Ayodhya: రామ మందిరంపై ఎగిరే జెండా.. చిహ్నంగా సూర్యుడు, కాంచన చెట్టు!

అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చకా చకా సాగిపోతున్నాయి. ఈ క్రమంలో రామ మందిరం పైన ఎగరనున్నా జెండాపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చకా చకా సాగిపోతున్నాయి. ఈ క్రమంలో రామ మందిరం పైన ఎగరనున్నా జెండాపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

ఇప్పుడు అయోధ్య రామ మందిరానికి సంబంధిచిన ప్రతి వార్త ప్రత్యేకమే. ఎందుకంటే ఇది కొన్ని లక్షల మంది హిందువుల కోరిక. కొన్ని వందల సంవత్సరాల కల. ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఈ అయోధ్య రామ మందిరం. చూడబోతుంటే కొన్ని వేల యుగాల నాటి రామయ్య వైభోగం.. జనవరి 22వ తేదీన మరలా అట్టహాసంగా ఉట్టిపడేలా ఉంది. భారత దేశ చరిత్రలో అయోధ్య రామ మందిర నిర్మాణ ఘట్టం అత్యంత ప్రత్యేకంగా నిలిచిపోతుంది. ఇప్పటికే ఆలయ ప్రారంభోత్సవానికి సంబంధించి అన్ని పనులు దాదాపుగా పూర్తి అయిపోయాయి. ఈ క్రమంలో రామ మందిరం మీద ఎగరునున్న జెండా విషయమై కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ జెండా రూపకల్పనను మార్చినట్టుగా తెలుస్తోంది.

రామ మందిరం పైన ఎగరనున్న జెండా మధ్యప్రదేశ్‌ రేవాలోని.. హర్దువా గ్రామానికి చెందిన లలిత్ మిశ్రా సిద్ధం చేస్తున్నారు. ఇటీవలే తానూ సిద్ధం చేసిన ఓ జెండా నమూనాను.. రామ జన్మభూమి తీర్థం ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్‌కి అందచేశారు. అయితే, ఐదుగురు కమిటీ సభ్యులు ఈ జెండాను పరిశీలించి.. కొన్ని మార్పులు చేయాలనీ సూచించారు. దానికి తగినట్టుగానే కొత్త డిజైన్ ను మరలా కమిటీ సభ్యులకు అందించనున్నారు. ఆ తర్వాత జెండా పొడవు, వెడల్పు నిర్ణయించనున్నారు. అయితే, కొత్తగా డిజైన్ చేయనున్న జెండా పైనా ఉదయిస్తున్న సూర్యుడు, లోపల జై శ్రీ రామ్ నినాదం, కోవిదర్ చెట్టు (దేవ కాంచన చెట్టు) చిహ్నాన్ని ముద్రించనున్నారు. ప్రత్యేకంగా వీటిని జెండాపై ముద్రించడం వెనుక ఓ చిన్న కథ దాగి ఉంది.

శ్రీ రాముడు సూర్య వంశానికి చెందిన వాడు. అయితే సూర్య వంశ చిహ్నం సూర్యుడు కాబట్టి జెండాపై ముద్రించనున్నారు. దీనితో పాటు దేవ కాంచన చెట్టు.. ఇది అయోధ్యపు రాజ వృక్షంగా భావిస్తారట. ప్రస్తుతం జాతీయ వృక్షంగా మర్రి చెట్టును ఎలా అయితే పిలుచుకుంటున్నామో.. అలాగే ఒకప్పుడు ఈ దేవ కాంచన చెట్టును రాజ వృక్షంగా పిలిచేవారట. కాల క్రమేణా ఈ వృక్షాలు కనుమరుగైపోయాయి. కానీ, పురాణాల్లో దేవకాంచన వృక్షాలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. అందుకే ఇప్పుడు అయోధ్య రామ మందిరంపై గౌరవంగా ఎగరబోనున్న జెండా పైన ఈ వృక్షపు చిహ్నాన్ని కూడా ముద్రించనున్నారు.

పురాణాల ప్రకారం దేవకాంచన చెట్టును ఋషి కశ్యపుడు సృష్టించినట్టు పేర్కొన్నారు. దీని ప్రస్తావన హరివంశ పురాణంలో కూడా ఉంది. ఈ పురాణాన్ని ఆధారంగా తీసుకుని దేవ కాంచన చెట్టుని.. ఆ కాలంలో అయోధ్య రాజ జెండాలో చిత్రీకరించారు. అంతేకాకుండా వాల్మీకి మహర్షి రాసిన రామాయణంలోను ఈ చెట్టు ప్రస్తావన తీసుకుని వచ్చారు. రామాయణంలో శ్రీరాముడిని తిరిగి అయోధ్యకు రమ్మని.. అభ్యర్ధించేందుకు భరతుడు రథం పై వెళ్ళినపుడు.. ఆ రథంపైన ఈ జెండా ఉందట. ఆ సమయంలో రామయ్యతో పాటు అరణ్యవాసంలో ఉన్న లక్ష్మణుడు.. వారి వైపుగా వస్తున్నది అయోధ్య సైన్యమే అని రథంపై ఎగురుతున్న జెండాను చూసి గుర్తించినట్లు.. పురాణాల్లో పేర్కొన్నారు. ఏదేమైనా రామ మందిరం శిఖరంపై అలంకరించనున్న ఈ జెండాపై చాలా ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. జనవరి 22న జరగబోయే కార్యక్రమానికి సుమారు వంద జెండాలను.. మధ్యప్రదేశ్ లోని రేవా నుంచి పంపుతున్నట్లుగా సమాచారం. మరి, ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments