Swetha
అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవాన్ని చూడడానికి కొన్ని కోట్ల మంది ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు కొన్ని వేల మంది చిరు వ్యాపారస్తులు కూడా లాభపడనున్నారు.
అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవాన్ని చూడడానికి కొన్ని కోట్ల మంది ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు కొన్ని వేల మంది చిరు వ్యాపారస్తులు కూడా లాభపడనున్నారు.
Swetha
జనవరి 22వ తేదీ భారత దేశ చరిత్రలో అతి ముఖ్యమైన రోజుగా నిలవనుంది. రామ జన్మ భూమి అయోధ్యలో శ్రీ రాముని ప్రాణ ప్రతిష్ట అంగరంగ వైభవంగా జరిపించడానికి అన్ని సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే దానికి సంబంధించిన పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. రానున్న రోజుల్లో ఈ దేవాలయం ఓ మహా పుణ్య క్షేత్రంగా మారుతుందని చెప్పడంలో.. ఎటువంటి సందేహం లేదు. అయితే, కేవలం ఆలయంలో కొలువ తీరబోతున్న శ్రీరాముడు తన భక్తులకు.. వరాలు ఇవ్వడం మాత్రమే కాకుండా.. కొన్ని వేల మందికి ఉపాధి కూడా కల్పించనున్నాడు. సాధారణంగానే ఆలయాల బయట ఎంతో మంది దుకాణ దారులు.. వారి జీవనోపాధిని కొనసాగిస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు రామయ్య దయ వలన మరెంతో మంది.. అయోధ్యలో తమ ఉపాధిని ప్రారంభించబోతున్నారు.
అయోధ్యలో రామ మందిరం కేవలం భక్తి, ఆధ్యాత్మికం పరంగా మాత్రమే కాకుండా.. భారతదేశం అంతటా దాదాపుగా రూ.50,000 కోట్ల వ్యాపారం జరగబోతుందని.. అది దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతో సహకరించబోతుందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) అంచనా వేస్తోంది. సాధారణంగానే చిన్న చిన్న ఆలయాల బయట ఎంతో మంది.. అనేక రకాల దుకాణాలను పెట్టుకుని తమ వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం కోసం.. దేశ ప్రజలు ఎంతో ఆతృతగా, ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో చిరు వ్యాపారస్తులు తమ దుకాణాలను అయోధ్యలో ప్రారంభించేందుకు.. ఇప్పటికే సిద్ధంగా ఉన్నారు. అక్కడ డిమాండ్ కు తగినట్టుగా వస్తువులను విక్రయించడానికి.. అన్ని రాష్ట్రాల్లోని సభ్య వ్యాపారులు తగిన నిర్ణయాలు తీసుకున్నారని.. సీఏఐటీ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ పేర్కొన్నట్లుగా ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ నివేదించింది.అయితే , ఈ దుకాణాలలో ఎక్కువగా విక్రయిచ్చేందుకు.. ప్రత్యేకమైన కండువాలు, లాకెట్లు, కీ చైన్లు, రామ మందిర నమూనాలు, రామ్ దర్బార్, రామధ్వజ చిత్రాలు మొదలైనవి తయారు చేసినట్లుగా .. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ సమాచారం అందించారు. ప్రస్తుతం ఈ వస్తువులకు దేశమంతటా ఎక్కువ డిమాండ్ ఉందని పేర్కొన్నారు.
ఇక అయోధ్య రామ మందిర విషయానికొస్తే.. ఇప్పటికే దేశ నలుమూలల నుంచి ఎంతో మంది భక్తి శ్రద్దలతో.. ఆ రాముల వారికీ.. ఎవరికీ తోచిన విధంగా వారు కానుకలను సమర్పించుకున్నారు. సీతమ్మ వారి పుట్టింటి నుంచి కొన్ని వేలకు పైగా కానుకలు అయోధ్య రామ మందిరానికి చేరుకున్నాయి. ఈ మహత్తర కార్యాక్రమం ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరగనుంది. ఈరోజు కోసం కొన్ని కోట్ల మంది ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏదేమైనా.. ఆ రాముల వారు కరుణా కటాక్షాలు ఇప్పుడు కొన్ని వేల మందికి జీవనోపాధిని కలిగిస్తున్నాయి. మరి, ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.