iDreamPost
android-app
ios-app

లక్ అంటే ఇతనిదే.. వల వేస్తే ఏకంగా 300 కిలోల చేప తగిలింది!

  • Published Jun 19, 2024 | 9:35 PM Updated Updated Jun 19, 2024 | 9:35 PM

300 KG Fish: సముద్రంలో చేపలు పట్టేవారికి అప్పుడప్పుడు అదృష్టం భారీ చేపల రూపంలో దొరుకుతుంది. నెలంతా కష్టపడినా రాని డబ్బులు ఆ ఒక్కరోజు వస్తాయి. దీంతో మత్స్యకారుల కుటుంబంలో పండగ వాతావరణం నెలకొంటుంది. తాజాగా ఒక జాలరిని అదృష్టం వరించింది. వల వేస్తే 300 కిలోల బాహుబలి చేప పడింది. దాని ధర ఎంతంటే?

300 KG Fish: సముద్రంలో చేపలు పట్టేవారికి అప్పుడప్పుడు అదృష్టం భారీ చేపల రూపంలో దొరుకుతుంది. నెలంతా కష్టపడినా రాని డబ్బులు ఆ ఒక్కరోజు వస్తాయి. దీంతో మత్స్యకారుల కుటుంబంలో పండగ వాతావరణం నెలకొంటుంది. తాజాగా ఒక జాలరిని అదృష్టం వరించింది. వల వేస్తే 300 కిలోల బాహుబలి చేప పడింది. దాని ధర ఎంతంటే?

లక్ అంటే ఇతనిదే.. వల వేస్తే ఏకంగా 300 కిలోల చేప తగిలింది!

అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో చెప్పలేం. అనుకోకుండా అదృష్టం వచ్చి పడుతుంది. కొంతమందికి లాటరీ రూపంలో వరిస్తుంది. కొంతమందికి లక్కీ కూపన్స్ రూపంలో వరిస్తుంది. కొంతమందికి పంట పొలాల్లో వజ్రాల రూపంలో వరిస్తుంది. కొన్నిసార్లు మత్య్సకారులను కూడా ఈ అదృష్టం వరిస్తుంది. ఒక మత్స్యకారుడు చేపల కోసం వేటకు వెళ్తే.. ఏకంగా 300 కిలోల చేప తగిలింది. నెలంతా కష్టపడినా గానీ రాని డబ్బు ఒక్కరోజులో సంపాదించారు.

కాకినాడ సముద్ర తీరంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు అదృష్టం పట్టింది. వలలో కొమ్ముకోనాం, నెమలి కోనెం వంటి భారీ చేపలు చిక్కాయి. సుమారు 300 కిలోల బరువైన కొమ్ముకోనాం అనే చేప ఒక మత్స్యకారుడి వలలో చిక్కింది. అయితే దీన్ని ఒడ్డుకు చేర్చేందుకు మత్స్యకారులు చాలా శ్రమించాల్సి వచ్చింది. ఈ భారీ చేపను క్రేన్ సాయంతో కుంభాభిషేకం రేవుకు తరలించారు. ఆ తర్వాత మత్స్యకారులు వేలంపాట నిర్వహించారు. ఆ వేలంపాటలో ఈ చేప ఏకంగా 36 వేల రూపాయలు పలికింది. దీంతో మత్స్యకారుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. చాలా మంది మత్స్యకారులకు భారీ చేపలు చిక్కాయి. వారంతా అధిక ధరకు అమ్ముకుని లాభాలు పొందారు.

చేపల వేట విరామం తర్వాత భారీ చేపలు తమ వలలకు చిక్కడంతో స్థానిక మత్స్యకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఇలానే భారీ చేపలు చిక్కి మత్స్యకారులకు లాభాలు తెచ్చిపెట్టాయి. ఇవి అరుదైన జాతి చేపలు కావడంతో వేలంపాట నిర్వహించి విక్రయిస్తారు. వీటి రుచి కూడా బాగుంటుందని.. అందుకే దీని కోసం ఎగబడతారని స్థానికులు చెబుతున్నారు. రిస్క్ చేసి సముద్ర తీరానికి దూరంగా వెళ్తేనే ఇలాంటి చేపలు దొరుకుతాయి. తీరం నుంచి ఆరు, ఏడు నాటికన్ మైళ్ళు వెళ్తేనే దొరుకుతాయి. అయితే ఈ కొమ్ముకోనాం చేపలను పట్టుకోవడం అంత సులభం కాదని.. చాలా డేంజర్ అని చెబుతున్నారు. ఈ చేపలకు ముందు భాగంలో ఒక కత్తిలా పదునైన కొమ్ము ఉంటుంది. అందుకే దీన్ని ఇంగ్లీష్ లో స్వార్డ్ ఫిష్ అంటారు.

చేప ఎంత పొడవు అంటే ఈ కొమ్ము కూడా అంతే పొడవు ఉంటుంది. అది గుచ్చుకుంటే చాలా ప్రమాదం. ఎవరైనా పట్టుకునే ప్రయత్నం చేస్తే ఆ కొమ్ముతో దాడి చేస్తుంది. ఈ చేపల దాడిలో చాలా మంది మత్స్యకారులు ప్రాణాలు కోల్పోయారు. అయినప్పటికీ బతుకు తెరువు కోసం పోరాడక తప్పదు కాబట్టి ప్రాణాలకు తెగించి ఈ చేపలను పట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఇక ఈ చేపల విషయానికొస్తే.. ఒక్కో చేప సగటున 20 నుంచి 350 కిలోల వరకూ పెరుగుతుంది. ఇవాళ దొరికిన చేప మాత్రం 300 కిలోల బరువు ఉంటుందని స్థానికులు చెబుతున్నారు.