iDreamPost
android-app
ios-app

Ayodhya: అయోధ్య రామమందిర్ కేసు గెలిపించిన లాయర్ కథ! ఈయన దేవుళ్ళ లాయర్!

  • Published Jan 11, 2024 | 5:56 PM Updated Updated Jan 11, 2024 | 5:56 PM

ప్రస్తుతం దేశమంతటా వినిపిస్తున్న పేరు అయోధ్య. అయితే, ఇప్పుడు ఈ రామ మందిరాన్ని అంగరంగ వైభవంగా ముస్తాబు చేయడం వెనుక కొన్ని వేల మంది నిరంతరం సాగించిన పోరాట దీక్ష ఉంది. వారిలో ఒకరి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ప్రస్తుతం దేశమంతటా వినిపిస్తున్న పేరు అయోధ్య. అయితే, ఇప్పుడు ఈ రామ మందిరాన్ని అంగరంగ వైభవంగా ముస్తాబు చేయడం వెనుక కొన్ని వేల మంది నిరంతరం సాగించిన పోరాట దీక్ష ఉంది. వారిలో ఒకరి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

  • Published Jan 11, 2024 | 5:56 PMUpdated Jan 11, 2024 | 5:56 PM
Ayodhya: అయోధ్య రామమందిర్ కేసు గెలిపించిన లాయర్ కథ! ఈయన దేవుళ్ళ లాయర్!

రామ జన్మ భూమి అయోధ్యలో శ్రీరాముని మందిరాన్ని ప్రతిష్టించడం కోసం.. గత ఐదువందల సంవత్సరాలుగా ఎంతో మంది భక్తులు పోరాటం చేశారు. దీని వెనుక ఎన్నో యుద్ధాలు జరిగాయి. ఎంతో మంది త్యాగాలు చేశారు. ఈ పోరాటం జరిగిన సమయంలో కొన్ని వేల మంది పోలిసుల లాఠీ దెబ్బలను కూడా తిన్నారు. ఈ పోరాటాలు రామ మందిర నిర్మాణ విషయాన్నీ కోర్టు మెట్ల వరకు తీసుకెళ్లాయి. చివరికి కొన్ని వివాదాస్పదమైన వాదనల తర్వాత.. ఎట్టకేలకు సుప్రీం కోర్టు కొన్ని కోట్ల మంది భారతీయుల కల నెరవేర్చే దిశగా.. అయోధ్యలో రామ మందిరం నిర్మించడానికి తీర్పుని ఇచ్చింది. అయితే, కొన్ని సంవత్సరాలుగా సాగిన ఈ వివాదాన్ని.. చివరిగా కోర్టులో వాదించి గెలిపించిన వ్యక్తి లాయర్ పరాశరన్‌.

ఐదు శతాబ్దాల పోరాటాలకు.. కొన్ని వేల మంది ఆర్తనాదాలకు.. సుప్రీంకోర్టులో దాదాపు నలభై రోజులు సాగిన రామ జన్మ భూమి వివాదాలకు ముగింపు పలికిన వ్యక్తి పరాశరన్‌. ఈ కేసును చేపట్టిన సమయానికి ఆయన వయస్సు 92 సంవత్సరాలు. అయినా సరే అలుపెరగని కార్యదీక్షగా భావించి.. ఈ కేసును చేజారనివ్వకుండా పట్టుదలతో వాదించి గెలింపించారు. ఆ సమయంలో ఎంతో మంది న్యాయవాదులు ఈయనకు అండగా నిలిచారు. కుల మతాలకు అతీతంగా తన న్యాయవాద వృత్తికి పూర్తి న్యాయం చేసిన వ్యక్తి ఇతను. రామ మందిర నిర్మాణ విషయంలోనే కాకుండా.. గతంలోనూ శబరిమలలోకి మహిళల ప్రవేశానికి సుప్రీంకోర్టు అనుమతించినప్పుడు.. సుప్రీంకోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా పరాశరన్ వాదించారు. కొన్ని తరాల నుంచి వస్తున్న అయ్యప్ప స్వామి దేవాలయం పవిత్రతను కాపాడడం కోసం.. నిర్దిష్ట వయస్సు గల స్త్రీలు ఆలయంలోకి ప్రవేశించడానికి వీలు లేదని ఆయన పేర్కొన్నారు. అలానే, సుప్రీం కోర్టు కూడా వీరి నిర్ణయాలతో ఏకీభవించింది. ఇలా.. దేవుళ్ళ తరపున వాదించి దేవుళ్ళకే న్యాయం చేకూరుస్తున్న వ్యక్తిగా నిలిచిపోయారు లాయర్ పరాశరన్‌.

The story of the lawyer who won the Ayodhya Ram Mandir case

అంతే కాకుండా ఆయన తన కెరీర్ లోను అద్భుతంగా రాణించారు. 1976 తమిళనాడు అడ్వకేట్ జనరల్ గా పని చేశారు. ఆ తర్వాత 1983 నుండి 1989 వరకు అటార్నీ జనరల్‌గా పనిచేశారు. అదే క్రమంలో 2003లో వాజ్‌పేయి నుంచి పద్మభూషణ్, 2011లో మన్మోహన్ సింగ్ నుంచి పద్మవిభూషణ్ అవార్డులు అందుకున్నారు. ఇలా పరాశరన్‌ వృత్తిపరంగా ఎన్నో ఉన్నత స్థాయి అధికార బాధ్యతలను చేపట్టారు. ఇక ఇప్పుడు ఈయన వయస్సు 97 సంవత్సరాలు. ప్రస్తుతం రామ జన్మ భూమి ట్రస్ట్ సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. ఏదేమైనా కొన్ని లక్షల మంది కల నెరవేర్చిన వ్యక్తిగా అయోధ్య రామ మందిర పోరాట చరిత్రలో.. లాయర్ పరాశరన్‌ పేరు ఎప్పటికి నిలిచిపోతుంది. మరి, ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.