iDreamPost

ఆ గ్రామంలో చెప్పులు ధరించరు…బయటి వారికి ఇదే రూల్! ఎందుకంటే..

Tamil Nadu: నేటి సమాజం సాంకేతిక రంగంలో దూసుకోపోతుంది. అలాంటి తరుణంలో కూడా కూడా ఆ గ్రామంలో చెప్పులు తీసి నడవాల్సిందే. చెప్పులు వేసుకుని నడిస్తే మాత్రం ఇక పరిస్థితి వేరేలా ఉంటుంది. మరి.. ఆ విచిత్రమైన ఊరు ఎక్కడంటే..

Tamil Nadu: నేటి సమాజం సాంకేతిక రంగంలో దూసుకోపోతుంది. అలాంటి తరుణంలో కూడా కూడా ఆ గ్రామంలో చెప్పులు తీసి నడవాల్సిందే. చెప్పులు వేసుకుని నడిస్తే మాత్రం ఇక పరిస్థితి వేరేలా ఉంటుంది. మరి.. ఆ విచిత్రమైన ఊరు ఎక్కడంటే..

ఆ గ్రామంలో చెప్పులు ధరించరు…బయటి వారికి ఇదే రూల్! ఎందుకంటే..

మనకు ఆరోగ్యం అనేది అతి ప్రధానమైనది. అందుకే శరీరాన్ని కాపాడుకునేందుకు అనేక జాగ్రత్తలు తీసుకుంటాము. ముఖ్యంగా బయటకు వెళ్లే సమయంలో చెప్పులు వేసుకోనిది అడుగు బయట పెట్టం. అలానే రెస్ట్ రూమ్ లోకి వెళ్లిన, వాష్ రూమ్ లోకి వెళ్లిన, పంట పొలాలకు వెళ్లినా.. ఇలా ఎక్కడకి వెళ్లిన చెప్పులు ఉండాల్సిందే. అలా ప్రతి ఒక్కరు చెప్పులను వినియోగిస్తుంటారు. అయితే ఓ గ్రామం గురించి చెబితే మాత్రం ఆశ్చర్యపోక మానరు. ఆ గ్రామంలోని ప్రజలందరూ చెప్పులేకుండా ఉంటారంట. అంతేకాక ఆఊర్లోకి వెళ్లే వారు కూడా చెప్పులు లేకుండానే రావాల్సిందే. మరి.. ఇలాంటి కఠినమైన నిబంధనలు ఎందుకు పెట్టుకున్నారు. ఆ గ్రామం ఏమిటి, ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

నేటి సమాజం సాంకేతిక రంగంలో దూసుకోపోతుంది. అలాంటి తరుణంలో కూడా కూడా ఆ గ్రామంలో చెప్పులు తీసి నడవాల్సిందే. చెప్పులు వేసుకుని నడిస్తే ఏమవుతుందిని ఆగ్రామస్తులను ప్రశ్నస్తే… మా ఇష్టం మాకూ కొన్ని ఆచారాలుంటాయి అంటున్నారు ఆ గ్రామస్తులు. తమిళనాడులోని వెల్లగావి  ఊర్లో ప్రజలు చెప్పు ధరించి తిరగరు. ఎవరైన ఎందుకు వేసుకోరు అని ప్రశ్నిస్తే అడిగితే.. తమ కారణాలు తమకున్నాయి అంటున్నారు. ఇది మీ మూఢ నమ్మకం అని ఎవ్వరైనా వారించి..ఆ గ్రామంలోకి రావాలని చూస్తే… అసలు రానివ్వరు.

ఈ గ్రామంలో పిల్లల నుంచి పండు ముసలి వరకు ఆ గ్రామంలోకి ప్రవేశించాలంటే చెప్పులు తీసి నడవడం కొన్నేళ్ల నుంచి సంప్రదాయంగా వస్తోంది.  మొత్తంగా ఆ గ్రామంలో వాళ్ళ కట్టు బాట్లు ఎంత కఠినంగా ఉన్నాయో పలువురు చెబుతున్నారు. వెల్లగావి అనే చిన్న గ్రామంలో  150కి పైగా కుటుంబాలు జీవిస్తున్నాయి.ఈ గ్రామం చుట్టూ దట్టమైన అడవిలో ఉంటుంది. అంతేకాక సమీపంలో సెలయేర్ల పరవళ్లతో ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. అయినా కూడా ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా చేర్చలేదు. అందుకు కారణం ఆ ఊరి పొలిమేర వచ్చాక ఎంతటి వారైనా సరే చెప్పులు తీసి రావాల్సిందే అంట. బయట వారైనా సరే ఆగ్రామానికి వస్తే చెప్పులు లేకుండానే ప్రవేశించారు. పూర్వికుల నుంచి ఈ కట్టుబాటు ఉందట. ఎవరైనా కాదంటే ఆ గ్రామంలోకి రానివ్వరు.

ఇక్కడి గ్రామస్తులు చెప్పులు వేసుకోకపోవడానికి కారణం ఏమిటంటే..ఇక్కడ ఇళ్ల కంటే గుళ్లు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ ఊరు ఉండే ప్రాంతంలో ప్రతి ప్రదేశంలో దేవుడు ఉంటాడని భావిస్తారు. అందుకే ప్రతి అక్కడి ప్రాంతాన్ని పవిత్రంగా భావిస్తారు ఆ ఊరి జనం. ఆ ప్రాంతంలో దేవుళ్లు తిరుగుతారని వారి నమ్మకం..అందుకే అక్కడి జనాలు చెప్పులేసుకోరు. ఎవరైనా కొత్తవారు కూడా ఈ గ్రామంలోకి రావలంటే..చెప్పులు బయట వదిలిరావాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఈ ఊరి నిబంధనలు తెలియజేస్తూ.. కొండ ప్రాంతంలో ప్రత్యేకంగా బోర్డులు కూడా ఏర్పాటు చేశారు.  మొత్తంగా ఈ ఊరు ప్రత్యేకమైన ఆచారలతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి