Arjun Suravaram
Bride And Bride Groom Jump: నేటికాలంలో కొన్ని పెళ్లిళ్లు విచిత్రమైన కారణాలతో ఆగిపోతుంటాయి. మరీ ముఖ్యంగా ప్రేమ వ్యవహారాల కారణంగా తాళి కట్టే సమయంలో వధువు లేచిపోవడంతో పెళ్లిళ్లు ఆగిపోతుంటాయి. అయితే ఓ చోట మాత్రం పెళ్లికొడుకే పెళ్లికూతుర్ని లేపుకునిపోయాడు.
Bride And Bride Groom Jump: నేటికాలంలో కొన్ని పెళ్లిళ్లు విచిత్రమైన కారణాలతో ఆగిపోతుంటాయి. మరీ ముఖ్యంగా ప్రేమ వ్యవహారాల కారణంగా తాళి కట్టే సమయంలో వధువు లేచిపోవడంతో పెళ్లిళ్లు ఆగిపోతుంటాయి. అయితే ఓ చోట మాత్రం పెళ్లికొడుకే పెళ్లికూతుర్ని లేపుకునిపోయాడు.
Arjun Suravaram
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే మధురమైన వేడుక. అందుకే ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా జరుపుకోవాలని యువత భావిస్తుంది. ఇలా ఎంతో మంది యువత తమ కలల సౌదాన్ని నిజం చేసుకుంటారు. కొన్ని సార్లు మాత్రం పెళ్లి మండపాల్లో ట్విస్టులు చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా కట్నం, ప్రేమ వ్యవహారాల, బంధువుల గొడవల కారణంగా పెళ్లిళ్లు ఆగిపోతుంటాయి. తాళి కట్టే సమయంలో వధువు లేదా వరుడు వేరే వారితో పారిపోవడం వంటివి కూడా జరుగుతుంటాయి. అయితే తాజాగా యూపీలో ఓ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. పెళ్లి కొడుకే పెళ్లి కూతురితో పారిపోయాడు. మరి..అలా ఎందుకు చేశాడు?. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం వారణాసి ప్రాంతంలోని ఓ యువతి యువకుడికి పెద్దలు పెళ్లి నిశ్చయించారు. చాలా కాలం క్రితం వారిద్దరికి వివాహం నిశ్చయం కావడంతో ఫోన్ లో సంభాషణలు ప్రారంభించారు. అలానే దాదాపు మూడు నెలల పాటు వారిద్దరు ఫోన్ లో మాట్లాడుకుంటూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. పెద్దలు కుదిర్చిన ఈ జంట..ప్రేమ జంటగా మారింది. ఇదే సమయంలో వారిద్దరి వివాహం జరిగే మధురమైన ఘటం రానే వచ్చింది. ఆ కాబోయే వధువరుల ఆనందానికి అవధులు లేవు. ఇక పెళ్లి ఏర్పాట్లు ఘనంగా జరిగాయి. ఇరువైపు బంధువులు, మిత్రులు పెద్ద సంఖ్యలో పెళ్లికి హాజరయ్యారు.
మరికొద్ది సేపట్లో వివాహం జరగాల్సి ఉంది. వధువరులు పెళ్లి పీటలపై కూర్చుకున్నారు. ఇంతలోనే ఆపండి అంటూ మండపంలో నుంచి ఓ పెద్ద అరుపు వచ్చింది. తీరా చూస్తే.. వధువు కుటుంబ సభ్యులు అనుకున్న కట్నం పెళ్లి నాటికి అందించలేకపోయారు. కాసేపట్లో ఇస్తామంటూ పెళ్లి మూహుర్తం వరకు తీసుకొచ్చారంట. అప్పటికి మాట్లాడుకున్న కట్నం ఇవ్వకపోవడంతో వరుడి కుటుంబ సభ్యులు వారితో వాగ్వాదం పెట్టుకున్నారు. చివరకు ఈ పెళ్లి జరగదంటూ తేల్చి చెప్పారు. అయితే ఆ నూతన జంట ఎంతో గాఢంగా ప్రేమించుకున్నారు. తమకు పెళ్లి జరగదనే ఊహనే ఆ కాబోయే వధువరులు ఊహించుకోలేక పోయారు. వెంటనే అక్కడ ఉంటే తమ పెళ్లి జరగదని వారు భావించారు. వెంటనే వరుడు తన స్నేహితుడి ఎక్స్ ఎల్ బండిని తీసుకుని వధువుతో పారిపోయాడు.
అలా వారిద్దరు అదే పట్టణంలో ఉన్న ఓ ఆలయంలోకి వెళ్లి..దండలు మార్చుకుని వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లి దుస్తుల్లో పారిపోతున్న వధువరులను.. వారి స్నేహితుడు వీడియో తీశాడు. అంతేకాక ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడం తో తెగ వైరల్ అవుతోంది. పెళ్లి కొడుకు చేసిన ఈ పనికి పలువురు ప్రశంసించారు. కట్నం కోసం పెళ్లిళ్లు ఆపేసే యువకులు ఉన్నఈ కాలంలో ప్రేమించిన అమ్మాయి కోసం పెద్దలను ఎదిరించడం మంచి విషయం అంటూ అభినందిస్తున్నారు. మరి..ప్రేమించిన అమ్మాయి కోసం ఏకంగా పెద్దలను ఎదిరించిన ఈ వరుడిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.