Dharani
TN-Sanitation Worker Daughter Gr 2 Job: పారిశుద్ధ్య కార్మికుడి కుమార్తె.. కమిషనర్‌గా ఉద్యోగంలో చేరింది. కుమార్తె సాధించిన విజయం చూసి ఆ తండ్రి ఉప్పొంగిపోతున్నాడు. ఆ వివరాలు..
TN-Sanitation Worker Daughter Gr 2 Job: పారిశుద్ధ్య కార్మికుడి కుమార్తె.. కమిషనర్‌గా ఉద్యోగంలో చేరింది. కుమార్తె సాధించిన విజయం చూసి ఆ తండ్రి ఉప్పొంగిపోతున్నాడు. ఆ వివరాలు..
Dharani
తండ్రి పారిశుద్ధ్య కార్మికుడు.. కాయకష్టం చేసి బిడ్డను బాగా చదివించాడు. చిన్నతనం నుంచే బిడ్డకు చదువు గొప్పతనం గురించి నిత్యం చెబుతుండేవాడు. బాగా చదువుకుంటే.. జీవితంలో ఎంత గొప్ప స్థాయికి చేరుకోవచ్చో వివరించేవాడు. చిన్నప్పటి నుంచి తండ్రి చెప్పిన మాటలు ఆ యువతి మనసులో ముద్రించుకుపోయాయి. దాంతో చిన్నప్పటి నుంచే కష్టపడి చదవడం అలవాటు చేసుకుంది. తండ్రి పారిశుద్ధ్య కార్మికుడిగా పని చేస్తూ.. ఎలాంటి జీవితాన్ని గడుపుతున్నాడో స్వయంగా చూసిన ఆ యువతి.. తమ జీవితాలు మారాలంటే చదువే ఆయుధం అనుకుంది. దానితోనే తన తలరాత మార్చుకోవాలని భావించింది. ఆ దిశగా ఆమె చేసిన ప్రయత్నం విజయం సాధించి.. ఏకంగా కమిషనర్‌గా నియమితురాలైంది. పారిశుద్ధ్య కార్మికుడి కుమార్తె సాధించిన విజయం ఎందరికో ఆదర్శంగా నిలిచింది. ఆ వివరాలు..
తమిళనాడులో ఓ పారిశుద్ధ్య కార్మికుడి కుమార్తె తిరువారూర్ జిల్లాలోని ఓ మునిసిపాలిటీకి కమిషనర్ అయ్యారు. తన తాత, తండ్రి పారిశుద్ధ్య కార్మికులుగా జీవనం సాగించగా.. ఆయువతి మాత్రం చిన్నతనం నుంచి కష్టపడి చదివి గ్రూప్–2 ఉత్తీర్ణతతో కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించింది. ఆమెనే తిరువారూర్ జిల్లాలోని ఓ మునిసిపాలిటీకి కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన దుర్గ. వివరాల్లోకి వెళితే.. పుదుపాలం గ్రామానికి చెందిన శేఖర్, సెల్వి దంపతులకు దుర్గ ఏకైక కుమార్తె. శేఖర్ పారిశుద్ధ్య కార్మికుడిగా పని చేసేవారు.
చిన్నప్పటి నుంచి తండ్రి పడే కష్టాన్ని చూసిన దుర్గ.. తాను బాగా చదివి.. జీవితంలో ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించింది. అందుకు తగ్గట్టుగానే బాగా చదవడం ప్రారంభించింది. ఈ క్రమంలో మన్నార్‌గుడి ప్రభుత్వ పాఠశాలలో ప్లస్–2 వరకు చదవింది. ఆ తర్వాత ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్‌లో ఫిజిక్స్‌లో డిగ్రీ పూర్తి చేసింది. గ్రాడ్యూయేషన్ వరకు ఎంతో కష్టపడి చదవించిన తండ్రి.. దుర్గ ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండగానే.. 2015లో ఆమెకు వివాహం చేశాడు. మదురాంతకంకు చెందిన నిర్మల్ కుమార్‌తో అనూహ్యంగా వివాహంచేశారు.
దాంతో దుర్గ తన కల తీరదని నిరాశకు గురైంది. కానీ భార్య మనసు అర్థం చేసుకున్న దుర్గ భర్త.. తండ్రి స్థానంలో నిలిచి.. ఆమెను పోటీ పరీక్షల దిశగా ప్రోత్సాహించాడు. దాంతో పెళ్లి తర్వాత కూడా చదవడం ప్రారంభించిన దుర్గ.. తాజాగా గ్రూప్ 2లో ఉత్తీర్ణత సాధించి.. మున్సిపాలిటీకి కమిషనర్‌గా నియమితురాలయ్యారు. ఉన్నత ఉద్యోగం సాధించిన కుమార్తె దుర్గను చూసి ఆమె తండ్రి పొంగిపోయాడు.