iDreamPost
android-app
ios-app

అన్యోన్య దాంపత్యం.. భర్త చేసిన పనికి భార్య సంచలన నిర్ణయం

  • Published Jul 17, 2024 | 11:12 AM Updated Updated Jul 17, 2024 | 11:12 AM

గత కొన్ని రోజులుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఓ వ్యక్తి మరణించడంతో.. అతని భార్య ఎవ్వరూ చేయని పని చేసింది. దీంతో ఆ భార్య చేసిన పనికి అతని కుటుంబంలో అందరూ షాక్ కు గురయ్యారు. ఇంతకి ఏం జరిగిందంటే..

గత కొన్ని రోజులుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఓ వ్యక్తి మరణించడంతో.. అతని భార్య ఎవ్వరూ చేయని పని చేసింది. దీంతో ఆ భార్య చేసిన పనికి అతని కుటుంబంలో అందరూ షాక్ కు గురయ్యారు. ఇంతకి ఏం జరిగిందంటే..

  • Published Jul 17, 2024 | 11:12 AMUpdated Jul 17, 2024 | 11:12 AM
అన్యోన్య దాంపత్యం.. భర్త చేసిన పనికి భార్య సంచలన నిర్ణయం

దశాబ్ధకాలంలో సామాజిక దురాచారమైన సతీసహగమనం గురించి అందరికీ తెలిసే ఉంటుంది. అప్పటిలో భర్త మరణించిన తర్వాత ఆయన చితిలో భార్య కూడా దూకి ఆత్మార్పణం చేసుకోనే ఆచారం ఉండేది. కాగా, అప్పట్లో చాలామంది స్త్రీలు ఈ మూఢనమ్మకం కారణంతో భర్త చితిలో వాళ్లు సజీవదహనం అయ్యేవారు. కానీ, రాను రాను ఈ ఆచారన్ని కొందు వ్యతిరేకిస్తూ దానిని శాశ్వతంగా నిర్మూలించారు. ఇక ప్రస్తుత సమాజంలో ఈ సతీసహగమనం గురించి పుస్తకాల్లో చదవడం తప్ప నిజంగా బయట జరగడం అనేది ఎక్కడ లేదు. కానీ, తాజాగా ఓ రాష్ట్రంలో మాత్రం మళ్లీ ఇన్నేళ్లకు ఈ సతీసహగమనం అనేది వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ఘటన బలవంతంగా జరిగినది కాదు, కేవలం భర్త మీద ప్రేమతో ఆయన చితిలో దుకింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

వేద మంత్రలా సాక్షిగా.. మూడు మూళ్ల బంధంతో ఒకటై, ఏడుడడుగుల నడిచి కడదాక తోడుండలసిన భర్త ఆనారోగ్యం కారణంగా మరణించాడు. దీంతో భర్త లేని జీవితం వ్యర్థమని, ఆ జీవితం తనకు వద్దు అనుకున్న ఓ మహిళ తన భర్త చితిలోనే దూకి ఆత్మహత్య చేసుకుందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ విషాద ఘటన చత్తీస్ గఢ్ జిల్లా రాయగఢ్ ల చోటు చేసుకుది. ఆ వివరాళ్లోకి వెళ్తే.. రాయగఢ్ లోని చక్రధర్ నగర్ చెందిన జైదేవ్ గుప్తా(65) క్యాన్సర్ ​తో ఆదివారం మరణించాడు.దీంతో అతని దహన సంస్కారాలు అదే రోజు సాయంత్రం గ్రామంలో నిర్వహించి అంతా ఇంటికి చేరుకున్నారు.

అయితే భర్త అంత్యక్రియలు జరిగిన రోజు రాత్రి 11 గంటల సమయంలో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఆమె భార్య గులాబ గుప్తా(58) బయటికి వెళ్లి మళ్లీ తిరిగిరాలేదు. దీంతో కుటుంబ సభ్యులంతా గాలించగా, ఆమె చెప్పులు, కళ్లద్దాలు, బట్టలు భర్త చితి వద్ద కనిపించాయి. దీంతో గులాబీ గుప్తా భర్త చితిలోనే దూకి ఆత్మహత్య చేసుకుందని భావించి పోలీసులకు సమాచారమిచ్చారు.కానీ ఆమె మృతిపై అనుమానాలు రేకెత్తడంతో.. ఫోరెన్సిక్ బృందం చితి నుంచి శాంపిల్స్ సేకరించి టెస్టులకు పంపింది. ఇక పోలీసులు మాత్రం మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకొని విచారణ జరిపిస్తున్నారు. మరి, ఫోరెన్సిక్ రిపోర్టు వస్తే ఆ మహిళ మృతికి గల వివరాలు వెలుగులోకి వస్తాయి.