Vinay Kola
Vellore: ట్రాఫిక్ లో టూవీలర్స్ ప్రయాణీకుల సేఫ్టీ కోసం పోలీసులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. రూల్స్ పాటించే వారికి బహుమతులు ఇస్తున్నారు.
Vellore: ట్రాఫిక్ లో టూవీలర్స్ ప్రయాణీకుల సేఫ్టీ కోసం పోలీసులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. రూల్స్ పాటించే వారికి బహుమతులు ఇస్తున్నారు.
Vinay Kola
రోడ్డుపై టూ వీలర్ లో వెళుతున్నప్పుడు కచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవడం చాలా ముఖ్యం. లేదంటే యాక్సిడెంట్స్ జరిగి ప్రాణాలు పోతాయి. ఇంత చిన్న లాజిక్ తెలిసి కూడా చాలా మంది హెల్మెట్ పెట్టుకొని వెళ్లరు. ట్రాఫిక్ పోలీసులు ఎంత చెప్పినా కూడా వినరు. ఎంత ఫైన్ వేసినా కూడా మారరు. ఇంకా చేసిన తప్పులే చేస్తూ ఉంటారు. హెల్మెట్ పెట్టుకుంటే కంఫర్ట్ గా ఉండదని, జుట్టు రాలిపోతుందని ఇలా ఎందుకో రక రకాల కారణాల వలన హెల్మెట్ పెట్టుకోరు. అయితే ఈ సమస్యని కంట్రోల్ చేసేందుకు, ప్రజల్లో అవగాహన తెచ్చేందుకు పోలీసులు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా కానీ ప్రజలు మాట వినట్లేదు. అయితే తాజాగా ట్రాఫిక్ పోలీసులు ఒక ఐడియాని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. హెల్మెట్ ధరించి బైక్స్ నడిపేవారికి గిఫ్ట్ లు ఇస్తున్నారు. అవి కూడా చిన్న చిన్న గిఫ్ట్ లు కాదు.. టీవిలనే ఇచ్చేస్తున్నారు. ఇంతకీ ఎక్కడ ఈ గిఫ్ట్ లు ఇస్తున్నారు? దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఇక తమిళనాడులోని వేలూరు జిల్లాలో ప్రమాదాలను తగ్గించేందుకు డిసెంబర్ 1 వ తేదీ నుంచి కచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలని అధికారులు ప్రకటించారు. ఇక ఇప్పటికే జిల్లావ్యాప్తంగా ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమైన ప్రాంతాల్లో వాహనదారులు తప్పక హెల్మెట్ పెట్టుకొని రావాలని బ్యానర్‌లు, పోస్టర్‌లను కూడా అతికించారు. ఇంకా వీటితో పాటు జిల్లా వ్యాప్తంగా ట్రాఫిక్ పోలీసులు కొన్ని అవగాహన కార్యక్రమాలు కూడా చేశారు. హెల్మెట్ ధరించి వచ్చే వారిని ప్రొత్సహించే విధంగా పుష్పాలు, చాక్లెట్‌లు, బొమ్మలను అందజేసి స్వాగతం పలుకుతున్నారు. వేలూరు డీఎస్పీ పృథ్వీరాజ్ సౌకాన్ అధ్యక్షతన ట్రాఫిక్ పోలీసులు అనేక రకాలుగా జనాలకు అవగాహన కల్పిస్తున్నారు.
వేలూరు గ్రీన్ సర్కిల్‌లో ప్రతిఒక్కరూ హెల్మెట్ ధరించి రావాలని బొమ్మలను ఉంచి అవగాహన చేపట్టారు. హెల్మెట్ ధరించి వచ్చే వారికి బొమ్మలు, పెన్‌లను కూడా అందజేశారు. అయితే హెల్మెట్ లేకుండా వాహనం నడిపి వచ్చిన వారికి కరపత్రాలు అందజేసి అవగాహన కల్పించారు. ట్రాఫిక్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ రజనీ మాట్లాడుతూ డిసెంబర్ 1వ తేదీ నుంచి తరచూ హెల్మెట్ ధరించి వచ్చే వారిని గుర్తించి వారి వాహన నెంబర్‌లను నమోదు చేస్తామని అన్నారు. అంతేగాక వారిని లాటరీ ద్వారా సెలెక్ట్ చేసి వారికి పెద్ద ఎల్‌ఈడీ టీవీని గిఫ్ట్ గా ఇస్తామని తెలిపారు. ఈ విధంగా ట్రాఫిక్ పోలీసులు వేలూరులో ట్రాఫిక్ రూల్స్ పాటించే వారిని గిఫ్ట్ లతో ప్రోత్సాహిస్తున్నారు. ఇక ఈ విషయం గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.