P Krishna
Massive Robbery in Train: సాధారణంగా సుదూర ప్రయాణాలు చేసేవారు ఎక్కువ శాతం రైల్వేలో ప్రయాణిస్తుంటారు. భారత రైల్వే అది పెద్ద రవాణా వ్యవస్థ.. ప్రతిరోజూ లక్షల మంది రైల్ ప్రయాణం చేస్తుంటారు.
Massive Robbery in Train: సాధారణంగా సుదూర ప్రయాణాలు చేసేవారు ఎక్కువ శాతం రైల్వేలో ప్రయాణిస్తుంటారు. భారత రైల్వే అది పెద్ద రవాణా వ్యవస్థ.. ప్రతిరోజూ లక్షల మంది రైల్ ప్రయాణం చేస్తుంటారు.
P Krishna
ప్రపంచంలోనే భారత్ రైల్వే అతి పెద్ద రవాణా వ్యవస్థగా చెబుతుంటారు. ప్రతిరోజూ లక్షల సంఖ్యలో విద్యార్థులు, ఉద్యోగులు, చిరు వ్యాపారులు ప్రయాణిస్తుంటారు. సుదూర ప్రయాణాలు చేసేవారు ఎక్కువగా రైల్వే ప్రయాణాలు చేయడానికే ఇష్టపడుతుంటారు..ఎందుకంటే ఇతర రవాణా వ్యవస్థలో లేని సౌకర్యాలు రైల్ లో ఉంటాయి. విహార యాత్రలు చేసేవారు ఎక్కువగా తమ కుటుంబ సభ్యులతో రైలు ప్రయాణాలు చేస్తుంటారు.రైల్ ప్రయాణం తక్కువ ఖర్చు మాత్రమే కాదు సురక్షితంగా భావిస్తుంటారు. కానీ, ఈ మధ్య కాలంలో పలు రైళ్లు ప్రమాదాలకు గురి కావడం, దోపిడికి గురి కావడం ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా షిర్డీ- కాకినాడ ట్రైన్‌లో దొంగలు హల్ చల్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
షిర్డిలో సాయిబాబా దర్శనం కోసం వెళ్లిన ఏపీ, తెలంగాణ కు చెందిన భక్తులు.. తిరుగ ప్రయాణంలో షిర్డీ – కాకినాడ పోర్టు రైల్ ఎక్కారు. శుక్రవారం తెల్లవారు జామున గాఢ నిద్రలో ఉండగా ట్రైన్ లో దొంగల చొరబడి వారి లగేజ్ ఎత్తుకెళ్లారు. ఏకంగా మూడు బోగీల్లో దొంగలు ప్రయాణికుల లగేజ్ ఎత్తుకు వెళ్లారు. ఈ ఘటన మహారాష్ట్ర పరిధితోని పర్లి బైద్యనాథ్ వద్ద చోటుచేసుకుంది. బాధితులు బీదర్ వచ్చిన తర్వాత తమ లగేజీ కనిపించకుండా పోవడంతో లబోదిబో అన్నారు. వెంటనే ట్రైన్ ని ఆపి ఆందోళనకు దిగారు. లగేజీల్లో విలువైన వస్తువులు ఉన్నాయని.. డబ్బు ఉందని ఇప్పుడు తమ పరిస్థితి ఏంటని రైల్వే అధికారులను ప్రశ్నించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
శుక్రవారం తెల్లవారు జామున షిర్డీ – కాకినాడ ఎక్స్ ప్రెస్ (నెంబర్ 17205) లో ఏక కాలంలో మూడు బోగీల్లో దొంగలు దోపీడి చేశారు. షిర్డీ సాయిబాబా దర్శనం చేసుకొని తిరిగి వస్తున్న సమయంలో పర్లీ బైధ్యనాథ్ వద్ద ప్రయాణికుల లగేజ్ తో దొంగలతు పరార్ అయ్యారు. మూడు బోగీల్లో ఉన్నవారంతా ఏపీ, తెలంగాణకు చెందిన ప్రయాణికులే. తమ లగేజ్ పోవడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు ప్రయాణికులు. బీదర్ రైల్వే పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే లగేజ్ పోయిన బాధలో తాము ఉంటే.. కొంతమంది రైల్వే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.