iDreamPost
android-app
ios-app

బ్రేకింగ్: పలు స్కూళ్లకు బాంబు బెదిరింపులు.. పాఠశాలలు మూత

  • Published Feb 08, 2024 | 5:35 PM Updated Updated Feb 08, 2024 | 5:44 PM

Bomb Threats to Schools: ఈ మధ్యకాలంలో పలు పాఠశాలలకు బాంబు బెదిరింపు కాల్స్, మెయిల్స్ వస్తున్నాయి.. దీంతో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళన చెందుతున్నారు. అలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది.

Bomb Threats to Schools: ఈ మధ్యకాలంలో పలు పాఠశాలలకు బాంబు బెదిరింపు కాల్స్, మెయిల్స్ వస్తున్నాయి.. దీంతో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళన చెందుతున్నారు. అలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది.

బ్రేకింగ్: పలు స్కూళ్లకు బాంబు బెదిరింపులు.. పాఠశాలలు మూత

ఇటీవల దేశ వ్యాప్తంగా కాల్స్, మెయిల్స్ తో బాంబు బెదిరింపులకు పాల్పపడుతున్నారు. ముఖ్యంగా స్కూల్స్, కాలేజ్ యాజమాన్యాలను టార్గెట్ చేసుకొని బాంబు బెదిరింపులకు పాల్పపడుతున్నారు. దీంతో పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు భయంతో వణికిపోతున్నారు. పోలీసులు, బాంబ్ స్క్వాడ్స్ రంగంలోకి దిగి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఎలాంటి బాంబులు లేవని తేల్చుతున్నారు. వచ్చిన కాల్స్, మెయిల్స్ అన్నీ ఫేక్ అని తేలిపోతున్నాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు, అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. తాజాగా మరోసారి పలు పాఠశాలలకు బెదిరింపు మెయిల్స్ రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. వివరాల్లోకి వెళితే..

తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై నగరంలో కొన్ని పాఠశాలలకు బాంబు బెదిరింపు మెయిల్స్ రావడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. కొంతమంది అగంతకులు పలు స్కూళ్లలో బాంబులు పెట్టామని మెయిల్స్ పంపించారు. జేజే నగర్, ఆర్ ఏ పురం, అన్నా నగర్, గోపాల్ పురంలోని పలు ప్రైవేట్ పాఠశాలకు బాంబులతో విధ్వంసం చేయబోతున్నాం అంటూ మెయిల్స్ అందడంతో యాజమాన్యం వెంటనే అప్రమత్తమై పాఠశాలను మూసివేశారు. విద్యార్థులను వారి వారి ఇళ్లకు పంపించారు. పోలీసులకు సమాచారం అందించడంతో బాంబు స్క్వాడ్ రంగంలోకి దిగి ఆయా స్కూల్స్ లో పరిసర ప్రాంతాలు జల్లెడ పట్టారు.. ఎక్కడా బాంబులు లేవని నిర్ధారించారు. దీంతో పాఠశాల యాజమాన్యాలు, విద్యార్ధులు, తల్లిదండ్రుల ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.

బాంబ్ స్వ్కాడ్ కి ఇప్పటి వరకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు, పేలుడు పదార్థాలకు సంబంధించిన ఆనవాళ్లు లభ్యం కాకపోవడంతో పాఠశాలలకు వచ్చిన మెయిల్స్ ఫెక్ అని తేలింది. ప్రజలు ఎవరూ భయాందోళనకు గురి కావొద్దని, ఈ మెయిల్స్ ఆధారంగా నింధితులను గుర్తించి తగు చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. డీఏవీ గోపాలపురంలోని చెన్నై పబ్లిక్ స్కూల్, సెయింట్ మేరీస్ స్కూల్స్ కి కూడా బాంబు బెదిరింపు మెయిల్ పంపించారు అజ్ఞాత వ్యక్తులు. ఇటీవల బెంగుళూరు లోని దాదాపు 15 పాఠశాలలకు ఇదే మాదిరిగా బాంబ్ బెదిరింపు మెయిల్స్ పంపించిన విషయం తెలిసిందే.. బాంబు స్వ్కాడ్ రంగంలోకి దిగి తనిఖీ చేపట్టి పేలుడు పదార్దాలు లభించకపోవడంతో.. అవి ఫెక్ బెదిరింపులని తేల్చారు.