iDreamPost
android-app
ios-app

జుట్టు రాలి అందం చెడిపోతుందని.. హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుంటే.. చివరకు

  • Published Sep 26, 2024 | 2:20 PM Updated Updated Sep 26, 2024 | 2:25 PM

ఇటీవలే  ఓ యువకుడు తీవ్రంగా జుట్టు రాలిపోతుండటంతో చాలా ఆందోళ చెందాడు.  ఇక జుట్టు రాలిపోవడంతో తన అందం మొత్తం పోతుందని, ఎలాగైన సరే హెయిర్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. దీంతో అనుకున్న విధంగానే హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ చేసుకున్నాడు. కానీ, చివరికి ఊహించని దారుణం చోటు చేసుకుంది.

ఇటీవలే  ఓ యువకుడు తీవ్రంగా జుట్టు రాలిపోతుండటంతో చాలా ఆందోళ చెందాడు.  ఇక జుట్టు రాలిపోవడంతో తన అందం మొత్తం పోతుందని, ఎలాగైన సరే హెయిర్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. దీంతో అనుకున్న విధంగానే హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ చేసుకున్నాడు. కానీ, చివరికి ఊహించని దారుణం చోటు చేసుకుంది.

  • Published Sep 26, 2024 | 2:20 PMUpdated Sep 26, 2024 | 2:25 PM
జుట్టు రాలి అందం చెడిపోతుందని.. హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుంటే.. చివరకు

నేటి కాలంలో జుట్టు రాలడం అనేది సాధారణ విషయం అయిపోయింది. చాలామంది తరుచు ఈ సమస్యతో బాధపడుతుంటారు. ముఖ్యంగా మగవాళ్ల విషయానికొస్తే.. టీనేజ్ నుంచే ఈ రాలిపోవడం సమస్య ప్రారంభమవుతుంది. అయితే జుట్టు రాలిపోవడానికి అనేక  కారణాలు ఉండవచ్చు. అది జన్యుపరంగా కానీ, పోషకాహారలోపం మరి ఏ ఇతర కారణాల చేత కానీ జుట్టు రాలిపోవడం, పలచగా మారిపోవడం, బట్టతల వస్తుంటాయి. కొన్ని సందర్భల్లో వివిధ రకాల వ్యాధులకు ట్రీట్‌మెంట్ తీసుకున్న, అధిక ఒత్తిడి గురైన సరే జుత్తు రాలిపోవడం ఎక్కువగా జరుగుతుంది.

అయితే ఇలా టీనేజ్ లోనే జుత్తి రాలిపోవడంతో చాలామంది భయపడుతుంటారు. ఎందుకంటే.. జుత్తు రాలిపోతే పూర్తిగా బట్టతల వస్తుందని, దీని వల్ల అందకు దెబ్బ పడుతుందని తెగ ఆందోళన పడతారు. ఈ క్రమంలోనే రకరకాల క్రీమ్స్, హెయిర్ ఆయిల్స్ వినియోగిస్తుంటారు. ఇక వీటితో పని జరగకపోతే.. చాలామంది హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ చేసుకుంటారు. కానీ, అందం కోసం ఎవరైనా ఇలా హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ చేసుకుంటున్నారా..  అయితే డేంజర్ పడినట్లే. తాజాగా అందం కోసం ఓ యువకుడు హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ చేయించుకున్నాడు. చివరికి సర్జరీ వికటించడంతో ఊహించని దారుణం చోటు చేసుకుంది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ఇటీవలే  ఓ యువకుడు తీవ్రంగా జుట్టు రాలిపోతుండటంతో చాలా ఆందోళ చెందాడు.  ఇక జుట్టు రాలిపోవడంతో తన అందం మొత్తం పోతుందని, ఎలాగైన సరే హెయిర్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలని ఆ యువకుడు భావించాడు. ఈ క్రమంలోనే హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ చేయించుకున్నాడు. కానీ, అది వికటించడంతో ప్రాణలు కోల్పేయడు. అయితే ఈ ఘటనపై యువకుడి తల్లిదండ్రులు తెలిపిన వివరాల మేరకు.. మంగుళూరులోని దొడ్డబళ్లాపురం అక్కరెకెరె ప్రాంతానికి చెందిన మహమ్మద్ కు జుట్టు రాలిపోయే సమస్య ఉంది. దీంతో మంగుళూరు బెందోర్వెల్లో ఉన్న ఫ్లోంట్ కాస్మెటిక్ సర్జరీ- హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ క్లినిక్లో సంప్రదించాడు. అక్కడ నిపుణులు అతనికి హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ ఆపరేషన్ చేస్తుండగా మహమ్మద్ ఆరోగ్యం విషమించింది.

వెంటనే స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స నిపుణుల నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు మృతి చెందడని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అనంతరం ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇకపోతే హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ క్లినిక్ లో జరిగిన సర్జరీ వికటించడంతోనే ఆ యువకుడు మృతి చెందినట్లు సమాచారం. కనుకు అందం కోసం ఆందోళ పడుతూ.. హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ కు అడుగులు వేస్తే ప్రాణాలు పోయే ఘటనలు కూడా చోటు చేసుకోవచ్చని కొంతమంది నిపుణులు యువతకు హెచ్చరిస్తున్నారు. మరి, హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ చేసుకోని వికటించడంతో మృతి చెందిన ఈ ఘటన పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.