టమాటా.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ట్రెండింగ్ లో ఉన్న పేరు. ఎందుకంటే అంతలా దీని ధర పెరిగిపోవడమే కారణం. టమాటా ధరలు సగటున కేజీ రూ .200పైగా ఉన్నాయి. ఒకనొక దశలో 300 వరకు కూడా దీని ధర వెళ్లింది. దాంతో టమాటా వైపు చూడటమే మానేశారు సగటు మధ్యతరగతి ప్రజలు. ఇక టమాటా రైతులపై దాడి చేసి కొందరు దుండగులు డబ్బులు, టమాటాలను ఎత్తుకెళ్లిన సంఘటనలు కూడా మనం చాలానే చూశాం. అదీకాక బౌన్సర్లను పెట్టి తమ టమాటాలను కాపాడుకున్నారు కూడా. ఇలాంటి పరిస్థితుల్లో ఓ ఇద్దరు రైతు సోదరులు పెద్ద మనసు చాటుకున్నారు.
రామన్, పుట్టస్వామి తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి జిల్లా కుందా గ్రామానికి చెందిన రైతు సోదరులు. వారికున్న పంట పొలంలో టమాటాలు సాగుచేశారు. ధరలు విపరీతంగా ఉండటంతో.. ఎలాంటి లాభం లేకుండా తక్కువ ధరకే తమ ఊరిలో టమాటాలను విక్రయిస్తున్నారు. బయట మార్కెట్ లో కేజీ టమాటా రూ. 200 పలుకుతున్న తరుణంలో తమ గ్రామంలో కేజీ టమాటాను కేవలం రూ. 80కే విక్రయిస్తున్నారు ఈ అన్నదమ్ములు. రేట్లు పెరగడంతో.. ప్రజలు ఇబ్బందులు పడతారని తక్కువ రేటుకే పంటను విక్రయిస్తున్నారు వీరు. వ్యాపారులు అధిక ధర ఇస్తామని ఆఫర్ చేసినా.. వారు ఆశపడకుండా గ్రామంలోనే టమాటాలు అమ్ముతున్నారు. ఇప్పటి వరకు వారు వెయ్యి కేజీల వరకు టమాటాలను అమ్మినట్లుగా చెప్పుకొచ్చారు. మరి దేశవ్యాప్తంగా టమాటా ధరలు మండిపోతున్న వేళ.. రైతు సోదరులు పెద్ద మనసు చేసుకుని ఇలా తక్కువ ధరకే టమాటాలను అమ్మడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదికూడా చదవండి: రామ్ చరణ్, అల్లు అర్జున్ లపై ఆసక్తికర కామెంట్స్ చేసిన సముద్రఖని!