P Krishna
దేశంలో నిత్యం ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అతివేగం, డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లో ఎంతోమంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.
దేశంలో నిత్యం ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అతివేగం, డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లో ఎంతోమంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.
P Krishna
ఇటీవల దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా చలికాంలో ఉదయం పూట పొగ మంచు కప్పి ఉండటంతో వాహనదారులకు ఎదురుగా వచ్చే వాహనాలు సరిగా కనిపించకపోవడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. మరోవైపు డ్రైవర్లు నిర్లక్ష్యం, అవగాహన లేమి, అతి వేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. రోడ్డు భద్రత చర్యలు ఎంత కఠినతరం చేస్తున్నా.. డ్రైవర్లు చేసే తప్పిదాల వల్ల ఎన్నో నిండు ప్రాణాలు బలి అవుతున్నాయి. పెద్ద దిక్కు కోల్పోయిన కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. తాజాగా అస్సాం లో ఘోర ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే..
అస్సాం రాష్ట్రం.. గోలాఘాట్ లోని డెర్గావ్ సమీపంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బలిజం ప్రాంతంలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీ కొట్టడంతో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో 14 మంది అక్కడిక్కడే చనిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకాకం.. బుధవారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో గోలాఘాట్ నుంచి టిన్సుకియా వైపు 45 మంది ప్రయాణికులతో ఓ బస్సు వెళ్తుంది.. అదే మార్గంలో ఎదురుగా బొగ్గులోడ్ తో వస్తున్న ట్రక్కు బలంగా ఢీ కొట్టింది. దీంతో బస్సు ముందుభాగం నుజ్జు నుజ్జు అయ్యింది. ఈ ప్రమాదంలో రెండు వాహనాల డ్రైవర్లతో సహా పద్నాలు మంది దుర్మరణం పాలయ్యారు. మరో 25 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.
స్థానికులు సమాచారం అందించడంతో హుటా హుటిన పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించి క్షతగాత్రులను దగ్గరలోని జోర్హాట్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ కి తరలించారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు బావిస్తున్నారు. ప్రస్తుతం జాతీయ రహదారిపై రోడ్డు మరమ్మతులు జరుగుతున్నాయి.. రెండు వైపుల నుంచి వచ్చే వాహనాలు డివైడర్ కి ఒకవైపు నుంచే వెళ్తున్నాయి. అప్పటికే అక్కడ వాహనాలు వేగం తగ్గించుకోవాలని సూచనలు కూడా చేశారు. అయితే రెండు వాహనాలు అతి వేగంగా రావడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యేక్ష సాక్షులు తెలిపినట్లు గోలాఘాట్ డిప్యూటీ కమిషనర్ ఉదయ్ ప్రవీణ్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని గోలాఘాట్ ఎస్పీ రాజేన్ సింగ్ తెలిపారు.
Assam | Several people feared dead and many others were injured after the bus in which they were travelling collided with a truck near the Dergaon area in Assam’s Golaghat district, today: Golaghat District Police
— ANI (@ANI) January 3, 2024