iDreamPost
android-app
ios-app

విషాదంగా ముగిసిన సచివాలయ ఉద్యోగి మిస్సింగ్ కేసు.. ఆ కారణంతో

  • Published Aug 06, 2024 | 1:48 PM Updated Updated Aug 06, 2024 | 1:48 PM

మరో 15 రోజుల్లో పెళ్లి . ఇంట్లో సందడి నెలకొంది. పెళ్లి షాపింగ్ మొదలైంది. అంతలో పెళ్లి కూతురు మిస్సింగ్. ఉద్యోగం చేస్తున్న చోట, ఇతర ప్రాంతాల్లో ఆమె కోసం వెతికారు. చివరకు ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ..

మరో 15 రోజుల్లో పెళ్లి . ఇంట్లో సందడి నెలకొంది. పెళ్లి షాపింగ్ మొదలైంది. అంతలో పెళ్లి కూతురు మిస్సింగ్. ఉద్యోగం చేస్తున్న చోట, ఇతర ప్రాంతాల్లో ఆమె కోసం వెతికారు. చివరకు ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ..

  • Published Aug 06, 2024 | 1:48 PMUpdated Aug 06, 2024 | 1:48 PM
విషాదంగా ముగిసిన సచివాలయ ఉద్యోగి మిస్సింగ్ కేసు.. ఆ కారణంతో

గత నెలలో నిశ్చితార్థం.. ఈ నెలలో పెళ్లి. ఇంట్లో పెళ్లి సందడి నెలకొంది. అంతలో పెళ్లి కూతురు మిస్సింగ్. శనివారం నుండి ఆమె ఆచూకీ గల్లంతు అయ్యింది. పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ ప్రారంభించారు. చివరకు ఆ యువతి ఓ రేవు దగ్గర శవమై కనిపించింది. కాకినాడ జిల్లా సచివాలయ ఉద్యోగి అదృశ్యం కేసు కాస్త విషాదంగా మారింది. తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తుడటంతో యువతి ఆత్మహత్యకు ఒడిగట్టింది. చనిపోయే ముందు సోదరుడికి తాను చనిపోతున్నానంటూ మేసేజ్ పంపింది. చివరకు శవమై ఓ గట్టున తేలింది. పోలీసులు, స్థానికులు చెబుతున్న వివరాలు ఇలా ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లాలోని జీఎం పేటకు చెందిన లలిత.. స్థానిక సచివాలయంలో ఉద్యోగం చేస్తుంది. ఆమెకు పెళ్లి సెట్ చేశారు పేరెంట్స్. గత నెల 22న ఆమెకు నిశ్చితార్థం జరిగింది. ఈ నెల 22న పెళ్లి డేట్ ఫిక్స్ అయ్యింది. ఇంట్లో కుటుంబ సభ్యులు పెళ్లి తేదీ దగ్గర పడుతుండటంతో ఆ పనుల్లో బిజీగా ఉన్నారు. అంతలో లలిత అదృశ్యమైంది. బయటకు వెళ్లిన ఆమె ఇంటికి రాకపోవడంతో అన్ని చోట్లా వెతికారు. చివరకు తాను చనిపోతున్నానంటూ సోమవారం తన సోదరుడికి మేసేజ్ పంపింది. ఆ తర్వాత రేవులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది. లలిత కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆమె కుటుంబ సభ్యులు.

ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టగా.. కుంభాభిషేకం రేవు దగ్గర లలిత మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు.  కాగా,పెళ్లి కోసం ఆమెను మరో మతంలోకి మారాలని బలవంతం చేయడంతోనే ఆత్మహత్యకు ఒడిగట్టిందని స్థానికులు చెబుతున్నారు. ఆమెకు ఈ పెళ్లి ఏ మాత్రం ఇష్టం లేకనే బలవన్మరణానికి పాల్పడినట్లు సమాచారం. వివాహ తేదీ దగ్గరపడుతుండటంతో తనకు తాను సర్ది చెప్పుకోలేక ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు మాట్లాడుకుంటున్నారు. పెళ్లి పీటలు ఎక్కాల్సిన కూతురు.. మృత్యు ఒడికి చేరే సరికి కన్నీరు మున్నీరు అవుతున్నారు కుటుంబ సభ్యులు.  మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom