iDreamPost
android-app
ios-app

NEET Exam: రూ.10 లక్షలు ఇవ్వండి..పేపర్ రాసిపెడతా.. NEET పరీక్షలో ఓ టీచర్ నిర్వాకం.!

ఈ మధ్యకాలంలో అవినీతి, అక్రమ పనులు బాగా పెరిగి పోయాయి. ఫలాన రంగం అంటూ లేకుండా.. అన్ని వ్యవస్థలో కొందరు అవినీతి, అక్రమ మార్గాలను ఎంచుకుని డబ్బులు సంపాదిస్తున్నారు. తాాజాగా ఓ టీచర్ కాసులకు కక్కుర్తి పడి దారుణమైన పని చేసింది.

ఈ మధ్యకాలంలో అవినీతి, అక్రమ పనులు బాగా పెరిగి పోయాయి. ఫలాన రంగం అంటూ లేకుండా.. అన్ని వ్యవస్థలో కొందరు అవినీతి, అక్రమ మార్గాలను ఎంచుకుని డబ్బులు సంపాదిస్తున్నారు. తాాజాగా ఓ టీచర్ కాసులకు కక్కుర్తి పడి దారుణమైన పని చేసింది.

NEET Exam: రూ.10 లక్షలు ఇవ్వండి..పేపర్ రాసిపెడతా.. NEET పరీక్షలో ఓ టీచర్ నిర్వాకం.!

నేటి సమాజంలో అవినీతి, అక్రమ పనులు బాగా పెరిగి పోయాయి. ఫలాన రంగం అంటూ లేకుండా.. అన్ని వ్యవస్థలో కొందరు అవినీతి, అక్రమ మార్గాలను ఎంచుకుని డబ్బులు సంపాదిస్తున్నారు. ఈ క్రమంలో విద్యా వ్యవస్థ, ఉద్యోగాల ఎంపిక విషయంలో కొందరు చేసే నిర్వాకం వలన కష్టపడి చదివే వారికి అన్యాయం జరుగుతోంది. తాజాగా డబ్బుల కోసం కక్కుర్తి పడిన ఓ టీచర్ దారుణానికి ఒడిగట్టింది. రూ.10 లక్షలు ఇస్తే పరీక్ష రాసిపెడతామంటూ కొందరి విద్యార్థులకు ఆఫర్ ఇచ్చారు. చివరు ఆ టీచర్ నిర్వాకం తెలుసుకున్న చర్యలు దిగారు. ఈఘటన గుజరాత్ లో చోటుచేసుకుంది పూర్త వివరాల్లోకి వెళ్తే..

మే 6వ తేదీన దేశ వ్యాప్తంగా నీట్ యూజీ పరీక్ష జరిగింది. వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశం కోసం నీట్  పరీక్ష నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలోనే గత ఆదివారం గుజరాత్ రాష్ట్రంలోని పంచమహల్ జిల్లాలో గోద్రా స్కూల్‌లో నీట్‌ ప్రవేశ పరీక్ష జరిగింది. ఇందులో కొందరు మోసాలకు పాల్పడుతున్నారని జిల్లా కలెక్టర్‌కు సమాచారం అందింది. పక్కా సమాచారంతో అడిషనల్ కలెక్టర్, ఇతర విద్యా అధికారుల బృందం వెంటనే ఆ స్కూల్  కి చేరుకుంది. అక్కడి సిబ్బంది తేరుకునే లోపే అధికారుల బృందం ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఈ క్రమంలోనే తుషార్ భట్ అనే  టీచర్‌ నిర్వాకం బయటపడింది. ఆయన గోద్రా స్కూల్ ఫిజిక్స్ టీచర్ గా  పని చేస్తున్నారు. అలానే ఆయన ఆదివారం జరిగిన నీట్‌ పరీక్షకు డిప్యూటీ సూపరింటెండెంట్‌గా వ్యవహరించారు. ఈ పరీక్షల్లో మంచి ర్యాంకు కోసం మెరిట్ కోసం 6 మంది అభ్యర్థులతో ఆయన ఒప్పందం చేసుకున్నాడు.

ఆ ఒప్పందం ప్రకారం.. సదరు విద్యార్థులు వచ్చిన సమాధానాలు రాసి.. రాని వాటిని ఖాళీగా వదిలేసి వెళ్లాలని వారికి చెప్పాడు. పరీక్ష పూర్తైన తర్వాత పేపర్లు తానే తీసుకుని జవాబులు నింపుతానని వారికి హామీ ఇచ్చాడు. అందుకు ప్రతిఫలంగా ఒక్కొక్క విద్యార్థి నుంచి రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. అతడి మాట ప్రకారం ఓ అభ్యర్థి ముందుగానే రూ.7లక్షలు అడ్వాన్స్‌గా ఇచ్చాడు. ఈ విషయాలన్ని ..విద్యాశాఖ అధికారులు తుషార్ భట్ ను ప్రశ్నించిన సమయంలో వెలుగులోకి వచ్చాయి. అతడి ఫోన్ లో నుంచి ఆ 6 మంది అభ్యర్థుల పేర్లు, రోల్‌ నంబర్లను అధికారులు గుర్తించారు. నిందితుడి కారు నుంచి అభ్యర్థుల దగ్గర నుంచి ముందుగా తీసుకున్న డబ్బును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘరాన మోసానికి పాల్పడిన తుషార్‌, అతడికి సాయం చేసిన మరో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

దీనిపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన బయటకు రావడంతో పలువురు అభ్యర్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఎవరికీ ఎలాంటి నష్టం జరగదని అధికారులు హామీ ఇచ్చారు. గతంలో కూడా పశ్చిమ్ బెంగాల్ లో కూడా ఉపాధ్యాయు పోస్టులను కూడా అమ్ముకున్నారు. అలానే వివిధ పరీక్ష పత్రాలను కూడా లీక్ చేసిన ఘటనలు ఉన్నాయి. ఇలా కొందరు అవినీతి పరులు వ్యవస్థలను నాశనం చేయడంతో పాటు కష్టపడి చదివేవారికి అన్యాయం చేస్తున్నారు. ఇలాంటి అవినీతి పనులకు పాల్పడే వారికి ఎలాంటి శిక్ష విధించాలి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.