P Krishna
Upasana Starts Apollo Service: ఇటీవల అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట పీఎం మోదీ చేతుల మీదుగా అంగరంగ వైభవంగా జరిగింది. అయోధ్య రామ మందిరాన్ని మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన సందర్శించకున్నారు. ఈ సందర్భంగా ఆమె ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు.
Upasana Starts Apollo Service: ఇటీవల అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట పీఎం మోదీ చేతుల మీదుగా అంగరంగ వైభవంగా జరిగింది. అయోధ్య రామ మందిరాన్ని మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన సందర్శించకున్నారు. ఈ సందర్భంగా ఆమె ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు.
P Krishna
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం అయోధ్యలో రామ మందిరం నిర్మాణం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విషయం తెలిసిందే. జనవరి 22 న ప్రధాని నరేంద్ర మోదీ చేతులు మీదుగా బాల రాముడి ప్రాణ ప్రతిష్ట జరింది. ఇక్కడికి నిత్యం వెల సంఖ్యల్లో భక్తులు బాల రాముడిని దర్శనం కోసం విచ్చేస్తున్నారు. అయోధ్య లో నూతనంగా నిర్మించిన రామ మందిరాన్ని టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ సతీమణి, మెగా కోడలు ఉపాసన సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె బాల రాముడికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో 48 రోజులు పాటు నిర్వహించిన రామ్ రాగ్ సేవ మార్చి 10తో ముగిసింది. ఈ కార్యక్రమ వేడుకలో ఉపాసన తమ కుటుంబ సభ్యులతో కలిసి అయోధ్య వెళ్లి స్వామి వారి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపాసన కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..
అయోధ్యలో రామ మందిరాన్ని మెగా కోడలు ఉపాసన సందర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె బాల రాముడికి ప్రత్యేక పూజలు చేశారు. మెగా కోడలిగానే కాదు.. ఒక బిజినస్ ఉమెన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. మెగా ఫ్యామిలీ కోడలిగా.. రామ్ చరణ్ సతీమణిగా.. బిడ్డకు తల్లిగా, ఓ బిజినెస్ ఉమెన్ గా తనదైన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. బిజినెస్ ఉమెన్ గా సక్సెస్ ఫుల్ గా సాగుతూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇటీవల తన అత్తమ్మ సురేఖతో ఫుడ్ బిజినెస్ మొదలు పెట్టారు. తాజాగా ఉపాసన మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయోధ్యలో బాల రాముడిని దర్శించుకోవడమే కాదు.. అక్కడ అపోలో హాస్పిటల్ సేవలు ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
ఈ సందర్భంగా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ కలుసుకొని యూపీలో అపోలో సర్వీస్ లాంచ్ గురించి తెలియజేసినట్లు సమాచారం. తన తాత ప్రతాప్ రెడ్డి గొప్పతనాన్ని తెలియజేసే ‘ ది అపోలో స్టోరీ’ బుక్ ని సీఎం యోగి ఆదిత్యనాథ్ కి అందజేశారు. ఈ సందర్భంగా ఉపాసన మాట్లాడుతూ.. రామ మందిరాన్ని సందర్శించుకొని పూజలు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఉపాసన త్వరలో అయోధ్యలో అపోలో సేవలు ప్రారంభించబోతున్నట్లు వార్తలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఉపాసనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.