iDreamPost
android-app
ios-app

కుక్కకు ఉద్యోగం కల్పించిన ఓలా ఎలక్ట్రిక్ వ్యవస్థాపకుడు

కుక్కకు ఉద్యోగం కల్పించిన ఓలా ఎలక్ట్రిక్ వ్యవస్థాపకుడు

కుక్కకు ఉద్యోగం. కుక్కకు ఉద్యోగం ఏంటని తీవ్రంగా ఆలోచిస్తున్నారా? ఆ మూగ జంతువుకు ఉద్యోగం కల్పించింది ఓ ఇంటి యజమాని కాదు.. ఓ బడా కంపెనీ ఓనర్. అవును, మీరు చదువుతున్నది నిజమే. మీకేమైనా మైండ్ లు దొబ్బాయా? కుక్కలకు ఉద్యోగం కల్పించడమేంటని మమ్మల్ని మీరు తిట్టుకోచ్చు కానీ, ఇది వాస్తవం. దేశంలోని ఓ ప్రముఖ కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో ఈ కుక్కకు తన సంస్థలో ఉద్యోగాన్ని కల్పించడమే కాకుండా దానికి ఐడీ కార్డు కేటాయించి అందులో దాని పూర్తి వివరాలు పొందుపరిచారు. ఇంతకు స్టోరీ ఏంటనేది తెలుసుకోవాలనుందా?

ఓలా ఎలక్ట్రిక్ వ్యవస్థాపకుడు, సీఈవో భవిష్ అగర్వాల్ కుక్కలపై తనకున్న ప్రేమను చాటుకునే ప్రయత్నం చేశారు. ఎవరూ ఊహించని రీతిలో తన సంస్థలో బిజిలీ అనే కుక్కుకు ఉద్యోగం కల్పించారు. అంతే కాదండోయ్.. ఆ కుక్కకు ఐడీ కార్డు కేటాయించి అందులో ఆ కుక్క ఎంప్లాయి కోడ్, బ్లడ్ గ్రూప్, ఆఫీస్ అడ్రస్ ఇలా పూర్తి వివరాలు పొందుపరిచారు. అయితే ఇదే విషయాన్ని ఆ కంపెనీ సీఈవో భవిష్ అగర్వాల్ తన వ్యక్తిగత ట్విట్టర్ వేదికగా ఆ కుక్క ఐడీ కార్డును ఫొటో తీసి అందులో పోస్ట్ చేశారు. దీంతో ఇదే ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది. ఓలా ఎలక్ట్రిక్ సీఈవో భవిష్ అగర్వాల్ చేసిన పనికి నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. కుక్కకు ఉద్యోగం కల్పించిన ఆ కంపెనీ సీఈవో తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: సాయిబాబా దేవుడు కాదు.. ఆయన ఫొటోలు పారేయాలి: శంభాజీ భిడే