iDreamPost
android-app
ios-app

వంట చేయబోయిన గ్రేట్‌ ఖలీ.. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డంతో..

  • Published Sep 28, 2023 | 3:00 PM Updated Updated Sep 28, 2023 | 3:00 PM
  • Published Sep 28, 2023 | 3:00 PMUpdated Sep 28, 2023 | 3:00 PM
వంట చేయబోయిన గ్రేట్‌ ఖలీ.. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డంతో..

ది గ్రేట్‌ ఖలీ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్‌గా ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. పంజాబ్‌కు చెందిన ఆయన 2000 సంవత్సరంలో రెస్లింగ్‌ కెరీర్‌ను మొదలుపెట్టారు. 2015లో పంజాబ్‌లో సొంత రెస్లింగ్‌ స్కూలు ఏర్పాటు చేశారు. తర్వాతినుంచి డబ్ల్యూడబ్ల్యూఈ కార్యక్రమాల్లో పాల్గొనటం తగ్గించారు. కేవలం రెస్లర్‌గానే కాదు.. నటుడిగా కూడా ఖలీ తన సత్తా చాటారు. హిందీ, ఇంగ్లీష్‌ సినిమాల్లో నటించారు. ప్రస్తుతం రెస్లింగ్‌ స్కూలు బాధ్యతలతో బిజీగా ఉన్నారు.

ఆయనకు పంజాబ్‌లో ఓ ఢాబా కూడా ఉంది. ఖలీ అప్పుడప్పుడు ఆ ఢాబాకు వెళుతూ ఉంటారు. తాజాగా, ఆ ఢాబాకు వెళ్లిన ఖలీ వంట చేసే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం విఫలం అవ్వటంతో ఆయన చెయ్యి కాలింది. ఇందుకు సంబంధించిన వీడియోను స్వయంగా ఆయనే తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేశారు. ‘‘ ది గ్రేట్‌ ఖలీ ఢాబా. ది గ్రేట్‌ ఖలీ వంట వండుతున్నారు. ఇలాంటి ఇంట్లో ప్రయత్నించకండి. ఇలా చేయాలంటే చాలా అనుభవం కలిగి ఉండాలి’’ అని రాసుకొచ్చారు.

ఆ వీడియోలో.. ఖలీ వంట చేయడానికి ఢాబాలోకి వచ్చాడు. వంట గదిలోకి రాగానే ఓ పెద్ద చెంచా పట్టుకుని స్టవ్‌ దగ్గరకు వచ్చాడు. స్టవ్‌ మీద ఉన్న పెనంను ఎడమ చేత్తో పట్టుకుని కుడి చేతిలోని చెంచాతో రుద్ద సాగాడు. దీంతో ఒక్కసారిగా దానిపై మంటలు చెలరేగాయి. పెనంను పక్కకు తీసుకువచ్చినా ఆ మంటలు ఆగలేదు. భారీ ఎత్తున ఎగసిపడ్డాయి. ఈ నేపథ్యంలోనే ఖలీ చెయ్యి కాలింది. దీంతో ఆయన పెనాన్ని కిందపడేశారు. చెయ్యి కాలటంతో ఆయన విలవిల్లాడారు. మరి, వంట చేయబోయి చెయ్యి కాల్చుకున్న ఖలీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by The Great Khali (@thegreatkhali)

Jojobet GirişJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabetcasibomcasibom