iDreamPost
android-app
ios-app

మహిళా పోలీసులకు గుడ్ న్యూస్.. ఇకపై ఏడాది ప్రసూతి సెలవులు!

Tamil Nadu Women Cops: దేశ రక్షణలో పోలీసులది ప్రత్యేకమైన పాత్ర. ఇక వీరిలో ఎంతో మంది మహిళా పోలీసులు కూడా విధులు నిర్వహిస్తుంటారు. ఇలాంటి మహిళా పోలీసులుకు ఓ శుభవార్త వచ్చింది.

Tamil Nadu Women Cops: దేశ రక్షణలో పోలీసులది ప్రత్యేకమైన పాత్ర. ఇక వీరిలో ఎంతో మంది మహిళా పోలీసులు కూడా విధులు నిర్వహిస్తుంటారు. ఇలాంటి మహిళా పోలీసులుకు ఓ శుభవార్త వచ్చింది.

మహిళా పోలీసులకు గుడ్ న్యూస్.. ఇకపై ఏడాది ప్రసూతి సెలవులు!

సమాజ రక్షణలో పోలీసు వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా న్యాయం కోసం వచ్చిన బాధితుల సమస్యలను పరిష్కరిస్తూ..సమాజంలో జరిగే నేరాలను అరికట్టడంలో పోలీసులు కీలకంగా వ్యవహరిస్తుంటారు. వారికి విధుల విషయంలో చాలా ఒత్తిడి ఉంటుందని పలువురు అభిప్రాయపడుతుంటారు. వారు నిరంతరం విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఇక వారికి సెలవులు కూడా చాలా తక్కువగానే ఉంటాయి. ఇక సెలవులకు సంబంధించి…పోలీసుల సంఘాలు ప్రభుత్వాలకు విజ్ఞప్తులు చేస్తుంటాయి. ఈ క్రమంలోనే తాజాగా మహిళా పోలీసులకు తమిళనాడు  రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది.

పోలీస్ ఉద్యోగం చేసే మహిళలకు.. ప్రసూతి సెలవులను భారీగా పెంచాలని తమిళనాడు సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది.  ప్రస్తుతం ఆ రాష్ట్రంలో మహిళ ఉద్యోగులకు 9 నెలల ప్రసూతి సెలవులను ఇస్తున్నారు. అయితే ఆ తొమ్మిది నెలల ప్రసూతి సెలవులను ఏడాదికి పెంచుతూ సీఎం ఎంకే స్టాలిన్ తాజాగా ఉత్తర్వులు వెలువరించారు. వీటితోపాటు డెలివరీ అయిన తర్వాత మరిన్ని సదుపాయాలు, సౌకర్యాలు కల్పించనున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. తమిళనాడు సర్కార్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయంతో మహిళ పోలీస్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

శుక్రవారం తమిళనాడు రాజధాని చెన్నైలోని రాజరథినం స్టేడియంలో ఓ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా విధుల్లో ప్రతిభ కనబర్చిన పోలీసు అధికారులు, సిబ్బందికి రాష్ట్రపతి పతకం, కేంద్ర హోంమంత్రి పతకాలు అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా సీఎం ఎంకే స్టాలిన్ తాజాగా తీసుకున్న ఈ కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. మహిళా పోలీసులకు 12 నెలల పాటు ప్రసూతి సెలవులు మంజూరు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. అంతేకాదు ప్రసూతి సెలవుల  అనంతరం తిరిగి విధుల్లో చేరిన మహిళా పోలీసులకు.. వారి తల్లిదండ్రులు లేదా భర్త ఉండే ప్రాంతం..ఏదైనా వారు ఎంపిక చేసుకున్న ప్రకారం 3 ఏళ్లపాటు ఉద్యోగం కల్పిస్తామని సీఎం స్టాలిన్ తెలిపారు.

పోలీసు శాఖ, వారి సంఘాల నుంచి వచ్చిన నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పోలీసులకు రాష్ట్రపతి పతకాలు, కేంద్ర హోంశాఖ పతకాలు, సీఎం పతకాలను సీఎం స్టాలిన్ అందజేశారు. హోంగార్డు నుంచి 7, అగ్నిమాపక శాఖ నుంచి 14, జైళ్ల శాఖ నుంచి 8 మంది కానిస్టేబుళ్లకు పతకాలు అందుకున్నారు. మొత్తం 158 కేంద్ర ప్రభుత్వ పతకాలు.. 301 ముఖ్యమంత్రి పతకాలు అందించారుమరి..తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.