P Krishna
Tejas Fighter Jet Crashed: ఈ మధ్య దేశంలో తరుచూ విమాన ప్రమాదాల జరుగుతున్నాయి. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే సాంకేతిక లోపాలు.. ఇతర కారణాల వల్ల ప్రమాదాల భారిన పడుతున్నాయి.
Tejas Fighter Jet Crashed: ఈ మధ్య దేశంలో తరుచూ విమాన ప్రమాదాల జరుగుతున్నాయి. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే సాంకేతిక లోపాలు.. ఇతర కారణాల వల్ల ప్రమాదాల భారిన పడుతున్నాయి.
P Krishna
ఇటీవల విమాన ప్రమాదాల సంఖ్య ఎక్కువ అయ్యాయి. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే సాంకేతిక లోపాలు, ఇంజన్ లో మంటలు, వాతావరణంలో హఠాత్తుగా మార్పులు సంభవించడం ఇలా ఎన్నో కారణాల వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని విమాన శాఖ అధికారలు అంటున్నారు. అయితే ముందుగానే ప్రమాదాన్ని గుర్తించి పైలెట్లు ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తూ ప్రయాణికుల ప్రాణాలు రక్షిస్తున్నారు. అప్పుడప్పుడు ల్యాండిగ్ చేసే సమయంలో కూడా ప్రమాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా రాజస్థాన్ లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన తేజస్ ఎయిర్ క్రాప్ట్ కుప్పకూలింది. వివరాల్లోకి వెళితే..
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన తెజస్ ఫైటర్ జెట్ రాజస్థాన్ లోని జైసల్మేర్ లో కుప్పకూలిపోయింది. ఓ హాస్టల్ భవనం వద్ద ఈ విమాన శకలాలు కింద పడిపోయాయి. శిక్షణ సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. విమాన ప్రమాద సమయంలో పెద్ద శబ్ధం వినిపించినట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో ఒక్కసారిగా భయపడిపోయామని అంటున్నారు. ఆ ప్రదేశంలో భారీ స్థాయిలో మంటలు, దట్టమైన పొగ వ్యాపించాయి. ప్రమాదం జరిగిన చోట పెద్ద ఎత్తున జనాలు గుమి కూడారు. ఎయిర్ క్రాప్ట్ ప్రమాదంలో పైలెట్ సురక్షితంగా బయటప్డారు. ఈ విషయాన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ట్విట్టర్ లో పేర్కొంది.
ఈ విషయంపై స్పందించిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ .. ‘ఒక తేజస్ విమానం జైసల్మేర్ వద్ద ఈ రోజు శిక్షణ సమయంలో ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో పైలట్ సురక్షితంగా బయటపడ్డారు.. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలుసుకోవడానికి కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీకి ఆదేశాలు పంపించాం’ అని వెల్లడించింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తేజస్ రూపొందించారు. 2001 నుంచి తేజస్ ఎయిర్ క్రాప్ట్ సేవలు ప్రారంభమయ్యాయి.. ఇలాంటి ప్రమాదం జరగడం ఇదే తొలిసారి అని అధికారులు తెలిపారు. ఫోక్రాన్ ఫైరింగ్ రేంజ్ లో ‘భారత్ శక్తి’ పేరిట సైనిక విన్యాసాలు జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.
#WATCH | Rajasthan | A Light Combat Aircraft (LCA) Tejas of the Indian Air Force crashed near Jaisalmer today during an operational training sortie. The pilot ejected safely. A Court of Inquiry has been ordered to ascertain the cause of the accident. pic.twitter.com/3JZf15Q8eZ
— ANI (@ANI) March 12, 2024