SNP
Gyanvapi Masjid, ASI Report: వివాదాస్పదమైన జ్ఞానవాపి మసీదుపై ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా తాజాగా ఒక రిపోర్ట్‌ను కోర్టును సమర్పించింది. ఆ రిపోర్ట్‌లోని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం..
Gyanvapi Masjid, ASI Report: వివాదాస్పదమైన జ్ఞానవాపి మసీదుపై ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా తాజాగా ఒక రిపోర్ట్‌ను కోర్టును సమర్పించింది. ఆ రిపోర్ట్‌లోని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం..
SNP
వారణాసిలోని విశ్వనాథుడి ఆలయానికి ఆనుకుని ఉన్న జ్ఞానవాపి మసీదుపై ఏఎస్‌ఐ(ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా) సంచలన రిపోర్టును ఇచ్చింది. మసీదు కింద ఆలయానికి సంబంధించిన ఆనవాళ్లు ఉన్నట్లు, ఆలయాన్ని కూలగొట్టే మసీదుని నిర్మించినట్లు తేల్చినట్లు వెల్లడైంది. మసీదు నిర్మాణంలో ఆలయ స్తంభాలను, రాళ్లను ఉపయోగించారని, ఆలయం గోడలతోపాటు కొన్ని ఇతర నిర్మాణాలను యథాతథంగా మసీదులో కలిపేశారని రిపోర్ట్‌లో పేర్కొంది. ఆ రిపోర్ట్‌ను కోర్టు ఆదేశాల మేరు.. హిందూ, ముస్లిం సంస్థలకు పంపిచారు. హిందూ కక్షిదారుల తరఫు న్యాయవాది విష్ణుశంకర్‌జైన్ ఏఎస్‌ఐ సర్వే నివేదికలో ఉన్న వివరాలను వెల్లడించారు.
839 పేజీల రిపోర్ట్‌లో ఆలయ కూల్చివేత ఎప్పుడు జరిగింది, ఎలాంటి ఆధారాలు లభించాయి, మసీదు నిర్మాణ ఎప్పుడు జరిగి ఉంటుంది, ఎలాంటి శాసన ఆధారలు లభించాయనే కీలక విషయాలు పొందుపర్చారు. ‘సర్వేలో ఇప్పుడున్న మసీదు గోడలపై ఆలయ నిర్మాణం తాలూకు గోడలపై 34 శాసనాలు ఉన్నట్లు ఏఎస్‌ఐ గుర్తించింది. ఆయా శాసనాలు దేవనాగరి, గ్రంథ, తెలుగు, కన్నడ లిపుల్లో ఉన్నాయి. అలాంటి శాసనాలను హిందూ ఆలయాల్లో ఏర్పాటు చేస్తారని కూడా సర్వే తేల్చింది. ఈ శాసనాల మీద జనార్థన, రుద్ర, ఉమేశ్వర అనే దేవుళ్ల పేర్లు కూడా ఉన్నట్లు సమాచారం. ఆలయం గోడల మీద చిత్రించిన కమలం గుర్తులను తొలగించి ఆ గోడలను మసీదు నిర్మాణంలో ఉపయోగించిన ఆధారాలు కూడా ఉన్నాయని సర్వే రిపోర్ట్‌లో పేర్కొన్నారు.
17వ శతాబ్దంలో ఔరంగజేబు పాలన కాలంలో అక్కడున్న ఆలయాన్ని ధ్వంసం చేసి మసీదును నిర్మించి ఉంటారని రిపోర్ట్‌లో ఏఎస్‌ఐ పేర్కొంది. దేవతల విగ్రహాలు, శిల్పాలు భూమిలో కూరుకుపోయి కనిపించాయని, పశ్చిమం వైపున్న ఆవరణలో తోరణంతో కూడిన భారీ ప్రవేశద్వారం ఉందని వెల్లడించింది. పశ్చిమం వైపున్న గోడ పురాతన ఆలయానికి సంబంధించిందేనని కూడా ఏఎస్‌ఐ నిర్ధారించింది. కాగా, ఈ కేసుకు సంబంధించి జిల్లా కోర్టు మసీదు ప్రాంతంలో సర్వేకు 2023 జూలై 21న ఆదేశించింది. సర్వే అనంతరం ఆ రిపోర్ట్‌ను ఏఎస్‌ఐ డిసెంబరు 18న కోర్టుకు సమర్పించింది. ఈ సర్వే నివేదిక ప్రతిని తమకు అందజేయాలని హిందూ, ముస్లిం కక్షిదారులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దాంతో కోర్టు వారికి రిపోర్ట్ ప్రతులను అందజేయడంతో రిపోర్ట్‌లోని అంశాలు బయటికి వచ్చాయి. మరి జ్ఞానవాపి మసీదు కింద ఆలయ ఆనవాళ్లు లభించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Breaking 🚨
ASI Report says that a Mandir existed at Gyanvapi before the construction of the Masjid in Kashi Vishwanath.
Har Har Mahadev 🙏 pic.twitter.com/JYf2C0kvvs
— Shashank Shekhar Jha (@shashank_ssj) January 25, 2024