ వరద నీటిలో ఓ విద్యుత్ వైరు తెగి కాలనీలో ప్రవహిస్తున్న నీటిలో పడింది. కానీ, అదే ఓ తండ్రి కూతురి పాలిట మృత్యువుగా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. శాల్కియా ప్రాంతంలో నివాసం ఉంటున్న పుర్వి (22) అనే యువతి.. అదే కాలనీలో ఓ బర్త్ డే పార్టీకి వెళ్లేందుకు రెడీ అయ్యింది. ఇక వెళ్లే ముందు అదే కాలనీలో షాపు నిర్వహిస్తున్న తన తండ్రికి చెప్పి వెళ్లలనుకుంది. అయితే తండ్రిని చేరే క్రమంలో కాలనీలో ప్రవహిస్తున్న వరద నీటిలో కరెంట్ వైర్ తెగి పడటంతో పుర్వి షాక్ కు గురయ్యింది.

అయితే అల్లరుముద్దుగా పెంచుకున్ కూతురు విద్యుత్ షాకు గురై గిలగిల కొట్టుకుంటడంతో.. ఆ తండ్రి హృదయం తల్లడించింది. వెంటనే  కూతురుని కాపాడలనే ఆరాటంతో ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే నీటిలో దూకాడు. దీంతో అతనికి కూడా కరెంట్ షాక్ గురవ్వడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. దీంతో వెంటనే స్థానికులు స్పందించి కరెంట్ డిపార్టుమెంట్ కు ఫోన్ చేసి విద్యుత్ సరఫరా నిలిపివేశారు.  ఇక కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. కానీ, చికిత్స పొందుతునే తండ్రి, కూతురు ఇద్దరు మరిణించారు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Show comments