Keerthi
సాధారణంగా పెళ్లినాటి ప్రమాణాలు గురించి అందరికీ తెలిసిందే. కానీ, భర్తకు స్వేచ్ఛనిస్తానంటూ ప్రత్యేకంగా ప్రమాణాలు ఇంత వరకు ఎక్కడ వినడం, చూడటం కానీ జరగలేదు. కానీ, తాజాగా ఓ పెళ్లిలో మాత్రం నవ వధువు తన భర్తకు స్వేచ్ఛనిస్తానని పెళ్లి ప్రమాణంతో పాటు స్టాంప్ పేపర్ పై సంతకం చేసింది. ఇంతకీ ఈ విచిత్ర ప్రమాణాలు ఎక్కడ జరిగాయో తెలుసుకుందాం.
సాధారణంగా పెళ్లినాటి ప్రమాణాలు గురించి అందరికీ తెలిసిందే. కానీ, భర్తకు స్వేచ్ఛనిస్తానంటూ ప్రత్యేకంగా ప్రమాణాలు ఇంత వరకు ఎక్కడ వినడం, చూడటం కానీ జరగలేదు. కానీ, తాజాగా ఓ పెళ్లిలో మాత్రం నవ వధువు తన భర్తకు స్వేచ్ఛనిస్తానని పెళ్లి ప్రమాణంతో పాటు స్టాంప్ పేపర్ పై సంతకం చేసింది. ఇంతకీ ఈ విచిత్ర ప్రమాణాలు ఎక్కడ జరిగాయో తెలుసుకుందాం.
Keerthi
ఒకప్పుడు పెళ్లంటే నూరేళ్ల పంట అనుకునే వారు. కానీ, ప్రస్తుతం కాలంలో నూరేళ్ల మంట అనేలా చాలామంది ఫీల్ అవుతున్నారు. అందుకు కారణం.. పెళ్లైతే బాధ్యతలు, అన్నిటికీ అబ్జెక్షన్స్, లేని పోని వివాదాలు.. ఇలా చెప్పుకుంటే పోతే ఒకటా.. రెండా.. దాంపత్య జీవితంలో చెప్పలేనిది, దాచుకున్నదంటూ ఏమీ ఉండదు. ప్రతిదీ భారంలా భావిస్తుంటారు. ఒకనొక కాలంలో పెళ్లి చేసుకున్నాక స్వేచ్ఛ అనేదే లేకుండా పోయిందంటూ బాధపడుతుంటారు. ఇలా బాధపడినవారిలో అమ్మాయిలే కాదు.. అబ్బాయిలు కూడా ఉంటారు. అందుకే చాలామంది నెత్తి మీద జుత్తు రాలిపోయిన, 30 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోకుండా.. స్టిల్ బ్యాచులర్ గానే జీవితం గడిపేస్తుంటారు. కానీ, తాజాగా జరిగిన ఓ సంఘటనలో మాత్రం పెళ్లైన తర్వాత కూడా ఫుల్ స్వేచ్ఛను ఇస్తానంటూ ఓ వధువు ప్రమాణం చేసింది. అంతేకాదండోయ్.. ఏకంగా స్టాంప్ పేపర్ పై సంతకం కూడా చేసింది. అయితే వినడానికి కాస్త వింతగా, విడ్డూరంగా ఉన్నా మీరు విన్నది నిజమేనండి. మరీ, ఇంతకీ పెళ్లిలో ఈ విచిత్ర ప్రమాణాలు ఎక్కడ జరిగాయో తెలుసుకుందాం.
సాధారణంగా పెళ్లినాటి ప్రమాణాలు గురించి అందరికీ తెలిసిందే. కానీ, భర్తకు స్వేచ్ఛనిస్తానంటూ ప్రత్యేకంగా ప్రమాణాలు ఇంత వరకు ఎక్కడ వినడం, చూడటం కానీ జరగలేదు. కానీ, తాజాగా ఓ పెళ్లిలో మాత్రం నవ వధువు తన భర్తకు స్వేచ్ఛనిస్తానని పెళ్లి ప్రమాణంతో పాటు స్టాంప్ పేపర్ పై సంతకం చేసింది. అయితే ఈ విచిత్ర సంఘటన తమిళనాడులోని మైలాడుదురై జిల్లాలో జరిగింది. సీర్గాళి సమీప తెన్పాడికి చెందిన ముత్తుకు మార్కూకు అనే అబ్బాయికి కురింజపాడికి చెందిన పవిత్ర అనే యువతితో సోమవారం వివాహం జరిగింది. అయితే ఈ వేడుకల్లో వరుడు ముత్తుకుమార్ స్నేహితులు.. వివాహం తర్వాత ఇక తమని కలవడేమోనని తెగ బాధపడ్డారు. ఇక దీనికి పరిష్కారంగా వరుడు స్నేహితులు.. రూ.100 స్టాంప్ పేపర్ తీసుకొచ్చి అందులో.. పెళ్లయిన తర్వాత కూడా.. నా భర్త తన స్నేహితులతో ఆనందంగా గడపడానికి తాను అనుమతిస్తానని, అలాగే వారితో విహారయాత్రలకు వెళ్లకుండా అడ్డుకోనని భార్య చెబుతున్నట్లు రాశారు.
ఇక ఆ స్టాంప్ పేపరును వివరించి దానిపై సంతకం పెట్టిమని వధువుకి కోరారు. అయితే వధువు కూడా ఈ ప్రమాణానికి ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయకుండా.. సంతోషంగా సంతకం పెట్టింది ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకు ఇలాంటి వింత ప్రమాణాలు, సంతకాలనేవి ఇంతవరకు ఎక్కడ జరగలేదు. ముఖ్యంగా భర్త స్నేహితులు కోరిన ప్రమాణాలకు భార్య ఎటువంటి సందేహం కూడా తెలపకుండా ఒప్పుకోవడం అనేది కూడా ఇదే మొదటిసారి కావడం గమన్హారం. మరీ, పెళ్లి తర్వాత కూడా తన భర్తకు పూర్తి స్వేచ్ఛను ఇస్తానని సంతోషంగా ప్రమాణం చేసి సంతకం చేసిన ఈ నవ వధువుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.